S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/13/2016 - 01:03

హైదరాబాద్, మే 12: ఈ ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వృద్ధిరేటు 8 శాతం చేరుకుంటుందని భావిస్తున్నట్లు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) అధ్యక్షుడు డాక్టర్ నౌషద్ ఫోర్భ్స్ తెలిపారు. అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ రంగం పుంజుకోవడం ద్వారా జిడిపిలో వృద్ధి శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

05/13/2016 - 00:59

ముంబయి, మే 12: చిల్లర ద్రవ్యోల్బణంగా పిలిచే వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో ఊహించినదానికన్నా ఎక్కువగా పెరిగింది. మార్చి నెలలో 4.83 శాతం ఉండిన ఈ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 5.39 శాతానికి పెరిగి పోయింది. కాగా, మరో వైపుమార్చి నెలలో 5.21 శాతం ఉండిన ఆహార ద్రవ్యోల్బణం సైతం ఏప్రిల్ నెలలో 6.32 శాతానికి పెరిగి పోయిందని, గురువారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

05/13/2016 - 00:58

ముంబయి, మే 12: దేశంలో ప్రజలు నొప్పి నివారణకు విరివిగా ఉపయోగిస్తున్న కాంబీఫ్లామ్ మాత్రల్లో నాణ్యత లోపించిందని కేంద్ర ఔషధ నాణ్యతాప్రమాణాల నియంత్రణా సంస్థ (సిడిఎస్‌సిఓ) గుర్తించింది. దీంతో భారత్ నుంచి కొన్ని బ్యాచ్‌లకు చెందిన కాంబీఫ్లామ్ మాత్రలను మార్కెట్ నుంచి వెనక్కి తీసేసుకుంటున్నామని (రీకాల్ చేస్తున్నామని) సనోఫీ సంస్థ గురువారం వెల్లడించింది.

05/13/2016 - 00:58

హైదరాబాద్, మే 12: ప్రముఖ ఎయిర్ కూలర్ల తయారీ కంపెనీ సింఫనీ లిమిటెడ్ ప్రపంచంలోనే తొలిసారిగా ఐ ప్యూర్ టెక్నాలజీతో తయారు చేసిన వివిధ దశల్లో శుద్ధిచేసిన చల్లని గాలిని అందించే ఎయిర్‌కూలర్లను ఆవిష్కరించింది. ఐ-ప్యూర్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ కూలర్లు అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కలిగి ఉండడంతోపాటు అత్యంత నాణ్యమైన ఫిల్టర్ ప్యాడ్‌లు కలిగి ఉన్నట్లు సింఫనీ సిఎండి అచల్ బకేరి తెలిపారు.

05/13/2016 - 00:57

హైదరాబాద్, మే 12: అంతరిక్ష, విమానయాన రంగ అప్లికేషన్లకు సంబంధించి అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు కీసైట్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పని చేస్తోందని ఆ కంపెనీ కంట్రీ జనరల్ మేనేజర్ సుధీర్ తంగ్రి తెలిపారు. భారతదేశంలో ఏరో స్పేస్, డిఫెన్స్ మార్కెట్ అవసరాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

05/13/2016 - 00:56

ఒంగోలు,మే 12: ఐటిసి ఇతర కంపెనీలు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ప్రభుత్వమే రంగ ప్రవేశం చేస్తుందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు హెచ్చరించారు. గురువారం స్ధానిక పేర్నమిట్ట పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని, పొగాగు బేళ్ళ అమ్మకాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు.

05/13/2016 - 00:56

విశాఖపట్నం, మే 12: భారతీయ రైల్వే తరహాలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఫేస్‌బుక్, ట్విట్టర్ హ్యాండిల్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల వినియోగదారులు నేరుగా సంస్థ యాజమాన్యంతో సంబంధాలు ఏర్పర్చుకుని పలు ఆకర్షణీమైన పథకాల గురించి నేరుగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆకర్షణీయమైన పథకాలకు సంబంధించి వినియోగదారులు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేయవచ్చు.

05/13/2016 - 00:55

పరకాల, మే 12: వరంగల్ జిల్లా పరకాలలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రెండోదశ తరుచూ సాంకేతిక కారణాలతో ఆగుతోంది. నాలుగు నెలల్లో సుమారు 10 సార్లు ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లు సమాచారం. కెటిపిపి రెండో దశలో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఇంజనీర్‌లను ఇబ్బందులకు గురిచేస్తోంది.

05/12/2016 - 07:39

న్యూఢిల్లీ, మే 11: కాల్ డ్రాప్స్‌పై టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బుధవారం తప్పుబట్టింది. దీన్ని నిరంకుశమైన, ఆమోదయోగ్యం కాని చర్యగా అభివర్ణిస్తూ ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టింది. దీంతో టెలికామ్ సంస్థలకు పెద్ద ఊరట లభించినట్లైంది.

05/12/2016 - 07:36

హైదరాబాద్, మే 11: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ నూతన మోడల్ హోండా బిఆర్-వి కారును హైదరాబాద్ మార్కెట్‌కు పరిచయం చేసింది. కంపాక్ట్ ఎస్‌యువి విభాగంలో ఈ కారును ప్రవేశపెట్టడం ద్వారా తమ కార్ల మార్కెట్ వాటాను మరింత పటిష్టం చేసుకుంటామని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు.

Pages