S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/28/2016 - 04:22

న్యూఢిల్లీ, మార్చి 27: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల కొనసాగింపునకు, ప్రభుత్వ వౌలికాభివృద్ధి పథకాలకు వెన్నుదన్నుగా ప్రభుత్వరంగ బాండ్లలో మరిన్ని పెట్టుబడులను ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) పెట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం జరిగే సమావేశంలో పెట్టుబడుల విధానంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

03/28/2016 - 04:21

ముంబయి, మార్చి 27: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐకి చెందిన రెండు ఉద్యోగ సంఘాలు సోమవారం నుంచి నాలుగు రోజులపాటు సమ్మెకు దిగుతున్నాయి. బ్యాంక్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడిబిఐ అధికారుల సంఘం, యునైటెడ్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ఐడిబిఐ బ్యాంక్ యూనియన్ 28 నుంచి 31 వరకు ఆందోళన చేస్తున్నాయి.

03/28/2016 - 04:20

న్యూఢిల్లీ, మార్చి 27: డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తున్న క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకులకు లోనుకావచ్చన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుంది. దీంతో మదుపరులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించే వీలుందని అంచనా వేస్తున్నారు.

03/28/2016 - 04:20

సగటు మనిషి భవిష్యత్తు పొదుపుపైనే ఆధారపడి
ఉందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా వేతన జీవులు తమ సంపాదనలో కాస్తాకూస్తో దాచుకుంటేనే జీవితం. లేదంటే అంతే సంగతి. ప్రభుత్వాలు సైతం ఏటా ప్రవేశపెట్టే తమ బడ్జెట్‌లలో పొదుపునకు ప్రాధాన్యం ఇస్తుండటం దానికున్న అవసరాన్ని గుర్తు చేస్తోంది

03/28/2016 - 04:18

కాకినాడ, మార్చి 27: పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఏ పరిశ్రమ స్థాపనకైనా పారిశ్రామికవేత్తలు సహా ఔత్సాహికులు ముందుకువచ్చిన పక్షంలో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అన్ని రకాల అనుమతులు జారీ చేయాలని నిర్ణయించింది.

03/28/2016 - 04:15

రాజమహేంద్రవరం, మార్చి 27: ఇసుకను రవాణా చేసే వాహనాల చార్జీలపై నియంత్రణ లేకపోతే ఉచిత ఇసుక విధానం విజయవంతమయ్యేలా కనిపించడం లేదు. పలు జిల్లాల్లో అధికారికంగా గుర్తించిన రీచ్‌ల్లో చాలా చోట్ల నోరున్నవారిదే రాజ్యంగా తయారవుతున్న నేపథ్యంలో ఇసుక రవాణా చేస్తున్న వాహనాల యజమానులు కూడా వినియోగదారుల నుండి భారీగానే వసూలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

03/27/2016 - 05:13

న్యూఢిల్లీ, మార్చి 26: రాబోయే దశాబ్దాల్లో భారత్ మరింత అధిక వృద్ధిరేటు దిశగా పయనిస్తుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ పారిశ్రామిక సంఘం సిఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పనగరియా.. ఐరోపా సమాజం కంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఉత్తమ స్థితిలో ఉందన్నారు.

03/27/2016 - 05:12

ముంబయి, మార్చి 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో వారం లాభాలను అందుకున్నాయి. గడచిన వారం కేవలం మూడు రోజులే ట్రేడింగ్ జరిగినది తెలిసిందే. హోలి, గుడ్‌ఫ్రైడే సందర్భంగా గురు, శుక్రవారాలు మార్కెట్లు మూతపడ్డాయి. అయితే అంతకుముందు సోమ, మంగళ, బుధవారాల్లో మార్కెట్ కార్యకలాపాలు సాగగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 25వేల స్థాయి ఎగువన ముగిసింది.

03/27/2016 - 05:15

న్యూఢిల్లీ, మార్చి 26: దేశవ్యాప్తంగా నగల వ్యాపారుల ఆందోళన కొనసాగుతోంది. జిజెఎఫ్, ఎబిజెఎ, జిజెఇపిసి సంఘాలు గత శనివారమే సమ్మెను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మెజారిటీ సంఘాలు ఇంకా నిరవధికంగా బంద్‌ను పాటిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఆభరణాల వర్తకుల బంద్ 25వ రోజుకు చేరగా, జలంధర్, గుర్గావ్, అహ్మదాబాద్ పాంత్రాల్లో భారీ ఎత్తున వ్యాపారులు ర్యాలీలు నిర్వహించారు.

03/27/2016 - 05:09

భీమవరం, మార్చి 26: ప్రధాన మంత్రి సాగరమాల పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులను అనుసంధానం చేస్తామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై చర్చించి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో విద్యార్థులతో ముఖాముఖిలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

Pages