S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/05/2016 - 03:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించి దాదాపు 40 వేల కోట్ల రూపాయలను రాబట్టుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓఎన్‌జిసి, ఆయిల్ ఇండియా, కోలిండియా సహా 16 పిఎస్‌యులతో జాబితాను సిద్ధం చేసుకుంది.

04/05/2016 - 03:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా వంటి పలువురు పారిశ్రామికవేత్తలు ఉద్దేశ్యపూర్వకంగా బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలను ఎగ్గొడుతుండటం దేశ పారిశ్రామిక రంగ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు.

04/05/2016 - 03:25

న్యూఢిల్లీ,ఏప్రిల్ 4: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని కేంద్ర గనుల ఉక్కుశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మెహన్‌రావులేఖ రాశారు. విభజన అనంతరం రాష్ట్రంలోనే పెద్ద ప్రభుత్వరంగ సంస్థఅని, స్టీల్ ప్లాంట్ సామర్ధ్యానికి తగినంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

04/05/2016 - 03:24

విజయవాడ, ఏప్రిల్ 4: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా రైతుల ఉత్పత్తులకు విలువ జోడించే ‘వాల్యూ ఎడిషన్’ విధానంలో అత్యుత్తమ ధరలు, మార్కెట్ గ్యారంటీ కల్పించేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సిఇవో వైఎస్ ప్రసాద్ తెలిపారు. సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

04/05/2016 - 03:23

అనకాపల్లి, ఏప్రిల్ 4: మార్కెట్‌కు బెల్లం ధర క్రమంగా పెరుగుతోంది. డిమాండ్ పెరగడంతో ధర సైతం పెరిగిపోయింది. ఈ సీజన్‌లో ఎన్నడూ లేని విధంగా పది కిలోల మంచి రంగు బెల్లం ధర రూ. 345 పలుకుతోంది. నాసిరకం నలుపురంగు బెల్లం ధర సైతం రూ.240 నుండి రూ.280 పలుకుతోంది. పెరుగుతున్న పంచదార ధరల ప్రభావం బెల్లంపై పడడంతో ధర పెరిగినట్లు తెలుస్తోంది.

04/05/2016 - 03:21

సంగారెడ్డి, ఏప్రిల్ 4: తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న మెదక్ జిల్లాలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో ఇబ్బందులు తొలగిపోగా తాజాగా పవన విద్యుత్ ఉత్పత్తికి అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న నిమ్జ్ ఆధ్వర్యంలో స్థాపితం కానున్న వివిధ పరిశ్రమలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి కొత్త పుంతలు తొక్కనున్నారు.

04/05/2016 - 03:18

హైదరాబాద్, ఏప్రిల్ 4: యాడ్రోబ్ నెట్‌వర్క్స్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ యాడ్రోబ్‌ను ఆవిష్కరించనుంది. చిన్నవ్యాపారులకు తోడ్పడే విధంగా పాప్ స్టోర్స్ ద్వారా సేవలందించేందుకు గానూ ఈ హైపర్ లోకల్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ రూపొందించారు.

04/04/2016 - 07:02

రియాద్, ఏప్రిల్ 3: సులువుగా వ్యాపారం జరుపుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని, నిలకడయిన పన్నుల విధానాన్ని అందిస్తామన్న హామీతో సౌదీ అరేబియా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి యత్నించిన ప్రధాని నరేంద్ర మోదీ పాత పన్నుల విధానం అనేది గతించి పోయినదిగా మారపోయందన స్పష్టం చేయడమే కాక, గత ప్రభుత్వంనుంచి వారసత్వంగా సంక్రమించిన రెండు కేసుల విషయంలో తానేమీ చేయలేనని, ఎందుకంటే అవి రెండూ కోర్టు పరిధిలో ఉన్నా

04/04/2016 - 07:01

విశాఖపట్నం, ఏప్రిల్ 3: ఆన్‌లైన్‌లో అరకు కాఫీ విక్రయాలకు గిరిజన సహకార సంస్థ రంగం సిద్ధం చేసింది. అరకు కాఫీకి మరింత ప్రచారం తీసుకువచ్చి ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులకు చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే రిటైల్ సేల్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా నిర్వహించిన మార్కెటింగ్ ద్వారా రూ.25 లక్షల వ్యాపారం జరిపింది.

04/04/2016 - 07:00

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: బ్యాంకులకు ఉద్ధేశ్యపూర్వంగా వేలాది కోట్ల రూపాయల అప్పులను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి, యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ చైర్మన్ విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ కేసులో ఉచ్చు బిగుసుకుంటోంది.

Pages