S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/10/2016 - 01:51

న్యూఢిల్లీ, జూలై 9: దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పటికీ పుజుకోని నేపథ్యంలో సేవింగ్స్ పథకాలపై ఎక్కువ వడ్డీ రేట్లు ఇవ్వడం భావ్యమా అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. దీనివల్ల రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడమేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత నెలకొంటోందని ఆయన అభిప్రాయ పడ్డారు. సేవింగ్స్ పథకాలపై అధిక వడ్డీ రేట్లు ఉండే విచిత్ర పరిస్థితి మన దేశంలోనే ఉందని ఆయన అన్నారు.

07/10/2016 - 01:49

విజయవాడ, జూలై 9: ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండి, రాష్ట్భ్రావృద్ధికి దోహదపడే పారిశ్రామిక రంగం లక్ష్యాలను అధిగమించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు మిషన్లలో ఒకటైన ఇండస్ట్రీ సెక్టార్ మిషన్ మంచి ఫలితాలను ఇస్తోంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వం భారీ అంచనాలతో ముందుకు సాగుతోంది. మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబుల ప్రవాహం వెల్లువెత్తే అవకాశం ఉంది.

07/10/2016 - 01:47

న్యూఢిల్లీ, జూలై 9: మెటల్స్ రంగంలో ట్రేడింగ్‌కు వీలుకల్పించేలా త్వరలో కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నామని, ఇందుకు సంబంధించిన అనుమతి కోసం మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీని ఆశ్రయించామని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ) శనివారం వెల్లడించింది. ‘బాంబే స్టాక్ ఎక్స్‌చేంజిలో కమోడిటీ డెరివేటివ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం.

07/09/2016 - 08:14

ప్రిటోరియా, జూలై 8: భారత్, దక్షిణాఫ్రికాలకు చెందిన ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు శుక్రవారం 8 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర భాగస్వామ్యాన్ని పెంచుతూ ఈ ఎనిమిది అవగాహనా ఒప్పందాలు (ఎమ్‌ఒయు) కుదిరాయి.

07/09/2016 - 08:12

న్యూఢిల్లీ, జూలై 8: నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ సంస్థ.. శుక్రవారం తమ ప్రతిష్ఠాత్మక చౌక మొబైల్‌ఫోన్ ‘ఫ్రీడమ్ 251’ పంపిణీని ప్రారంభించింది. హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఫోన్లు ఆర్డర్ చేసిన కస్టమర్లకు అందించింది.

07/09/2016 - 08:11

న్యూఢిల్లీ, జూలై 8: భారీ స్థాయిలో స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సెప్టెంబర్‌లో మెగా వేలం నిర్వహించే వీలుంది. దీనికి సంబంధించి తుది నిర్ణయం త్వరలో వెలువడనుండగా, ఈ వేలంతో ప్రభుత్వ ఖజానాకు 5.66 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని టెలికామ్ శాఖ నూతన మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. ‘సెప్టెంబర్‌లో పెద్ద ఎత్తున స్పెక్ట్రమ్ వేలానికి వస్తుందని మేము భావిస్తున్నాం.

07/09/2016 - 08:10

విజయవాడ, జూలై 8: దీర్ఘకాలంగా వెనుకబడి, ఉపాధి అవకాశాలకు నోచుకోని, సామాజిక న్యాయానికి దూరంగా ఉన్న ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప జిల్లాలు నేడు బ్యాంకుల నుంచి రుణాలు పొంది జీవనోపాధి కల్పించుకోవడంలో అగ్రస్థానంలో నిలిచాయి. సాధారణంగా రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు ముందుంటాయి. ప్రకాశం, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు కరువుకు నిలయాలు.

07/09/2016 - 08:09

హైదరాబాద్, జూలై 8: గల్ఫ్‌లోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఉపాధి కల్పనకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పొట్టచేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

07/08/2016 - 02:33

ముంబయి, జూలై 7: వచ్చే వారం కార్పొరేట్ ఫలితాల సీజన్ ప్రారంభం అవుతూ ఉండడం, అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి.

07/08/2016 - 02:31

న్యూఢిల్లీ, జూలై 7: స్వచ్ఛందంగా నల్లధనం వెల్లడి పథకం కింద పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పన్నును వాయిదాల్లో చెల్లించడానికి అనుమతించాలన్న పరిశ్రమ అభ్యర్థనను సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది.

Pages