S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/14/2016 - 06:05

విశాఖపట్నం, ఏప్రిల్ 13: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ సరఫరా ఒప్పందాలను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆయా సంస్థలు పెట్టిన పెట్టుబడులపై మాత్రం పెదవి విప్పడం లేదు. ఎంఓయులు కుదుర్చుకున్నప్పటి నుంచి 2013 వరకూ ఆయా సంస్థలు దాదాపు రూ. 142 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అర్ధాంతరంగా ఒప్పందాలు రద్దవడంతో పెట్టిన పెట్టుబడులు రాబట్టే యత్నంలో రెండు సంస్థలు ఉన్నట్లు సమాచారం.

04/14/2016 - 06:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా మరో చి క్కులోపడ్డారు. ప్రభుత్వరంగ బ్యాం కైన ఐడిబిఐ బ్యాంకు నుంచి రూ. 900 కోట్లకుపైగా రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారన్న కేసులో మాల్యా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన అభియోగాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతని పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాల్సిందిగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది.

04/14/2016 - 06:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: వచ్చే ఏడాది జనవరికల్లా పేమెంట్స్ బ్యాంక్‌ను ప్రారంభిస్తామని తపాలా శాఖ తెలిపింది. తపాలా శాఖతోపాటు 10 ఇతర సంస్థలకు గత ఏడాది ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం అనుమతులిచ్చినది తెలిసిందే. ఈ అనుమతి 18 నెలల వరకే వర్తిస్తుంది.

04/14/2016 - 06:02

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దుబాయ్‌కి చెందిన నిర్మాణరంగ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్, దేశీయ సంస్థ ఎమ్‌జిఎఫ్ డెవలప్‌మెంట్.. తమ పదకొండేళ్ల జాయింట్ వెంచర్‌కు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాయి. ఎమ్మార్ ఎమ్‌జిఎఫ్ ల్యాండ్ లిమిటెడ్‌ను విడదీయడం ద్వారా జాయింట్ వెంచర్‌కు ముగింపు పలకనున్నాయి.

04/14/2016 - 06:18

వాషింగ్టన్, ఏప్రిల్ 13: ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉత్పన్నమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) హెచ్చరించింది. ఈ పరిస్థితిని తగినవిధంగా ఎదుర్కొనేందుకు వీలుగా సమీకృత రీతిలో విధానపరంగా పట్టుతరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

04/13/2016 - 08:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశ ఆర్థిక వ్యవస్థ జోరు మీదున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) సూచీ 2 శాతానికి పెరగగా, మార్చి నెలలో చిల్లర ద్రవ్యోల్బణం 6 నెలల కనిష్టానికి దిగివచ్చింది మరి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతంగా నమోదైంది.

04/13/2016 - 08:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: వౌలికరంగ సంస్థ జెపి అసోసియేట్స్.. దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రానిక్ చిప్ ప్రాజెక్టును విరమించుకుంది. ‘సెమికండక్టర్ ప్లాంట్ ప్రతిపాదనను జెపి అసోసియేట్స్ వెనక్కి తీసుకుంది.

04/13/2016 - 08:04

ముంబయి, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. గత కొనేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడని నేపథ్యంలో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే మించి నమోదవుతుందన్న అంచనాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారు. సోమవారం సైతం ఇదే కారణంతో సూచీలు భారీ లాభాలను అందుకున్నది తెలిసిందే.

04/13/2016 - 08:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఆభరణాల వర్తకులు తిరిగి తమ దుకాణాలను తెరిచారు. మంగళవారం దేశవ్యాప్తంగా చాలాచోట్ల నగల షాపు ల్లో వ్యాపారం జరిగింది. వెండి మినహా మిగ తా ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో గత నెల 2 నుంచి దేశవ్యాప్తంగా జ్యుయెలర్లు నిరవధిక బంద్‌ను పాటిస్తున్నది తెలిసిందే.

04/13/2016 - 08:01

ఆర్మూర్, ఏప్రిల్ 12: పట్టు, చేనేత రంగంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు చేయడానికి అమెజాన్ కంపెనీతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలంగాణ రాష్ట్ర భారీ పరిశ్రమలు, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా పట్టు, చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Pages