S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/10/2016 - 05:38

హైదరాబాద్, ఏప్రిల్ 9: ప్రపంచంలోనే అత్యధిక అణు ఇంధన ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్‌లోని అణు ఇంధన సంస్థ (ఎన్‌ఎఫ్‌సి) నిలిచింది. గత 2015-16 ఆర్థిక సంవత్సరంలో అణు రియాక్టర్లలో ఉపయోగించే 1503 మెట్రిక్ టన్నుల పీడన శక్తితో కూడిన భార జలాన్ని (పిహెచ్‌డబ్ల్యుఆర్) ఉత్పత్తి చేసింది. ఈ వివరాలను అణు ఇంధన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) డాక్టర్ ఎన్ సాయిబాబా తెలిపారు.

04/10/2016 - 05:33

కాకినాడ, ఏప్రిల్ 9: కోస్తా తీరంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తోంది. ఉప్పునీరు, మంచినీటి చెరువుల్లో రొయ్యల సాగు చేపట్టడానికి ముందుకువచ్చే రైతులకు సకాలంలో తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తోంది. సాగుదారులకు బ్యాంకుల ద్వారా రుణాల కల్పనకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.

04/10/2016 - 05:33

ముంబయి, ఏప్రిల్ 9: మదుపరులు లాభాల స్వీకరణపై దృష్టి పెట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం 3 వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 595.80 పాయింట్లు నష్టపోయి 24,673.84 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 157.85 పాయింట్లు పడిపోయి 7,555.20 వద్ద నిలిచింది.

04/09/2016 - 08:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశవ్యాప్తంగా 8 సర్కిళ్లలోగల ఎయిర్‌సెల్ 4జి స్పెక్ట్రమ్‌ను భారతీ ఎయిర్‌టెల్ కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు 3,500 కోట్ల రూపాయలను ఎయిర్‌సెల్‌కు ఎయిర్‌టెల్ చెల్లించనుంది.

04/08/2016 - 06:43

ముంబయి, ఏప్రిల్ 7: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న రిస్క్‌లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రధానంగా ఎత్తిచూపిన నేపథ్యంలో విదేశీ మార్కెట్లు నష్టాల బాటలో సాగడంతో పాటుగా, నాలుగో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలపై అంచనాలు సైతం మారిపోతున్న దృష్ట్యా మదుపరులు తమ వద్ద ఉన్న స్టాక్స్‌ను వదిలించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో గురువారం బిఎస్‌ఇ సెనె్సక్స్ 215 పాయింట్లు నష్టపోయి మూడు వారాల కనిష్టస్థాయికి పడిపోయింది

04/08/2016 - 12:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: బ్యాంకులకు తొమ్మిదివేల కోట్ల రూపాయలు ఎగవేసిన లిక్కర్ వ్యాపారి విజయ్‌మాల్యా ఆస్తుల వివరాలు ఈనెల 21లోగా వెల్లడించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. చర, స్థిరాస్తులతో పాటు అన్ని రకాల ఆస్తులు తమ ముందు ఉంచాలని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రొహింగ్టన్ ఫాలీ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మాల్యా భార్య, పిల్లల పేర్లతో ఉన్న ఆస్తులు వెల్లడించాలని బెంచ్ తెలిపింది.

04/08/2016 - 06:40

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి రూ.7,720.64 కోట్ల వ్యాపారం చేసినట్లు నాబార్డు తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం తెలిపింది. దీనిలో ధీర్ఘకాలిక పెట్టుబడి రుణాల రీ ఫైనాన్స్‌కు రూ.3630.64 కోట్లు, పంటల ఉత్పాదన, మార్కెటింగ్, ఇతర అవసరాలకు గాను స్వల్పకాలిక రీఫైనాన్స్ కింద రూ2479 కోట్లు అందించినట్లు వెల్లడించింది.

04/08/2016 - 06:40

హైదరాబాద్, ఏప్రిల్ 7: హైదరాబాద్ నుంచి కడపకు, కడప నుంచి హైదరాబాద్, కడప నుంచి తిరుపతి పట్టణాలకు ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ సెక్టార్‌లో విమాన సర్వీసులను నడుపుతున్న ఏకైక సంస్థ ట్రూజెట్ మాత్రమేనని టర్బో మెగా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ వంకాయలపాటి ఉమేష్ తెలిపారు.

04/08/2016 - 06:39

వియెన్నా (ఆస్ట్రియా), ఏప్రిల్ 7: వచ్చే నాలుగేళ్లలో భారత్ ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన మార్కెట్లలో మూడవదిగా ఆవిర్భవిస్తుందని అంచనాలు స్పష్టం చేస్తుండటంతో అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని యోచిస్తున్న ఎయిరిండియా అందులో భాగంగా యూరప్‌లోని పలు కొత్త మార్గాల్లో తమ సేవలను ప్రారంభించేందుకు గల అవకాశాలను అనే్వషిస్తోంది.

04/08/2016 - 06:39

ముంబయి, ఏప్రిల్ 7: ఆసియాలో ఈ ఏడాది అత్యంత ప్రభావశీరురైన 50 మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రముఖ పత్రిక ‘్ఫర్బ్స్’ తాజాగా విడుదల చేసిన జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్ అరుంధతీ భట్టాచార్య తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.

Pages