S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/10/2016 - 07:39

బొబ్బిలి, ఆగస్టు 9: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎపిఐఐసి చైర్మన్ పి కృష్ణయ్య స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు.

08/09/2016 - 00:14

న్యూఢిల్లీ, ఆగస్టు 8: వచ్చే నెల 29న భారీ స్పెక్ట్రమ్ వేలానికి తెరదీస్తోంది కేంద్ర ప్రభుత్వం. మునుపెన్నడూ లేనివిధంగా 5.63 లక్షల కోట్ల రూపాయల స్పెక్ట్రమ్‌ను ఈ వేలంలో పెడుతోంది. టెలికామ్ సేవల నాణ్యతను పెంచడంలో ఈ భారీ స్పెక్ట్రమ్ వేలం దోహదపడగలదని సోమవారం దరఖాస్తు ఆహ్వాన ప్రకటన విడుదల సందర్భంగా టెలికామ్ శాఖ కార్యదర్శి జెఎస్ దీపఖ్ అన్నారు.

08/09/2016 - 00:13

న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ మొబైల్ ఫోన్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ రిఫ్రిజిరేటర్ విభాగంలోకి ప్రవేశించింది. వాషింగ్ మెషీన్లతోపాటు రిఫ్రిజిరేటర్ల ప్రకటనకర్తగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఉంటారని ఆ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

08/09/2016 - 00:12

న్యూఢిల్లీ, ఆగస్టు 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ తన చివరి ద్రవ్యసమీక్షను మంగళవారం నిర్వహించనున్నారు. వచ్చే నెలతో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనున్నది తెలిసిందే.

08/09/2016 - 00:12

ముంబయి, ఆగస్టు 8: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 15 నెలలకుపైగా గరిష్ఠ స్థాయిని అందుకుంది. 28.20 పాయింట్లు పెరిగి 8,700 స్థాయికి ఎగువన 8,711.35 వద్ద నిలిచింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ కూడా 104.22 పాయింట్లు పుంజుకుని 28,182.57 వద్ద స్థిరపడింది. గత వారం చివరి రెండు రోజులు కూడా సూచీలు లాభాలను అందుకున్నది తెలిసిందే.

08/09/2016 - 00:11

సోమవారం న్యూఢిల్లీలో టొయోటా దేశీయ మార్కెట్‌లోకి ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వెర్షన్ కారును విడుదల చేసింది.
ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ. 19.63 లక్షలు

08/09/2016 - 00:09

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియామి సోమవారం కోల్‌కతాలో రెడ్‌మి 3ఎస్, 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. 3ఎస్ ధర రూ. 6,999, 3ఎస్ ప్రైమ్ ధర రూ. 8,999

08/09/2016 - 00:06

న్యూఢిల్లీ, ఆగస్టు 8: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు రాజ్యసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సోమవారం లోక్‌సభ ఆమోదం కూడా లభించింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ పన్ను ఎగవేతలకు జిఎస్‌టి కళ్లెం వేస్తుందన్నారు. అలాగే జిఎస్‌టి రేటు ఆమోదయోగ్యంగానే ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి అమలుకాగలదన్న విశ్వాసాన్ని పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేశాయి.

08/09/2016 - 00:03

విశాఖపట్నం, ఆగస్టు 8: దేశంలో వివిధ ప్రాంతాల్లో నాలుగు లక్షల క్వింటాళ్ల మేర జనపనార సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జెసిఐ) సిఎండి డాక్టర్ కెవిఆర్ మూర్తి తెలిపారు. జెసిఐ సిఎండిగా బాధ్యతలు స్వీకరించాక సోమవారం తొలిసారిగా విజయనగరం రీజియన్‌లో పర్యటించేందుకు ఆయన వచ్చారు.

08/09/2016 - 00:03

న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ ఆటోరంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 18.13 శాతం పెరిగింది. ఈసారి 883.10 కోట్ల రూపాయల లాభాన్ని పొందిన సంస్థ.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్ వ్యవధిలో 747.54 కోట్ల రూపాయల లాభంతో సరిపెట్టుకుంది.

Pages