S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/29/2016 - 02:51

న్యూఢిల్లీ, మే 28: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ శనివారం ధ్వజమెత్తుతూనే సాహసోపేత సంస్కరణలకు వెళ్లడానికి అవసరమైన ధైర్యాన్ని కూడదీసుకోవాలని హితవు పలికింది. ప్రభుత్వానికి గనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపై తమ పార్టీ చర్చించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ‘2014 జూన్ నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటబడింది.

05/29/2016 - 02:49

న్యూఢిల్లీ, మే 28: నల్లధన కుబేరులపై కఠిన చర్యలు తప్పవని మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ‘పనామా పేపర్లు’పై స్పందిస్తూ అక్రమార్జనపరులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని, వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. రెండేళ్ల పాలనపై శనివారం ఇక్కడ ఇండియా గేట్ వద్ద ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ ‘పనామా కేసులో పేర్లున్నవారి ఖాతాల్లో నల్లధనం ఉన్నట్లు గుర్తిస్తే..

05/29/2016 - 02:46

శాఖపట్నం, మే 28: గృహనిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ అభిప్రాయపడ్డారు. విశాఖతో పాటు ప్రధాన పట్టణాల్లో గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

05/28/2016 - 05:41

కోల్‌కతా/న్యూఢిల్లీ, మే 27: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 66 శాతం క్షీణించి 1,263.81 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఈ లాభం 3,742.02 కోట్లుగా నమోదైంది.

05/28/2016 - 05:34

వాషింగ్టన్/న్యూఢిల్లీ, మే 27: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పునర్నియామకం అంశం.. పరిపాలనాపరమైనదని, ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం పనికిరాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ పదవీకాలం ముగుస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలికాలంలో బిజెపి నేతలు, మంత్రులు..

05/28/2016 - 05:32

హైదరాబాద్, మే 27: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలతో శుక్రవారం సమావేశం అయ్యారు. మిన్నసోటాలో వైద్య పరికరాలు, పైపులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అంతర్గత పైప్‌లైన్ల లీకేజీని అరికట్టేందుకు తమ కంపెనీ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని 3 ఎం కంపెనీ ఎగ్జిక్యూటివ్ జాన్ పోర్‌నూర్ కెటిఆర్‌కు వివరించారు.

05/28/2016 - 05:31

హైదరాబాద్, మే 27: బీమా రంగాన్ని ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేసి తక్కువ ఖర్చుతో, ఎక్కువ కవరేజితో పాలసీలను ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని ఇన్సురెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సిఇఒ ఆర్ రాఘవన్ బీమా రంగ నిపుణులను కోరారు. శుక్రవారం ఇక్కడ బీమా సమాచారం, రేట్‌మేకింగ్ ఫోరం ఆఫ్ ఆసియా సదస్సును ఆయన ప్రారంభించారు.

05/28/2016 - 05:29

న్యూఢిల్లీ, మే 27: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ స్టాండలోన్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 3,905.49 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 612.96 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. పెరిగిన మొండి బకాయిలే ఈ నష్టాలకు కారణమని శుక్రవారం బ్యాంక్ తెలిపింది.

05/28/2016 - 05:28

ముంబయి, మే 27: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 286.92 పాయింట్లు పుంజుకుని 26,653.60 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 87 పాయింట్లు ఎగిసి 8,156.65 వద్ద నిలిచింది. ఫలితంగా వరుసగా నాలుగు రోజులు మార్కెట్లు లాభాల్లో ముగిసినట్లైంది.

05/28/2016 - 05:27

న్యూఢిల్లీ, మే 27: విశాఖపట్నం పెట్రోలియం యూనివర్సిటి (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జి) వెబ్ సైట్‌ను ఢిల్లీలో శుక్రవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఈ యూనివర్సిటిని కేంద్రం విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది. కాగా, యూనివర్సిటి నిర్వహణను ఐఐటి ఖరగ్‌పూర్ వ్యవహరించనుంది.

Pages