S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/14/2016 - 00:13

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించే బాధ్యతను రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌కు అప్పగించింది. 50 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

07/14/2016 - 00:12

ముంబయి, జూలై 13: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ స్వల్పంగా 7.04 పాయింట్లు పెరిగి 27,815.18 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 1.55 పాయింట్లు పడిపోయి 8,519.50 వద్ద నిలిచింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలను అందుకుంటున్నది తెలిసిందే.

07/14/2016 - 00:11

న్యూఢిల్లీ, జూలై 13: జనరల్ యాంటి అవాయిడెన్స్ రూల్స్ (గార్) నుంచి పి-నోట్ మెచ్యూరిటీలకు తప్పక మినహాయింపు ఇవ్వాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ డిమాండ్ చేసింది. పార్టిసిపేటరీ నోట్ల మెచ్యూరిటీపై విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ)కు గార్‌ను అమలు చేయవద్దని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ అన్నారు. పి-నోట్లకు గార్ నిబంధనల అమలుతో పెట్టుబడులకు విఘాతమని ఆయన అభిప్రాయపడ్డారు.

07/14/2016 - 00:10

విశాఖపట్నం, జూలై 13: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కేజ్ కల్చర్ ద్వారా ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న తిలాపియా రకం చేపను దేశీయంగా మార్కెట్ చేసేందుకు వీలుగా మత్స్యశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విదేశీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని సాగు చేస్తున్నప్పటికీ, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునేందుకు స్థానిక మార్కెట్‌పై దృష్టి సారించారు.

07/13/2016 - 07:34

న్యూయార్క్, జూలై 12: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత పారితోషికం తీసుకుంటున్న టాప్-100 సెలబ్రిటీల్లో ఒకరుగా నిలిచాడు. కింగ్ ఖాన్‌తోపాటు అక్షయ్ కుమార్ కూడా టాప్- 100లో స్థానం దక్కించుకున్నాడు.

07/13/2016 - 07:32

న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో మిలియనీర్ల సంఖ్య పెరిగిపోతోంది. 2015 డిసెంబర్ నాటికి భారత్‌లో 2,36,000 అపర కుబేరులు (హెచ్‌ఎన్‌డబ్ల్యుఐ) ఉన్నారని, వీరి సంపద విలువ 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉందని న్యూ వరల్డ్ వెల్త్ రూపొందించిన ‘ఇండియా 2016 వెల్త్ రిపోర్టు’ ద్వారా తెలుస్తోంది.

07/13/2016 - 07:31

విజయవాడ, జూలై 12: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతరంగ అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించి అమలుకు సిద్ధమైంది. చేనేత కార్మికులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేయనుంది. చేనేత, జౌళి శాఖ 2016-17 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాలు-కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ప్రణాళిక, ప్రణాళికేతర మొత్తం రూ. 125 కోట్ల 84 లక్షల 13 వేలుగా అంచనా వేసింది. నిరుడుతో పోలిస్తే అన్ని పథకాలకు నిధులు పెరిగాయి.

07/13/2016 - 07:31

చెన్నై, జూలై 12: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీదారు ఫాక్స్‌కాన్.. నోకియా మాజీ సిబ్బందిని పనిలోకి తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటు చేసిన ఫాక్స్‌కాన్ ఇండియా ఉత్పాదక కేంద్రంలో పనిచేసేందుకు చెన్నైలోని శ్రీపెరుంబుదుర్ నోకియా ప్లాంట్‌లో పనిచేసినవారిని నియమించుకుంటోంది. నోకియా మొబైల్స్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన నేపథ్యంలో చెన్నై ప్లాంట్ నిరుడు మూతబడినది తెలిసిందే.

07/13/2016 - 07:30

హైదరాబాద్, జూలై 12: కెన్యట్టా నేషనల్ హాస్పిటల్, ఎయిర్‌టెల్ కెన్యాతో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ రెండు అవగాహన ఒప్పందాల (ఎమ్‌ఒయు)ను కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం ఇక్కడ అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన ఓ ప్రకటన తెలియజేసింది.

07/13/2016 - 07:30

విశాఖపట్నం, జూలై 12: దేశంలోని ప్రధాన ఓడరేవుల ఆధునీకరణ చర్యల్లో భాగంగా విశాఖ పోర్టు ట్రస్టులో వెస్సల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (విటిఎంఎస్)ను ఆ పోర్టు ట్రస్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు ప్రారంభించారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ పిఎల్ హరనాథ్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్న కార్యక్రమంలో పోర్టు ఆవరణలోని సిగ్నల్ స్టేషన్-1 వద్ద మంగళవారంనూతన వ్యవస్థను కృష్ణబాబు ప్రారంభించారు.

Pages