S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/24/2016 - 01:52

ముంబయి, జూన్ 23: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని భావిస్తున్న బ్రెగ్జిట్‌పై ఓ వైపు రెఫరెండం కొనసాగుతున్నప్పటికీ దీనికి వ్యతిరేకంగానే తీర్పు రావచ్చన్న తాజా సంకేతాల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లు ఊహించని విధంగా లాభాల బాటలో సాగాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 237 పాయింట్లు లాభపడి మళ్లీ 27 వేల పాయింట్ల మార్క్‌ను దాటింది.

06/24/2016 - 01:50

లండన్, జూన్ 23: ఐరోపా ఖండంలో అత్యంత కీలక మార్పులకు దారితీయనున్న బ్రెగ్జిట్ ఓటింగ్ పూర్తయింది. యురోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా వద్దా అన్న అంశంపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక ఫలితాలపై ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. వివిధ దేశాల మార్కెట్లపై దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతోందని మార్కెట్ నిపుణులు ఎదురుచూస్తున్నారు.

06/24/2016 - 01:47

న్యూఢిల్లీ, జూన్ 23: విమానయాన సంస్థలు దేవతలు కాకపోవచ్చు, కాని ఖచ్చితంగా దయ్యాలు మాత్రం కావు అని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం వ్యాఖ్యానించారు. విమానయాన టికెట్ల ధరలను ఏకపక్షంగా పెంచడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విమాన టికెట్ల ధరల పెరుగుదలకు సంబంధించిన అంశానికి ‘సులభమైన పరిష్కారం’ లేదని ఆయన స్పష్టం చేశారు.

06/24/2016 - 01:46

లండన్, జూన్ 23: యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలగాలా, వద్దా అనే దానిపై గురువారం జరుగుతున్న రెఫరెండంపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా, బెట్టింగ్ పరిశ్రమకు మాత్రం ఇది పెద్ద వరంగా పరిణమించింది. సాధారణంగా ఫుట్‌బాల్, క్రికెట్ లాంటి ఆటల్లో ఎవరు గెలుస్తారనే దానిపై పెద్దఎత్తున బెట్టింగ్‌లు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు వాటిన్నిటినీ ఈ ‘బ్రెగ్జిట్’ మించిపోయింది.

06/24/2016 - 01:45

ముంబయి, జూన్ 23: దేశీయ సంస్థలు ఈ ఏడాది మే నెలలో విదేశీ మార్కెట్ల నుంచి 1.32 బిలియన్ డాలర్ల రుణాలను సేకరించాయి. 2015 మే నెలలో భారత సంస్థలు విదేశీ మార్కెట్ల నుంచి సేకరించిన 2.39 బిలియన్ డాలర్ల రుణాల కంటే ఇవి 45 శాతం తక్కువని రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గురువారం వెల్లడించింది.

06/24/2016 - 01:44

విశాఖపట్నం, జూన్ 23: సరకు రవాణాలో విశాఖ పోర్టుట్రస్టుకు రోజురోజుకీ ప్రాధాన్యత పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం దీనిని గేట్‌వే పోర్టుగా ప్రకటించడంతో ఎగుమతి, దిగుమతుల్లో అత్యంత శరవేగంగా పురోగతి సాధించేందుకు అవకాశం ఏర్పడింది. ఇందులో భాగంగా రైల్వేపరంగా తగిన ఒప్పందాలు చేసుకునేందుకు గురువారం నేపాల్ నుంచి అత్యున్నత స్థాయి అధికారిక బృందం ఇక్కడకు వచ్చింది.

06/24/2016 - 01:41

గోదావరిఖని, జూన్ 23: సింగరేణి పరిశ్రమ నుంచి ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్ట్‌తోపాటు ఇతర విద్యుత్ థర్మల్ కేంద్రాలు, పరిశ్రమలకు జరుగుతున్న బొగ్గు రవాణాపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనజర్ రవీందర్ గుప్తా పర్యవేక్షించారు. గురువారం సాయంత్రం సికిందరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో రామగుండం రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి ఎన్టీపీసీ థర్మల్ కేంద్రానికి ఆయన చేరుకున్నారు.

06/24/2016 - 01:39

న్యూఢిల్లీ, జూలై 23: సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడమో లేదా డీలిస్టింగ్‌ను ఎంచుకోవడమో చేయాలని దేశంలో ఫ్రధాన స్టాక్ ఎక్స్‌చేంజి అయిన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ)428 కంపెనీలకు చివరి నోటీసు జారీ చేసింది. లిస్టింగ్‌కు సంబంధించిన వివిధ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ కంపెనీలకు చెందిన షేర్లు ఏడేళ్లకు పైగా సస్పెన్షన్ కింద ఉన్నాయి.

06/24/2016 - 01:38

న్యూఢిల్లీ, జూన్ 23: దేశీయంగా నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువును ఎక్కువమంది ఉపయోగించుకునేలా చేయడం ద్వారా దాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదాయం పన్ను శాఖ తన ఆధికారులను కోరింది.

06/24/2016 - 01:38

హైదరాబాద్, జూన్ 23: దేశంలో 2025 నాటికి అనలిటిక్స్ రంగంలో టర్నోవర్ 2 బిలియన్ డాలర్ల నుంచి 16 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, బిగ్ డేటా అనలిటిక్స్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని నాస్కాం ఉపాధ్యక్షుడు కెఎస్ విశ్వనాథన్ అన్నారు. గురువారం ఇక్కడ ఆయన బిగ్ డేటా అనలిటిక్స్ 2016 సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే పదేళ్లలో ఈ పరిశ్రమ ఎనిమిది రెట్లు పెరుగుతుందన్నారు.

Pages