S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/10/2016 - 07:07

హైదరాబాద్, జూన్ 9: చర్మ, శిరోజాల సమస్యల నివారణకు ఆయుర్వేద శాస్తప్రరమైన ఔషధులను తయారుచేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు బయోటీక్ సంస్ధ ఒక ప్రకటనలో వెల్లడించింది. డిస్నీ ఇండియా సంస్ధ భాగస్వామ్యంతో ఈ మందులను తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఆ సంస్ధ ఎండి వినిత్ జైన్ తెలిపారు. తమ సంస్ధలో అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు వివిధ వ్యాధులపై పరిశోధనలు చేపట్టారన్నారు.

06/10/2016 - 07:06

హైదరాబాద్, జూన్ 9: ఇంజనీరింగ్, డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెట్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న సియాంట్ సంస్ధ బెంగళూరులో గ్లోబల్ డిజైన్ సెంటర్‌ను ప్రారంభించింది. వౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్ధాయి సలహాలు ఇచ్చేందుకు అవసరమైన టెక్నాలజీ తమ వద్ద ఉన్నట్లు ఆ సంస్ధ ఎండి బి కృష్ణ తెలిపారు.

06/10/2016 - 07:06

హౌరా, జూన్ 9: రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తమతో చేతులు కలపాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు విజ్ఞప్తి చేశారు. ‘దేశంలో రైల్వేలను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం.

06/09/2016 - 07:10

వాషింగ్టన్, జూన్ 8: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత్‌లో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. భారత ఆన్‌లైన్ షాపింగ్ వేగంగా వృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌లో పెద్ద ఎత్తున వాటాను అందుకోవాలని చూస్తోంది అమెజాన్. ఇప్పటికే 2014లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ ప్రకటించింది.

06/09/2016 - 07:08

ముంబయి, జూన్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 10.99 పాయింట్లు పెరిగి 27,020.66 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.60 పాయింట్లు అందుకుని 8,273.05 వద్ద నిలిచింది.

06/09/2016 - 07:07

టోక్యో, జూన్ 8: జపాన్ చిన్న కార్ల తయారీ దిగ్గజం.. సుజుకి మోటార్ కార్పొరేషన్‌లో తప్పుడు మైలేజీ టెస్టింగ్ తీవ్ర ప్రకంపనలకే దారి తీసింది. ఈ వివాదంతో సిఇఒ పదవిని ఒసాము సుజుకి వదులుకున్నారు. ‘తప్పుడు మైలేజీ టెస్టింగ్ పద్ధతుల వివాదం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.’ అని బుధవారం ఇక్కడ ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.

06/09/2016 - 07:06

న్యూఢిల్లీ, జూన్ 8: వేగవంతమైన వృద్ధికి ప్రైవేట్‌రంగ పెట్టుబడులు చాలా అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. వేగవంతమైన వృద్ధిని అందుకునే సామర్థ్యం భారత్‌కుందన్న ఆయన వాస్తవ జిడిపి గణాంకాలు ఒక శాతం ఎక్కువగానో, తక్కువగానో ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా నమోదైనట్లు ఇటీవల ప్రకటించినది తెలిసిందే.

06/09/2016 - 07:06

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి దక్షిణ కొరియా అన్ని రకాలుగా సహకరిస్తుందని భారత్‌లో కొరియా రాయబారి చో హ్యూన్ స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, కొరియా ప్రతినిధులు పాల్గొన్నారు.

06/08/2016 - 07:59

ముంబయి, జూన్ 7: ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లలేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. మంగళవారం ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఆర్‌బిఐ నిర్వహించింది. ఈ క్రమంలో రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచిన సెంట్రల్ బ్యాంక్.. నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ని కూడా ఉన్నచోటే ఉంచింది.

06/08/2016 - 07:52

ముంబయి, జూన్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 7 నెలల తర్వాత తిరిగి 27 వేల స్థాయిని తాకింది. 232.22 పాయింట్లు ఎగిసి 27,009.67 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 65.40 పాయింట్లు ఎగిసి 8,266.45 వద్ద స్థిరపడింది.

Pages