S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/14/2016 - 04:29

న్యూఢిల్లీ, జూన్ 13: వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సుధీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రాజ్యసభలో ఆమోదం పొందగలదన్న ఆశాభావం మధ్య మోడల్ జిఎస్‌టి చట్టంపై చర్చించేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశం అవుతున్నారు. రెండు రోజులపాటు కోల్‌కత్తాలో జరిగే ఈ సమావేశం మంగళవారం మొదలవుతోంది. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొంటున్నారు.

06/14/2016 - 04:29

న్యూఢిల్లీ, జూన్ 13: ద్రవ్యోల్బణం భగ్గుమంది. గత నెల ధరాఘాతంతో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఏకంగా 21 నెలల గరిష్ఠాన్ని తాకింది. మే నెలలో 5.76 శాతంగా నమోదైంది. అంతకుముందు నెల ఇది 5.47 శాతంగా ఉంది (5.39 శాతం నుంచి సవరించారు). రిటైల్ ద్రవ్యోల్బణంలో దాదాపు సగం వాటా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం 7.55 శాతానికి ఎగిసిపడటంతో సిపిఐ.. గత నెల 21 నెలల గరిష్ఠానికి చేరింది.

06/14/2016 - 04:26

ముంబయి, జూన్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 238.98 పాయింట్లు పడిపోయి 26,396.77 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 59.45 పాయింట్లు దిగజారి 8,110.60 వద్ద నిలిచింది. ఏప్రిల్ నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ పతనం కావడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

06/14/2016 - 04:24

న్యూఢిల్లీ, జూన్ 13: ప్రభుత్వరంగ సంస్థల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)ల అదనపు బాధ్యతలపై నిర్ణయం ఇక ప్రధాన మంత్రి చేతుల్లో ఉండదు. ఆ నిర్ణయాన్ని ఇకపై ఆయా శాఖల మంత్రులే తీసుకుంటారు. ఇప్పటిదాకా ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఎసిసి)నే ఆయా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సిపిఎస్‌ఇ) సిఎండి, ఎండిలకు అదనపు బాధ్యతల అప్పగింత వ్యవహారం చూసుకునేది.

06/14/2016 - 04:22

న్యూఢిల్లీ, జూన్ 13: వెల్‌స్పన్ ఎనర్జీ అనుబంధ సంస్థ వెల్‌స్పన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (డబ్ల్యుఆర్‌ఇపిఎల్)ను టాటా పవర్ కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు సోమవారం టాటా పవర్ తెలియజేసింది. 9,249 కోట్ల రూపాయలకు టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టిపిఆర్‌ఇఎల్).. డబ్ల్యుఆర్‌ఇపిఎల్‌ను చేజిక్కించుకుంటోంది.

06/14/2016 - 04:19

న్యూఢిల్లీ, జూన్ 13: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్ల లోకి ఈ నెలలో ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడు లను తెచ్చారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు, సానుకూల స్థూల ఆర్థిక గణాంకాలు మదుపరులను పెట్టుబడుల వైపునకు మళ్లించాయ.

06/14/2016 - 04:16

న్యూఢిల్లీ, జూన్ 13: రింగింగ్ బెల్స్.. 251 రూపాయలకే స్మార్ట్ఫోన్ అంటూ ప్రకటించి, దాన్ని అట్టహాసంగా ప్రారంభించిన సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ తమ చౌక స్మార్ట్ఫోన్లను ఈ నెల 28 నుంచి కస్టమర్లకు అందించడం మొదలుపెడతామంటోంది. పలు నాటకీయ పరిణామాల మధ్య ‘ఫ్రీడమ్ 251’ పేరుతో పరిచయమైన ఈ 251 రూపాయల స్మార్ట్ఫోన్ బుకింగ్ సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నది తెలిసిందే.

06/13/2016 - 05:57

చండీగఢ్, జూన్ 12: యోగా గురువు రామ్‌దేవ్ బాబా.. పతంజలి ఉత్పత్తులను మరింత విస్తరింపజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరిన్ని పాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెస్తామని ఆదివారం ఇక్కడ చెప్పారు. వచ్చే ఏడాదికల్లా 10,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామని, దాన్ని సాధించడంలో భాగంగానే వ్యాపార విస్తరణ అన్నారు. ఈ క్రమంలోనే పాల అమ్మకాల్లోకీ దిగనున్నట్లు స్పష్టం చేశారు.

,
06/13/2016 - 05:56

ముంబయి, జూన్ 12: అనుబంధ బ్యాంకుల విలీనం ప్రక్రియకు నాంది పలికింది 210 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ). ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రానప్పటికీ, ఈ వ్యవహారంపై రాజకీయంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఐదు అనుబంధ బ్యాంకులను తనలో కలిపేసుకునేందుకు ఓ నిబంధనావళిని సిద్ధం చేస్తోంది.

06/13/2016 - 05:52

న్యూఢిల్లీ, జూన్ 12: దాదాపు 1,411 కోట్ల రూపాయల మేర తన ఆస్తులు, తనకు చెందిన ఓ కంపెనీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకోవడానికి ఎలాంటి సహేతుకత, న్యాయబద్ధత లేదని పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా అన్నారు. ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు తనపట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

Pages