S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/22/2016 - 02:43

ముంబయి, మే 21: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. పార్టిసిపేటరీ నోట్ల (పి-నోట్లు) నిబంధనలను కఠినతరం చేయడం మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బ తీసింది. పి-నోట్లలో పెట్టుబడులకున్న నిబంధనలను సెబీ కఠినం చేయడం వల్ల ఇకపై విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడులు ధారాళంగా రాకపోవచ్చన్న అంచనాలు దేశీయ మార్కెట్లను చుట్టుముట్టాయి.

05/22/2016 - 02:41

న్యూఢిల్లీ, మే 21: మార్కెట్‌లో మండిపోతున్న చక్కెర ధరలను శాంతింపజేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న చక్కెరపై సుంకాన్ని తగ్గించాలని భావిస్తున్న మోదీ సర్కారు.. ప్రస్తుతమున్న ధరలు మరింతగా పెరిగితే దేశం నుంచి విదేశాలకు జరిగే ఎగుమతులను నిషేధించాలని కూడా యోచిస్తోంది.

05/22/2016 - 03:18

పిలిభిత్, మే 21: విజయ్ మాల్యా అంటే ఎవరో పాపం ఆ రైతుకు తెలియదు. అయినా సరే బ్యాంకులనుంచి రుణాలు తీసుకుని ఎగవేయడంతో పాటుగా, మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న మాల్యాకు ‘గ్యారంటీర్’గా నిలిచినందుకు ఆ రైతు బ్యాంక్ ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు.

05/21/2016 - 06:08

న్యూఢిల్లీ, మే 20: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సిఇఒ టిమ్ కుక్.. శుక్రవారం దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్‌ను కలిశారు. భారత్‌లో 4జి సేవల విస్తరణ తదితర అంశాలతోపాటు దేశీయ టెలికామ్ రంగ వృద్ధిపై వీరిరువురు చర్చించారు. దాదాపు గంటపాటు జరిగిన వీరి సమావేశంలో భారతీ ఎయిర్‌టెల్ ఇండియా, దక్షిణాసియా సిఇఒ గోపాల్ విఠల్ కూడా పాల్గొన్నారు.

05/21/2016 - 06:05

న్యూఢిల్లీ, మే 20: అక్రమార్జనపరులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అవినీతి ద్వారా సంపాదించేవారినెవరినీ ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నాలుగు నెలలపాటు లెక్కలు లేని ఆదాయాన్ని స్వచ్చంధంగా బహిర్గతం చేసేందుకు కేంద్రం అవకాశమిస్తుండగా, ఇది నల్లధన కుబేరులకు ఎంతమాత్రం లాభించబోదని ఆర్థిక శాఖ చెప్పింది.

05/21/2016 - 06:05

న్యూఢిల్లీ/విశాఖపట్నం, మే 20: రైల్వే స్టేషన్లలో ఆధునిక సదుపాయల కల్పనకు కేంద్ర రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం, పాట్నా, రాంచీ రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను శుక్రవారం న్యూఢిల్లీలోని రైల్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. విశాఖ, రాంచీ, పాట్నా ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

05/21/2016 - 05:47

ముంబయి, మే 20: టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడిఎఫ్‌సి బ్యాంక్‌లతోపాటు సన్ ఫార్మా వ్యవస్థాపక అధిపతి దిలీప్ సంఘ్వీ.. పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటును విరమించుకున్నారు. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

05/21/2016 - 05:46

న్యూఢిల్లీ, మే 20: ఆదిత్యా బిర్లా నువో లిమిటెడ్ (ఎబిఎన్‌ఎల్) వచ్చే ఏడాది మార్చికల్లా పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించిన నేపథ్యంలో తమ గ్రూప్‌లోని అనుబంధ సంస్థ ఐడియాతో కలిసి 51:49 భాగస్వామ్యంలో ఓ జాయింట్ వెంచర్‌ను ఎబిఎన్‌ఎల్ ఈ ఫిబ్రవరిలో నెలకొల్పింది.

05/21/2016 - 05:44

న్యూఢిల్లీ, మే 20: ప్రస్తుతం గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సిఇఒ టిమ్ కుక్ భారత్‌లో పర్యటిస్తుండగా, మరో అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల కూడా భారత్‌కు రానున్నారు. ఈ నెలాఖర్లో నాదెళ్ల వస్తుండగా, తెలుగువాడైన నాదెళ్ల గడచిన ఏడు నెలల్లో భారత్‌లో పర్యటిస్తుండటం ఇది మూడోసారి కావడం గమనార్హం.

05/20/2016 - 04:22

ముంబయి, మే 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబి పి-నోట్స్ నిబంధనలను కఠినతరం చేస్తుందన్న భయాలకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ జూన్‌లో వడ్డీ రేట్లను పెంచవచ్చన్న ఊహానాలతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 305 పాయింట్లు పతనమై రెండు వారాల నిష్ఠస్థాయి అయిన 25,399.72 పాయింట్లకు పడిపోయింది.

Pages