S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/07/2016 - 06:36

విజయవాడ, జూన్ 6: ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, పోర్టులు అభివృద్ధి చెందితే పరిశ్రమలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా సోమవారం పరిశ్రమలు, సేవారంగం, రెగ్యులేటరీ సెక్టార్‌లో ప్రగతి, గత రెండేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సదస్సు నిర్వహించారు.

06/07/2016 - 06:33

న్యూయార్క్, జూన్ 6: ఫేస్‌బుక్ సిఇఒ, వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్.. ట్విట్టర్, పింటెరెస్ట్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. జుకర్‌బర్గ్ 2012 లింకెడిన్ ఖాతా నుంచి పాస్‌వర్డ్‌లను పొందినట్లు హ్యాకర్ గ్రూప్ ప్రకటించిందని మీడియా కథనాలు చెబుతున్నాయి.

06/07/2016 - 06:30

ముంబయి, జూన్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరపనున్న క్రమంలో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచలేకపోయారు.

06/07/2016 - 06:30

న్యూఢిల్లీ, జూన్ 6: మొండి బకాయిల సమస్యతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు బాసటగా నిలుస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం భరోసా ఇచ్చారు. నిరర్థక ఆస్తులు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు నష్టాలపాలయ్యాయి.

06/06/2016 - 06:14

పెట్టుబడులకు సరైన ప్ర‘దేశం’ ౄ ఖతార్ వ్యాపారవేత్తలకు మోదీ పిలుపు
వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తున్నాం ౄ చాలా రంగాల్లో ఎఫ్‌డిఐని అనుమతించామని స్పష్టీకరణ
రైల్వేలు, రక్షణ, తయారీ, ఆహార రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలని వెల్లడి
మా విధానాలతో మీకున్న ఇబ్బందులు ఏమిటో చెబితే పరిష్కరిస్తామంటూ మదుపరులకు హామీ

06/06/2016 - 06:13

న్యూఢిల్లీ, జూన్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష, వర్షాల ప్రగతి, పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాలు ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘వర్ష సమాచారం, ఆర్‌బిఐ ద్య్రవ్యపరపతి విధాన సమీక్ష ఈ వారం మార్కెట్ తీరును శాసిస్తాయి.

06/06/2016 - 06:11

న్యూఢిల్లీ, జూన్ 5: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్ల లోకి గత నెలలో 2,500 కోట్ల రూపా యలకుపైగా పెట్టుబడులను తెచ్చారు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాస తోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహా న్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో స్టాక్ మార్కెట్లలోకి 29,559 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు పట్టుకొచ్చారు.

06/06/2016 - 06:11

న్యూఢిల్లీ, జూన్ 5: ఇప్పుడు ఏ పత్రికలో చూసినా, మరే వార్తా చానల్‌లో విన్నా పతాక శీర్షికల్లో కనిపిస్తోంది ఓ అంశం. అది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా మరోసారి రఘురామ్ రాజన్ ఉంటారా? లేదా? అన్నదే. అవును మరి.. 1992 నుంచి గమినిస్తే ఆర్‌బిఐ గవర్నర్‌గా పనిచేసిన వారంతా కూడా ఐదేళ్లకుపైగా ఉన్నవారే. దీంతో ఈ సెప్టెంబర్‌తో ముగుస్తున్న రాజన్ మూడేళ్ల పదవీకాలం పొడిగింపు అవుతుందా? కాదా?

06/06/2016 - 06:10

న్యూఢిల్లీ, జూన్ 5: దేశంలో అక్రమార్కుల అవినీతి సంపదకు హద్దే లేకుండా పోతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబమైన జిడిపిలో దాదాపు 20 శాతానికి సమానంగా భారతీయుల వద్దనున్న నల్లధనం ఉంది మరి. భారత ‘బ్లాక్ ఎకానమీ’ విలువ 30 లక్షల కోట్ల రూపాయల పైమాటే.

06/05/2016 - 07:01

ముంబయి, జూన్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం లాభాలను అందుకున్నాయి. మెటల్, ఆటోరంగ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో గడచిన వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 189.43 పాయింట్లు పెరిగి 26,843.03 వద్ద ముగిస్తే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 64.15 పాయింట్లు లాభపడి 8,220.80 వద్ద నిలిచింది. అంతకుముందు వారమైతే సూచీలు భారీ లాభాలను పొందాయి.

Pages