S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/17/2016 - 06:52

పులివెందుల, జూన్ 16: కడప జిల్లా పులివెందులలోని ఎపికార్ల్‌లో జినోమిక్స్ కంపెనీ మూడు రకాల వ్యాక్సిన్లు తయారు చేసిందని జినోమిక్స్ ఎండి రత్నగిరి పేర్కొన్నారు. గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల ఎపికార్ల్‌లో ఆవు గర్భాశయంలో వచ్చే వ్యాధి, పాల పొదుపునకు సంబంధించి వ్యాధి, టిబికి వ్యాక్సిన్లను మొట్టమొదటిసారి తయారు చేశామన్నారు.

06/17/2016 - 06:50

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య (టిఏ.్ఫ్యప్సీ) అధ్యక్షునిగా రవీంద్రమోదీ, సీనియర్ ఉపాధ్యక్షుడిగా గౌర శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు రవీంద్రమోదీ మెసర్స్ హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండిగా పనిచేస్తున్నారు. బిఎస్‌సి ఆనర్స్, బిఎస్‌సి టెక్నాలజీ, ముంబాయిలోని యూనివర్శిటీ నుంచి టెక్నాలజీలో ఎంఎస్‌సి డిగ్రీలను పొందారు.

06/17/2016 - 06:48

న్యూఢిల్లీ, జొన్ 16: బంగారం ధరలు గురువారం 30 వేల రూపాయల మార్క్‌ను దాటి పోయాయి. ఒక్కరోజే రూ.580 పెరగడంతో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాములు రూ. 30,250 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో పాటుగా దేశీయంగా కూడా డిమాండ్ పెరగడమే బంగారం ధర పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

06/17/2016 - 06:46

న్యూఢిల్లీ, జూన్ 16: బకాయిలను రాబట్టుకోవడానికి వచ్చే నెల వేలం వేసే సహారా గ్రూపు ఆస్తుల్లో సెబి మరో 16 ఆస్తులను చేర్చింది. వీటి రిజర్వ్ ధర రూ1245 కోట్లు. దీంతో మొత్తం రూ. 4345 కోట్ల విలువైన 42 ఆస్తులను సెబి వచ్చే నెల వేలం వేయనుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఆస్తులు కూడా వేలం వేయనున్నట్లు తెలుస్తోంది.

06/17/2016 - 06:46

న్యూఢిల్లీ, జూన్ 16: దేశంలో పప్పుదినుసుల ధరలు ఇప్పటికీ తారాస్థాయిలో కొనసాగుండటంతో మొబైల్ వ్యాన్ల ద్వారా కందిపప్పు, మినపపప్పును కిలో 120 రూపాయల చొప్పున అమ్మాలని కేంద్ర ప్రభుత్వం జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్‌సిసిఎఫ్)ను ఆదేశించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి హేమ్ పాండే అధ్యక్షతన జరిగిన అంతర్ మంత్రిత్వ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

06/16/2016 - 07:27

న్యూఢిల్లీ, జూన్ 15: గతకొంత కాలంగా క్షీణిస్తున్న దేశీయ ఎగుమతులు చమురేతర రంగాల చలవతో తిరిగి కోలుకుంటున్న సంకేతాలు కనిపించాయి. దీంతో గత నెల ఎగుమతులు స్వల్వ తగ్గుదలకే పరిమితమయ్యాయి. నిరుడుతో పోల్చితే ఈ మే నెలలో 0.79 శాతం పడిపోయి 22.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 13.16 శాతం తగ్గి 28.44 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 6.27 బిలియన్ డాలర్లుగా ఉంది.

06/16/2016 - 07:24

హైదరాబాద్, జూన్ 15 : ఐటి, ఐటి అనుబం ధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. గత 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటి, ఐటి అనుబంధ వార్షిక నివేదికను ఇక్కడ (బేగంపేటలోని టూరిజం ప్లాజా) బుధవారం విడుదల చేశారు.

06/16/2016 - 07:23

విశాఖపట్నం, జూన్ 15: స్మార్ట్‌సిటీగా మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) రూపుదిద్దుకోవడమే తరువాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో పాటు ఇతర సంస్థ మార్గాల ద్వారా రూ. 1,601 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు ఈ నెల 26న శ్రీకారం చుట్టనున్నారు.

06/16/2016 - 07:23

ముంబయి, జూన్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను అందుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మదుపరులను ఉత్సాహపరిచాయి. కేంద్ర కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో మదుపరులు పెట్టుబడులతో ముందుకొచ్చారు.

06/16/2016 - 07:22

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐకి దాని అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకునేందుకు లైన్ క్లియరైంది. ఈ విలీనంతో ఎస్‌బిఐ అంతర్జాతీయ స్థాయి బ్యాంకుగా ఎదుగుతుందన్న విశ్వాసాన్ని ఎప్పట్నుంచో వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆ దిశగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంది.

Pages