S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/25/2016 - 06:43

ముంబయి, మే 24: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులపాటు నష్టాలను అందుకున్న సూచీలు.. ఎట్టకేలకు లాభాలను సంతరించుకున్నాయి. వచ్చే నెల జూన్‌లో అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్.. కీలక వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాల మధ్య మదుపరులు కార్పొరేట్ సంస్థల ఆశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాలకే ప్రాధాన్యతనిచ్చారు.

05/24/2016 - 01:06

న్యూఢిల్లీ, మే 23: దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి హవా కొనసాగుతోంది. గత నెల ఏప్రిల్‌లో భారీగా అమ్ముడైన టాప్-10 ప్యాసింజర్ వాహనాల్లో ఏడు మోడల్స్ మారుతికి చెందినవే. ఆల్టో ఎప్పటిలాగే తొలి స్థానంలో ఉండగా, స్విఫ్ట్, వాగనార్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా హ్యుందాయ్ ఐ20, మారుతి డిజైర్, హ్యుందాయ్ ఐ10, రెనాల్ట్ క్విడ్, మారుతి బాలెనో, సెలీరియో, ఓమిని మోడల్స్ ఉన్నాయి.

05/24/2016 - 01:06

న్యూఢిల్లీ, మే 23: భారత్‌లో స్పెక్ట్రమ్ విలువ చాలా ఎక్కువని రష్యా దిగ్గజ సంస్థ సిస్టెమాకు చెందిన భారతీయ టెలికామ్ సంస్థ ఎస్‌ఎస్‌టిఎల్ చెప్పింది. ఇక్కడ పెట్టుబడులు కష్టతరమేనని సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌టిఎల్) సిఇఒ సర్జీ సవ్‌చెంకో సోమవారం పిటిఐతో మాట్లాడుతూ అన్నారు. కాగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో ఎస్‌ఎస్‌టిఎల్ విలీన ప్రక్రియపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

05/24/2016 - 01:05

టెహ్రాన్, మే 23: సుధీర్ఘకాలం అనంతరం భారత ప్రధాన మంత్రి ఇరాన్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సోమవారం 12 ఒప్పందాలు, ఎమ్‌ఒయులు కుదిరాయి. బిజెపికి చెందిన నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పాయి తర్వాత 15 ఏళ్లకు మళ్లీ ఇప్పుడు అదే పార్టీకి చెందిన ప్రధాని.. నరేంద్ర మోదీ ఈ ఇస్లామిక్ దేశంలో పర్యటిస్తున్నారు.

05/24/2016 - 01:03

లండన్, మే 23: యూరోపియన్ యూనియన్ (ఈయు)ను వీడితే.. బ్రిటన్ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని ఆ దేశ ఆర్థిక మంత్రి జార్జ్ ఆస్బర్న్ హెచ్చరించారు. మరో నెల రోజుల్లో ఈయులో బ్రిటన్ సభ్యత్వంపై రెఫరెండమ్ జరగనున్న క్రమంలో ‘ఆర్థిక మాంద్యానికి ఓటేద్దామా?’ అని ప్రతి బ్రిటన్ పౌరుడు తమకు తాము తప్పక ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని సోమవారం రెఫరెండానికి సంబంధించి నిర్వహించిన ప్రచారంలో ఆస్బర్న్ అన్నారు.

05/24/2016 - 01:02

హైదరాబాద్, మే 23: నగదుకు తగినట్టుగా పూర్తి విలువ కలిగిన ఉత్పత్తులు, సేవలను అందించాలనే లక్ష్యంతో ఎయిర్‌సెల్ మరో నూతన ప్రోడక్ట్.. కాంబో 123ను ఆవిష్కరించింది. అపరిమిత ప్రయోజనాలను ఈ కాంబో ఆఫర్ అందిస్తుంది.

05/24/2016 - 01:01

బ్యాంకాక్, మే 23: భారత్, థాయిలాండ్, మయన్మార్ దేశాలు 1,400 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు థాయిలాండ్‌లో భారత రాయబారి భగవంత్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. ఈ రహదారి ఆగ్నేయాసియాతో భారత్‌ను అనుసంధానించనుందని చెప్పారు.

05/24/2016 - 00:59

టెహ్రాన్, మే 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ ఘని.. సోమవారం ఇరాన్ దక్షిణ తీరంలోని చబహర్ పోర్టుపై త్రైపాక్షిక రవాణా ఒప్పందానికి సంతకాలు చేశారు. మూడు దేశాల అధిపతుల సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘త్రైపాక్షిక రవాణాపై జరిగిన ఈ ఒప్పందం.. మూడు దేశాల చారిత్రాత్మక ఒప్పందం’గా అభివర్ణించారు.

05/24/2016 - 00:57

విశాఖపట్నం, మే 23: తీరప్రాంత గస్తీలో మరో కొత్త నౌక వచ్చి చేరింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జిఆర్‌ఎస్‌ఇ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ తర్ముగలిని తూర్పునౌకాదళ ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్ సోమవారం నౌకదళ సేవల్లో ప్రవేశపెట్టారు. ఐఎన్‌ఎస్ తర్ముగలి 320 టన్నుల బరువుతో 48 మీటర్ల పొడవుతో తయారైంది.

05/24/2016 - 00:55

విజయవాడ, మే 23: ఈ ఏడాది రాష్ట్రంలో కోటి ఎకరాలకుపైగా ఉద్యానవన పంటలను సాగులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కనీసం 40 లక్షల ఎకరాల్లో హార్టీకల్చర్ పంటలను సాగులోకి తీసుకురావడం.. కోటీ 30 లక్షల ఎకరాల్లో ఇతర వ్యవసాయ పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయంతో సరిసమానమవుతుందని చెప్పారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Pages