S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/11/2016 - 07:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం 10 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా బయలుదేరనున్నారు. అక్కడ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్), ప్రపంచ బ్యాంక్ సమావేశాలకు హాజరవుతారు. ఈ సమావేశాల్లో ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ కూడా పాల్గొంటున్నారు.

04/11/2016 - 07:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: జైలుకు వెళ్ళడానికి కొద్ది వారాల ముందు సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ విదేశాలకు వెళ్ళాలని సుప్రీం కోర్టును కోరినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ న్యాయవాది అర్వింద్ దతర్ తెలిపారు. బిల్ క్లింటన్, టోని బ్లెయిర్‌లతో వ్యాపారపరమైన చర్చలు జరపాల్సి ఉందని రాయ్ చెప్పినట్లు దతర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న దతర్ తన ప్రసంగంలో వెల్లడించారు.

04/11/2016 - 07:03

నెల్లూరు, ఏప్రిల్ 10: రైతులను దళారులు నిట్టనిలువునా దోచేసుకుంటున్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే అన్నదాతకు సుమారు రూ. 500 కోట్ల నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతుకు దళారుల జోక్యం వలన కలిగిన నష్టమిది. రాష్ట్రం మొత్తం కరవుతో అల్లాడుతుంటే గత ఏడాది జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సోమశిల, కండలేరు జలాశయలాలతో పాటు జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి.

04/11/2016 - 07:02

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) మార్చిలో మాత్రం షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ఈ నెలలోనూ అదే దారిలో వెళ్తున్నారు. ఏప్రిల్‌లో ఇప్పటిదాకా 7,600 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను పట్టుకొచ్చారు.

04/11/2016 - 07:01

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: బకాయిల వసూళ్లకు సంప్రదింపులు సరైన మార్గమని విజయ్ మాల్యా వ్యవహారంలో బ్యాంకులకు పారిశ్రామిక సంఘం అసోచామ్ సూచించింది. లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయి పడినది తెలిసిందే.

04/10/2016 - 05:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: జర్మనీకి చెందిన ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్.. శనివారం బజాజ్ ఆటోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పోలో కారు భద్రతా ప్రమాణాల గురించి తప్పుడు సమాచారాన్ని బజాజ్ ఆటో అందిస్తోందంటూ మండిపడింది. గురువారం బజాజ్ ఆటో ‘ఇటీవలి యూరో ఎన్‌సిఎపి నివేదికలో బజాజ్ క్యూట్ వన్ స్టార్ రేటింగ్ అందుకుంది.

04/10/2016 - 05:50

కోట (రాజస్థాన్), ఏప్రిల్ 9: గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆర్డర్లన్నింటినీ గోప్యంగా ఉంచుతున్నారు. ఎవరికీ తెలియని చోట పని కానిచ్చేస్తున్నారు. ఇదీ.. నగల వ్యాపారుల దుస్థితి ఇప్పుడు. బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జ్యుయెల్లర్లు నిరవధిక బంద్‌ను పాటిస్తున్నది తెలిసిందే.

04/10/2016 - 05:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వరుసగా మూడోసారి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట హాజరు కాలేదు. ఐడిబిఐ బ్యాంకుకు రూ. 900 కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టిన మాల్యాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే.

04/10/2016 - 05:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దేశంలోకి 98 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ)లు ఆటోమేటిక్ మార్గం గుండానే వస్తున్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) ఆమోదం ద్వారా వచ్చే ఎఫ్‌డిఐలు తగ్గుతున్నాయని ఆయన శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

04/10/2016 - 05:45

హైదరాబాద్, ఏప్రిల్ 9: స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలను (ఎంఎస్‌ఎంఇ) ప్రోత్సహించేందుకు జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)తో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అఫ్ ఇండియా (సిడ్బి) ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సమక్షంలో ఒప్పందం కుదిరిందని ‘సిడ్బి’ ఒక ప్రకటనలో పేర్కొంది.

Pages