S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/09/2016 - 00:01

న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో భారీగా క్షీణించింది. 74.5 శాతం తగ్గి 217.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 851.6 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది.

08/08/2016 - 23:57

విశాఖపట్నం, ఆగస్టు 8: నేపాల్‌కు సంబంధించిన ఎగుమతి, దిగుమతుల (ఎగ్జిమ్) కార్గో హ్యాండ్లింగ్‌కు విశాఖ పోర్టు ట్రస్టు సిద్ధమైంది. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు నేపాల్‌కు చెందిన సరకు రవాణా సంస్థలతో అవగాహనకు వచ్చాయి. భారత్, నేపాల్ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా నేపాల్‌కు చెందిన ఎగుమతి, దిగుమతులను విశాఖ పోర్టు నుంచి నిర్వహించేందుకు ఒప్పందం జరిగింది.

08/08/2016 - 05:21

ముంబయి, ఆగస్టు 7: మనీ లాండరింగ్ కేసుతో పాటు వేలాది కోట్ల రూపాయల రుణాలను చెల్లించకుండా బ్యాంకులను మోసగించిన కేసులో ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, మరికొందరు ఇతర నిందితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఉచ్చు బిగిస్తోంది.

08/08/2016 - 05:18

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రాజకీయ నేతలు సంస్కరణలు సమర్థించేలా చేసిన ఘనత ఆకాంక్షలతో కూడిన సమాజానిదేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం అంటూ, ప్రపంచ ఆర్థిక మాంద్యం, భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తతలను అధిగమించి భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉందన్నారు.

08/08/2016 - 05:17

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యపరపతి విధానం సమావేశం, కార్పొరేట్ సంస్థల చివరి దశ త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు వచ్చే వారం మార్కెట్ ధోరణిని నిర్ణయిస్తాయని నిపుణులు అంటున్నారు. వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించే అవకాశముందని వారన్నారు.

08/08/2016 - 05:17

న్యూఢిల్లీ, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వస్తే విలాసవంతమైన కార్లు, ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రెడీమేడ్ దుస్తుల ధరలు తగ్గుతాయి. అయితే అధిక పన్ను వలన మొబైల్ ఫోన్లు, బ్యాంకింగ్, బీమా సేవలు, టెలిఫోన్ బిల్లులు, విమానయాన చార్జీలు పెరుగుతాయి.

08/08/2016 - 05:16

విజయవాడ, ఆగస్టు 7: ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దాన్ని రాష్ట్భ్రావృద్ధికి ఉపయోగించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారు. అదే క్రమంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో విజ్ఞాన ఆర్థిక మండలి (నాలెడ్జ్ ఎకానమీ జోన్ - కెఇజెడ్) ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. ప్రపంచంలోనే తొలి ప్రయోగాత్మక ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేపడుతోంది.

08/08/2016 - 05:15

విశాఖపట్నం, ఆగస్టు 7: తక్కువ ఖర్చుతో ప్రతి ఇంటికి వేగవంతమైన ఇంటర్నెట్ సహా టివి, టెలిఫోన్ సౌకర్యాన్ని అందించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సెట్ టాప్ బాక్స్‌ల ధర వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. ఈ నెలాఖరు నాటికి ఉత్తరాంధ్రలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు. దీనికి తోడు భారీ సంఖ్యలో సెట్‌టాప్ బాక్స్‌ల లభ్యత కూడా మరో సమస్యగా మారనుంది.

08/08/2016 - 05:14

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రతి నెలా కనీసం ఒకటైనా బైబ్యాక్ ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో రూ 16,000 కోట్లకు పైగా నిధులు తన డిజినె్వస్ట్‌మెంట్ ఖజానాకు చేరుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

08/07/2016 - 01:01

న్యూఢిల్లీ, ఆగస్టు 6: విజయ్ మాల్యాకు ఓ ఢిల్లీ కోర్టు శనివారం నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. మాల్యాపై ఇది నాలుగో నాన్-బెయలబుల్ వారెంట్. 2012 లో చెక్ బౌన్సు కేసుకు సంబంధించి ఈ వారెంట్‌ను ఇక్కడి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమీత్ ఆనంద్ జారీ చేయగా, నవంబర్ 4న కోర్టుకు మాల్యా హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.

Pages