S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/15/2016 - 07:58

కోల్‌కతా, జూన్ 14: దేశంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమలులోకి తీసుకురావాలన్న ప్రతిపాదనకు దాదాపు అన్ని రాష్ట్రాలు మద్దతు తెలిపాయని, అయితే తమిళనాడు మాత్రం దీనిపై ‘కొన్ని అభ్యంతరాలను’ వ్యక్తం చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీర్ఘ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న జిఎస్‌టిపై మంగళవారం కోల్‌కతాలో ఆయన సాధికార కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

06/15/2016 - 07:56

ముంబయి, జూన్ 14: టోకు ధరల ద్రవ్యోల్బణం మే నెలలో పెరగడంతో పాటుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం, ఐరోపా కూటమినుంచి బ్రిటన్ నిష్క్రమణపై రెఫరెండం లాంటి అంతర్జాతీయ పరిణామాల భయాల కారణంగా మదుపరులు మార్కెట్‌కు దూరంగా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలాంటి లాభనష్టాలు లేండా నిలకడగా ముగిశాయి.

06/15/2016 - 07:55

న్యూఢిల్లీ, జూన్ 14: అక్రమ మార్గాల్లో నిధుల సేకరణ పథకాలపై కొరడా ఝళిపించడం ద్వారా మదుపరులనుంచి వసూలు చేసి తిరిగి చెల్లించకుండా ఉన్న వారినుంచి 55,000 ఓట్ల రూపాయలు పైగా సొమ్ములను రాబట్టడానికి మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబి చర్యలు ప్రారంభించింది.

06/15/2016 - 07:54

అనంతపురం, జూన్ 14: అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఏర్పాటు చేసిన ఆల్ట్రా మెగా సోలార్ పార్క్‌లో విద్యుదుత్పత్తి అంచెలంచెలుగా సాగుతోంది. నెలక్రితం ప్రారంభించిన విద్యుత్ ఉత్పత్తిలో పురోగతి కనిపిస్తోంది. తొలిపక్షం రోజుల్లో 100 మెగా వాట్లకుపైగా ఉత్పత్తి సాధించగా, మంగళవారం నాటికి అది 250 మెగావాట్లకు చేరింది. నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.

06/15/2016 - 07:54

హైదరాబాద్, జూన్ 14: హీరో గ్రూప్ ఆధ్వర్యంలో బిఎంయు ముంజాల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్టు వర్శిటీ డీన్ డాక్టర్ అమితావ బాబీ మిత్ర చెప్పారు. మంగళవారం నాడు ఆయన హైదరాబాద్‌లో ఆంధ్రభూమికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్శిటీగా బిఎంయు ముంజాల్ యూనివర్శిటీ ఎదగనుందని చెప్పారు.

06/15/2016 - 07:53

విశాఖపట్నం, జూన్ 14: ఉత్పత్తికి అనుగుణంగా నిల్వసామర్థ్యం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ వెల్లడించారు. గిడ్డంగుల సంస్థ ఉద్యోగులకు మూడు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను విశాఖలో మంగళవారం ఆయన ప్రారంభించారు.

06/15/2016 - 07:46

విజయవాడ, జూన్ 14: రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విద్యుత్ ఉత్పాదక రంగం పురోగతి సాధించింది. 2015-16 ఆర్ధిక సంవత్సరానికిగాను ఇటు ట్రాన్స్‌కో, జెన్‌కోలు లాభాలను ఆర్జించాయి. నాణ్యమైన కరెంటు ఉత్పత్తి, సరఫరా చేస్తూ విద్యుత్ లోటు లేని రాష్ట్రంగా నిలదొక్కుకున్నట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఏపి ట్రాన్స్‌కో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఏపి జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ కె విజయానంద్ చెప్పారు.

06/15/2016 - 07:45

ముంబయి, జూన్ 14: దేశంలో బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను ఎట్టకేలకు నేరస్థుడిగా ప్రకటించారు. బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ చట్టం కింద జరుపుతున్న ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ (ఇడి) ఈ విషయమై పిఎంఎల్‌ఎ ప్రత్యేక కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం మంగళవారం ఆయనను నేరస్థుడిగా ప్రకటించింది.

06/14/2016 - 05:22

chitram బెంగళూరులో సోమవారం డిసిబి బ్యాంక్ ఆధార్ ఆధారిత ఎటిఎమ్‌ను ప్రారంభిస్తున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ నందన్ నిలేఖని. దీన్ని ఎటిఎమ్/డెబిట్ కార్డుతో పిన్ నెంబర్ ద్వారా ఆపరేట్ చేయడానికి బదులుగా ఆధార్ నెంబర్, ఆధార్ వేలిముద్ర (బయోమెట్రిక్) ద్వారా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది.

06/14/2016 - 04:32

చిత్రం సోమవారం ముంబయలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర,
ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, పారిశ్రామికవేత్త అజయ్ పిరామల్, కుమార మంగళమ్ బిర్లా తల్లి రాజశ్రీ బిర్లా

Pages