S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/18/2016 - 00:33

న్యూఢిల్లీ, మే 17: కరవును శాశ్వతంగా పరిష్కరించాలంటే నదుల అనుసంధానం ఒక్కటే దారి అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయం చెప్పినట్లు ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కరవును శాశ్వతంగా నివారించేందుకు అనుసరించవలసిన స్వల్ప, దీర్ఘ కాలిక చర్యల గురించి చర్చించేందుకే మోదీ ఇంత వరకు పదిమంది ముఖ్యమంత్రులతో సమావేశం జరిపారని చెప్పారు.

05/18/2016 - 00:32

న్యూఢిల్లీ, మే 17: ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ సేద్యంపై తీసుకొన్న చర్యలను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. కరపు నివారణ కోసం చేపట్టిన ప్రయత్నాలు ముఖ్యంగా చెక్ డ్యామ్‌లు నిర్మించడం, నదులపై ఎత్తిపోతల పథకాలు, నీటి వనరులు సమర్థవంతంగా, పొదుపుగా వాడుతున్నట్లు ప్రధాని మోదీకి మంగళవారం భేటీలో చంద్రబాబు వివరించారు.

05/18/2016 - 00:31

ముంబయి, మే 17: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. దాని ఐదు అనుబంధ సంస్థలతోపాటు భారతీయ మహిళా బ్యాంక్ విలీనాన్ని మంగళవారం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నట్లు బ్యాంక్ బోర్డు సమావేశం అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎస్‌బిఐ పేర్కొంది. మరోవైపు ఈ ప్రకటనతో అనుబంధ బ్యాంకింగ్ సంస్థల ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.

05/18/2016 - 00:31

న్యూఢిల్లీ, మే 17: బంగారం ధరలు 30,000 రూపాయల దిగువకు చేరుకున్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 230 రూపాయలు పడిపోయి 29,820 రూపాయల వద్ద స్థిరపడింది. 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 29,670 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధర కిలో 160 రూపాయలు దిగజారి 41,100 రూపాయలను తాకింది.

05/17/2016 - 07:45

న్యూఢిల్లీ, మే 16: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగాయి. లీటర్ పెట్రోలుపై 0.83 పైసలు, డీజిల్‌పై రూపాయి 26 పైసలు పెరిగింది. గత నెల 30న పెట్రోల్‌పై రూపాయి 6 పైసలు, డీజిల్‌పై 2 రూపాయల 94 పైసల చొప్పున పెరగగా, పక్షం రోజులు కాకుండానే ఈ తాజా భారం పడడం గమనార్హం.

05/17/2016 - 07:43

హైదరాబాద్, మే 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని యువత కోసం ప్రముఖ టెలికామ్ రంగ సంస్థ వొడాఫోన్.. సోమవారం సరికొత్త ప్యాకేజీలను పరిచయం చేసింది. ‘యు’ పేరిట ఓ లైఫ్‌స్టైల్ ప్రపోజిషన్‌ను ప్రకటించింది. వివిధ ధరలలో ‘కనెక్టర్’, ‘ఎనబ్లర్’, ‘ఎంటర్‌టైనర్’ ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు వొడాఫోన్ ఇండియా ఏపి, తెలంగాణ వ్యాపార అధిపతి రోహిత్ టండన్ చెప్పారు.

05/17/2016 - 07:42

న్యూఢిల్లీ, మే 16: ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఖాతాదారులకు మూడేళ్లపాటు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) యోచిస్తోంది. ఇపిఎఫ్‌ఒ ట్రస్టీలు వచ్చే నెల సమావేశం అయ్యే వీలుండగా, ఈ సమావేశంలో ఈ ప్రతిపాదన పరిశీలనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ స్కీమ్ (ఇడిఎల్‌ఐ) ద్వారా అందే ప్రయోజనాన్ని కూడా 6 లక్షలకు పెంచనున్నారు.

05/17/2016 - 07:42

న్యూఢిల్లీ, మే 16: రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు తప్పక ఆమోదం పొందుతుందన్న దృఢమైన విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోగల యుపిఎ కూటమిలో భాగస్వాములైన డిఎమ్‌కె, ఎన్‌సిపి తదితర పార్టీలతోసహా దేశంలోని ప్రాంతీయ పార్టీలు జిఎస్‌టికి గట్టిగానే మద్దతునిస్తున్నాయని ఆయన చెప్పారు.

05/17/2016 - 07:39

ముంబయి, మే 16: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు ఏడాదిన్నర కాలం తర్వాత పెరిగినప్పటికీ పట్టించుకోని మదుపరులు.. పెట్టుబడులకే ఆసక్తి కనబరిచారు. నిజానికి ఉదయం ఆరంభంలో లాభాల్లో కొనసాగిన సూచీలు.. మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివర్లో తిరిగి లాభాలను సంతరించుకున్నాయి.

05/17/2016 - 07:39

న్యూఢిల్లీ, మే 16: పప్పు్ధన్యాలు, బంగాళదుంప, చక్కెర ధరలు పెరిగిన నేపథ్యంలో గత నెల టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం 18 నెలల తర్వాత రుణాత్మక శ్రేణి నుంచి బయటికొచ్చింది. ఏప్రిల్‌లో 0.34 శాతంగా నమోదైంది. అంతకుముందు నెల మార్చిలో -0.85 శాతంగా ఉంటే, నిరుడు ఏప్రిల్‌లో -2.43 శాతంగా ఉంది. 2014 నవంబర్ నుంచి టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు మైనస్‌లోనే నమోదవుతున్నాయి.

Pages