S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/24/2016 - 00:53

ముంబయి, మే 23: పేమెంట్స్ బ్యాంకుల ఏర్పాటు నుంచి రెండు గ్రూపులు వైదొలగడం అసంతృప్తికి గురిచేసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) డిప్యూటి గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా అన్నారు. పేమెంట్స్ బ్యాంకుల కోసం వచ్చిన దరఖాస్తులను ఎంతగానో పరిశీలించి చివరకు కొన్నింటినే ఆమోదించామని, కానీ ఇప్పుడు వాటిలో కొందరు వెనక్కి తగ్గడం బాగోలేదని సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

05/24/2016 - 00:52

ముంబయి, మే 23: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. గత వారం వరుస మూడు రోజుల నష్టాలను కొనసాగిస్తూ సోమవారం కూడా సూచీలు నేలచూపులు చూశాయి. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్.. జూన్‌లో కీలక వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

05/23/2016 - 07:45

న్యూఢిల్లీ, మే 22: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా తదితర బ్లూచిప్ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్ష సమాచారం కూడా మార్కెట్ పోకడను ప్రభావితం చేయగలదని చెబుతున్నారు.

05/23/2016 - 07:42

న్యూఢిల్లీ, మే 22: కాలుష్యకారక పాత వాహనాలను వదిలించుకోవడం వల్ల ఆటో పరిశ్రమ టర్నోవర్ భారీగా పెరగనుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

05/23/2016 - 07:42

న్యూఢిల్లీ, మే 22: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 1,800 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు.

05/23/2016 - 07:41

భువనేశ్వర్, మే 22: సంస్కరణలు, ఆర్థికపరమైన అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. దేశంలో నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయడానికి రాజకీయంగా అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని అన్నారు. వృద్ధిరేటు బలోపేతానికి ద్రవ్యోల్బణం అదుపు, బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల నిర్మూలన ప్రక్రియకూ రాజకీయ అవాంతరాలు ఎదురవుతున్నాయని రాజన్ వ్యాఖ్యానించారు.

05/23/2016 - 07:41

హైదరాబాద్, మే 22: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సముద్రతీరం వద్ద 471 కోట్ల రూపాయల పెట్టుబడితో ఓ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జి) టెర్మినల్‌ను జిఎమ్‌ఆర్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలోని నిపుణుల కమిటీ నిర్వహించిన సమావేశంలో జిఎమ్‌ఆర్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. దీంతో టెర్మినల్ నిర్మాణ ప్రకియలో సంస్థ నిమగ్నమైంది.

05/22/2016 - 02:46

హైదరాబాద్, మే 21 : మెదక్ జిల్లా పటాన్ చెరు మండలంలోని రుద్రారం గ్రామాన్ని ‘నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఏరియా’గా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పరిశ్రమలు) అరవింద్‌కుమార్ పేరుతో జారీ అయ్యాయి.

05/22/2016 - 02:46

ముంబయి, మే 21: టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ ఇండియా ముందస్తు పన్ను లాభం.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) 4.1 శాతం పెరిగి 13,115 కోట్లరూపాయలుగా నమోదైంది. 45 శాతం ఎగిసిన డేటా ఆదాయం సంస్థ లాభాల్లో వృద్ధికి దోహదపడినట్లు వొడాఫోన్ ఇండియా ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన ఈ టెలికామ్ సంస్థ.. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)లో 12,598 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది.

05/22/2016 - 02:45

న్యూఢిల్లీ, మే 21: భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారు చేసేందుకు ఆసక్తి కనబరిచారు ఆ సంస్థ సిఇఒ టిమ్ కుక్. ఈ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం సారథి.. భారత్‌లో తొలిసారిగా పర్యటిస్తుండగా, శనివారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో దేశీయ అమ్మకాలకు సరిపడా సంస్థ ఉత్పత్తులను ఇక్కడే తయారు చేయాలనుకుంటున్నామని మోదీకి కుక్ తెలిపారు. అందుకున్న అవకాశాలపై ఇరువురు చర్చించారు.

Pages