S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/13/2016 - 07:29

న్యూఢిల్లీ, జూలై 12: చైనా రైల్వే కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (సీఆర్‌సీసీ) ప్రధాన ఆర్థికవేత్త ఝావో జినుహ ఆధ్యర్వంలోని ఒక బృందంతో ఏపి ప్రభుత్వం పరస్పర సహకారంపై చర్చలు జరిపింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, శాస్త్ర సాంకేతికశాఖ సహాయ మంత్రి సుజనా చౌదరిలు ఈ బృందంతో ఏపిభవన్‌లోని గురజాడ మందిరంలో భేటి అయ్యారు.

07/13/2016 - 07:29

ముంబయి, జూలై 12: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లో ముగిశాయి. సోమవారం భారీ లాభాల నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 181.45 పాయింట్లు పుంజుకుని 11 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 27,808.14 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 53.15 పాయింట్లు అందుకుని 8,500 స్థాయికి ఎగువన 8,521.05 వద్ద నిలిచింది.

07/12/2016 - 00:34

న్యూఢిల్లీ, జూలై 11: ఇండస్‌ఇండ్ బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 26 శాతం పెరిగింది. ఈసారి 661.38 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 525.04 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం ఈ ఏప్రిల్-జూన్‌లో 4,264.66 కోట్ల రూపాయలుగా ఉంటే, క్రిందటిసారి 3,485.11 కోట్ల రూపాయలుగా నమోదైంది.

07/12/2016 - 00:33

న్యూఢిల్లీ, జూలై 11: స్విట్జర్లాండ్‌కు చెందిన సిమెంట్ తయారీ దిగ్గజం లఫర్జ్‌హోలీసిమ్.. లఫర్జ్ ఇండియాలోని తమ ఆస్తులను సబ్బులు, రసాయనాల తయారీ సంస్థ నిర్మా లిమిటెడ్‌కు అమ్మేస్తోంది. దాదాపు 9,400 కోట్ల రూపాయల (1.4 బిలియన్ డాలర్లు)కు లఫర్జ్ ఇండియా ఆస్తులను నిర్మా కొనుగోలు చేస్తోంది. ‘లఫర్జ్ ఇండియా ఆస్తులను సుమారు 1.4 బిలియన్ డాలర్లకు నిర్మా లిమిటెడ్‌కు అమ్మేస్తున్నాం.

07/12/2016 - 00:33

ముంబయి, జూలై 11: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఉగ్యోగ గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెట్టడం భారతీయ మార్కెట్‌కు కలిసొచ్చింది. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఆయా సంస్థల ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అంచనాలు మదుపరులను పెట్టుబడుల వైపునకు నడిపించాయి.

07/12/2016 - 00:27

విజయవాడ, జూలై 11: నవ్యాంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ల్యూ మాక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్షిణ భారత సీనియర్ ఉపాధ్యక్షుడు ద్వివేది అన్నారు. అమరావతిలో సోమవారం ల్యూమాక్స్ ప్రతినిధుల బృందం పర్యటించింది.

07/12/2016 - 00:24

విజయవాడ, జూలై 11: ప్రస్తుతం వ్యవసాయమంటేనే రైతులు హడలిపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులతో సేద్యం చేయడానికి సాహసించలేక పోతున్నారు. భూమినే నమ్ముకున్న కొందరు రైతన్నలు తప్పనిసరి పరిస్థితుల్లో సాగుకు సిద్ధమవుతున్నప్పటికీ తుపాన్లు, తెగు ళ్లు, ఎరువులు, పురుగుల మందుల ధరలు కొండంత పెరిగిన కూలీల కూలి రేట్లు.. ఇలా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

07/12/2016 - 00:20

న్యూఢిల్లీ, జూలై 11: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్.. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దక్షిణాసియా దేశాల్లో కార్డియోవ్యాస్కులర్ సమస్యను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. 1983లో అపోలో హాస్పిటల్స్‌ను ప్రతాప్ రెడ్డి ప్రారంభించగా, దీనికి దేశవ్యాప్తంగా మొత్తం 64 హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిలో 9,215 పడకలుండగా, 2,200 ఫార్మసీలు కూడా ఉన్నాయి.

07/11/2016 - 00:56

దార్-ఎస్-సలామ్, జూలై 10: ఆహార భద్రత, సహజవాయు రంగాలు సహా అనేక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, టాంజానియా నిర్ణయించాయి. దీంతో టాంజానియాలో కీలకమైన నీటి సరఫరా ప్రాజెక్టు నిర్మాణం కోసం 92 మిలియన్ డాలర్ల రుణ సహాయాన్ని అందజేస్తామని భారత్ ప్రకటించడంతో పాటు ఆదివారం ఆ దేశంతో ఐదు ఒప్పందాలను కుదుర్చుకుంది.

07/11/2016 - 00:53

విజయవాడ, జూలై 10: నాలుగో పారిశ్రామిక విప్లం దిశగా అడుగులు వేయని దేశాలు వెనుకబడిపోతాయని రష్యాలో జరుగుతున్న ఇన్నోఫ్రోమ్-2016 సదస్సు అభిప్రాయపడింది. భారత్ భాగస్వామిగా జరుగుతున్న ఈ సదస్సు రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌లో ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. భారతదేశం తరఫున హాజరైన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభోపన్యాసం చేశారు. పెట్టుబడులకు భారత దేశం సరైన గమ్యస్థానమని అన్నారు.

Pages