S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/14/2016 - 07:30

హైదరాబాద్, మే 13: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎఎన్-225 మైరియా ఆంటోనోవాకు జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం స్వాగతం పలికింది. ఈ భారీ కార్గో విమానం శుక్రవారం తెల్లవారు జామున అంతర్జాతీయ వినాశ్రయానికి చేరుకోగా, కోడ్ ఎఫ్ కార్గో యాప్రాన్‌లో నిలిపినట్లు జిఎంఆర్ తెలిపింది.

05/14/2016 - 08:44

లండన్, మే 13: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా మరికొంత కాలం కొనసాగాలన్న ఆకాంక్షను రఘురామ్ రాజన్ వ్యక్తం చేశారు. ఆర్‌బిఐ గవర్నర్‌గా ప్రస్తుతం అనుక్షణం ఆనందిస్తున్నానని, తన ప్రతి చర్యపై సంతృప్తిని వెలిబుచ్చారు. అయితే చేయాల్సింది ఇంకా చాలానే మిగిలి పోయిందన్న రాజన్.. ఈ క్రమంలోనే రెండోసారి ఆర్‌బిఐ పగ్గాలు చేపట్టాలన్న కోరికను బయటపెట్టారు.

05/14/2016 - 08:43

న్యూఢిల్లీ, మే 13: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని, వచ్చే ఏడాది మార్చికల్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) లక్ష్యానికి అనుగుణంగా 5 శాతానికి చేరువవుతుందని ఓ రిసెర్చ్ నివేదికలో కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. గత నెల ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.39 శాతంగా నమోదైనది తెలిసిందే. అధిక ఆహార ధరలే దీనికి కారణం.

05/14/2016 - 06:48

హైదరాబాద్, మే 13: తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పే పారిశ్రామికవేత్తలు కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సౌర విద్యుత్ డెవలపర్ల సమావేశంలో మాట్లాడుతూ, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సౌర విద్యుదుత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

05/14/2016 - 06:47

న్యూఢిల్లీ, మే 13: మొండి బకాయిలు ప్రమాదకర స్థాయిలో ఏమీ లేవని, ఈ సమస్యను బ్యాంకులు పరిష్కరించుకోగలవని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బిబిబి) చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) ఆందోళనకర స్థాయిలో ఉన్నాయంటూ ఇటు బ్యాంకులు, అటు కేంద్ర ప్రభుత్వం కలవరపడుతున్న నేపథ్యంలో బిబిబి చీఫ్ రాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

05/14/2016 - 06:46

పనాజి, మే 13: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులను, దానికి రుణాలిచ్చిన బ్యాంకర్లు స్వాధీనం చేసుకునే పనిలోపడ్డారు. గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లాను శుక్రవారం బ్యాంకులు స్వాధీనం చేసుకునేందుకు ముందుకెళ్ళాయి.

05/14/2016 - 06:44

ముంబయి, మే 13: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి 0.1 శాతానికి పడిపోవడం, ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.39 శాతానికి పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మరోవైపు పి-నోట్ నిబంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేయడం విదేశీ మదుపరుల పెట్టుబడులకు విఘాతం కలిగించింది.

05/13/2016 - 01:10

ముంబయి, మే 12: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దివాలా బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో మదుపరుల్లో కొత్త ఉత్సాహం నెలకొనడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ లాంటి బ్యాంకింగ్ స్టాక్స్ నారీ లాభాలు ఆర్జించడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 193.20 పాయింట్లు లాభపడి 25,790.22 పాయింట్ల వద్ద ముగిసింది.

05/13/2016 - 01:09

న్యూఢిల్లీ, మే 12: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి మార్చి నెలలో మళ్లీపడకేసింది. ఫిబ్రవరి నెలలో 2శాతం మేర వృద్ధి కనబరచిన పారిశ్రామిక ఉత్పత్తిసూచీ (ఐఐపి)మార్చి నెలలో కేవలం 0.1 శాతమే వృద్ధి చెందింది. వౌలిక వస్తువుల ఉత్పత్తి తగ్గడంతో పాటుగా ఉత్పాదక రంగ, మైనింగ్ రంగాల పని తీరు అధ్వాన్నంగా ఉండడం పారిశ్రామిక వృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపించింది.

05/13/2016 - 01:06

రాజమహేంద్రవరం, మే 12: రాష్ట్రంలో పండ్లను సహజసిద్ధంగా మాగబెట్టే ప్రక్రియకు ఉపయోగించే యూనిట్లను ఏర్పాటుచేశామని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు. గురువారం రాజమహేంద్రవరంలోని సిటిఆర్‌ఐ సమావేశ హాల్లో జరిగిన నర్సరీ రైతుల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages