S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/04/2016 - 07:00

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఏప్రిల్ 3: ఆంధ్రప్రదేశ్‌లో బంగారం దుకాణాల బంద్ కారణంగా సుమారు రూ.6 వేల కోట్లు స్తంభించిపోయి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు వర్తకులు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారపు దుకాణాలపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని విధించి కొద్ది నెలల క్రితం జివో జారీ చేశారు.

04/04/2016 - 06:59

న్యూయార్క్, ఏప్రిల్ 3: భారత్‌లో విజయ్ మాల్యాకు చెందన యుబి గ్రూపు భారీ మొత్తంలో రుణాల ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్పటికీ అమెరికాలోని యునైటెడ్ బ్రూవరీస్‌కు చెందిన అనుబంధ సంస్థ ఒకటి సంక్లిష్టమైన రీతిలో నిధులను సమకూర్చుకోగలిగింది. ఈ రుణ మొత్తాన్ని ఆ కంపెనీ భారత్‌లోన తన మాతృసంస్థనుంచి తీసుకునే బ్రిడ్జి లోన్ ద్వారా తీరుస్తామని ఆ కంపెనీ తెలియజేయడం గమనార్హం.

04/04/2016 - 06:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రిజర్వ్ బ్యాంక్ మంగళవారం జరపనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఫలితం, విదేశీ పెట్టుబడుల రాకడ, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల అంచనాలు వచ్చే వారం స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. ఆర్‌బఐ వడ్డీ రేట్ల తగ్గింపు, కంపెనీల త్రైమాసిక ఫలితాల అంచనాలు ఈ వారం ట్రేడంగ్ సెంటమెంట్‌ను ప్రభావితం చేస్తాయి.

04/03/2016 - 12:14

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: సుజ్లాన్ గ్రూప్ సిఇఒగా జెపి చలసాని నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆ సంస్థ ప్రకటించింది. ‘గ్రూప్ సిఇఒగా సుజ్లాన్ కుటుంబంలోకి జెపి చలసాని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మెకానికల్ ఇంజినీర్‌కున్న అనుభవం సంస్థ పురోగతికి ఎంతగానో దోహదపడుతుంది.’ అని సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఎన్‌టిపిసితో మొదలైన చలసాని ప్రయాణం.. రిలయన్స్ పవర్ వరకు సాగింది.

04/03/2016 - 12:13

ముంబయి, ఏప్రిల్ 2: వరుస లాభాల్లో కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు గడచిన వారం బ్రేక్ పడింది. నాలుగు వారాలుగా సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించగా, గత వారం మాత్రం అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అయితే స్వల్ప నష్టాలకే పరిమితమవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 67.92 పాయింట్లు పడిపోయి 25,269.64 వద్ద ముగిసింది.

04/03/2016 - 12:11

న్యూయార్క్, ఏప్రిల్ 2: పోప్ ఫ్రాన్సిస్ వాడిన ఫియట్ కారు.. వేలంలో ఏకంగా 3 లక్షల డాలర్లు (దాదాపు 2 కోట్ల రూపాయలు) పలికింది. గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్ పర్యటన సందర్భంగా బ్లాక్ ఫియట్ 500 లంగ్ మోడల్ కారును పోప్ వినియోగించారు. ఈ క్రమంలో గత నెల 17న దీన్ని వేలానికి పెట్టగా, గురువారం ఈ ప్రక్రియ ముగిసింది.

04/03/2016 - 12:11

న్యూఢిల్లీ/ముంబయి, ఏప్రిల్ 2: లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. 900 కోట్ల రూపాయలకుపైగా ఐడిబిఐ రుణ ఎగవేత కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఇడి.. తాజాగా మూడోసారి మాల్యాకు సమన్లు పంపింది. ముంబయిలో ఈ నెల 9న జరిగే విచారణకు హాజరుకావాలని అందులో మాల్యాకు సూచించింది.

04/03/2016 - 12:10

విశాఖపట్నం, ఏప్రిల్ 2: గిరిజన ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్న గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఈ ఏడాది సరికొత్త రీతిలో నన్నారి, మారేడు (బిల్వ) షర్బత్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ఇక నుంచి జాతీయ మార్కెట్‌లోకి తీసుకువెళ్ళాలని కూడా నిర్ణయించింది. దీనివల్ల సంస్థ ప్రతిష్ట పెంచడంతోపాటు ఆర్థికంగా మరింత బలపడవచ్చని భావిస్తోంది.

04/03/2016 - 12:09

కాకినాడ, ఏప్రిల్ 2: ఆంధ్ర రాష్ట్రంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్‌ఫెడ్) మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ వెల్లడించారు.

04/03/2016 - 12:08

విశాఖపట్నం, ఏప్రిల్ 2: గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాలను నమోదు చేసింది. రూ. 12,300 కోట్ల టర్నోవర్ సాధించినప్పటికీ లాభాలు తగ్గుముఖం పట్టడంతో దాదాపు 14 ఏళ్ల తరువాత సంస్థ నష్టాన్ని చవి చూసింది. చైనా నుంచి చౌక రకం స్టీల్ దేశీయ మార్కెట్‌లోకి దిగుమతి కావడం నష్టాలకు కారణంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Pages