S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/08/2016 - 06:36

విశాఖపట్నం, ఏప్రిల్ 7: ఈ ఏడాది చివరికి రాష్ట్రంలో 4జి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బిఎస్‌ఎన్‌ఎల్ ఎపి సర్కిల్ సిజిఎం మురళీధర్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తమ సర్కిల్ దాదాపు రూ.160 కోట్ల మేరకు లాభాలను ఆర్జించిందని వెల్లడించారు. రానున్న మూడు నెలల్లో 3జి సేవలను మరింతగా మెరుగుపరిచేందుకు 1450 సెల్ టవర్లు నిర్మించనున్నట్లు చెప్పారు.

04/08/2016 - 06:36

విశాఖపట్నం, ఏప్రిల్ 7: గిరిజన సహకార సంస్థ(జిసిసి) ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.12 కోట్ల నిధులు కేటాయించింది. 4+1 పద్ధతిలో భవనాన్ని నిర్మించాలని జిసిసి యాజమాన్యం ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి రూ.16 కోట్లతో కూడిన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించింది.

04/08/2016 - 06:35

కురిచేడు, ఏప్రిల్ 7: ఖరీదైన విత్తనం.. భారీ సేద్యం.. లోపం ఎక్కడ ఉందోకానీ దిగుబడిపై పెను ప్రభావం చూపింది. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సిన మిర్చి రెండు క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో రైతులు భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో నాణ్యత లోపించిన మిర్చి విత్తనాలతో సుమారు 400 ఎకరాల్లో సాగుచేసిన రైతులు దిగుబడి రాక సుమారు 20కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయారు.

04/08/2016 - 06:34

ముంబయి, ఏప్రిల్ 7: జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) ఇటీవల ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా 11 వేల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు.

04/07/2016 - 07:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: గత ఏడాదికిపైగా క్రమేణా క్షీణిస్తున్న ఎగుమతులను మళ్లీ వృద్ధిపథంలో నిలిపేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)తోపాటు ఆరు ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించింది.

04/06/2016 - 07:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును పావు శాతం తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం అభిప్రాయపడ్డారు. రుణాలపై వడ్డీరేట్లు తగ్గించడానికి బ్యాంకులను ప్రోత్సహించిందని పేర్కొన్నారు. ‘నేడు ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.

04/06/2016 - 07:49

భీమవరం, ఏప్రిల్ 5: డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుకు నాసిరకం సీడ్ బెడద ఎక్కువైంది. గత కొనే్నళ్లుగా ఆక్వాను ఈ సమస్య వైరస్‌లా వెంటాడుతోంది. ఎక్కడికక్కడ దొడ్డిదారిన హేచరీలు ఏర్పాటుచేసి, నాసిరకం సీడ్ ఉత్పత్తిచేసి, యధేచ్ఛగా అమ్మకాలు చేస్తున్నారు. ఫలితంగా రొయ్య రైతు నష్టాలను చవిచూస్తున్నాడు. ఈ సమస్య ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల సాగుచేసే అన్ని జిల్లాలకు సోకింది.

04/06/2016 - 07:36

హైదరాబాద్, ఏప్రిల్ 5: విశ్వవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామిగా గుర్తింపు పొందిన సుజుకి మోటార్స్.. ఐదు ఆకర్షణీయ రంగుల్లో సరికొత్త యాక్సెస్ 125 ద్విచక్ర వాహనాన్ని మంగళవారం తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

04/06/2016 - 07:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని దక్షిణాసియా హోటల్స్ పెట్టుబడుల సదస్సులో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సదస్సుకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తరపునా సుజనాచౌదరి హజరై ప్రసంగించారు.

04/06/2016 - 07:33

ముంబయి, ఏప్రిల్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యపరపతి విధాన సమీక్ష మదుపరులను మెప్పించలేకపోయింది. అర శాతం తగ్గుతుందన్న అంచనాల మధ్య రెపో రేటును పావు శాతం మాత్రమే తగ్గించిన నేపథ్యంలో మదుపరులు బ్యాంకింగ్ రంగ షేర్లలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రాధాన్యమిచ్చారు.

Pages