S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/24/2016 - 08:21

హైదరాబాద్, మార్చి 23: మహీంద్ర గ్రూప్‌లో భాగమైన ట్రక్, బస్ డివిజన్ నూతన వాణిజ్య వాహనం (హెచ్‌సివి) ‘బ్లాజో’ను ఆవిష్కరించింది. బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఈ వాహనంలో ఫ్యూయల్ స్మార్ట్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణతో, మల్టీ డ్రైవ్ మోడ్ ఫీచర్లతో సిఆర్‌డిఇ ఇంజిన్‌ను పరిచయం చేస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నళిని మెహతా తెలిపారు.

03/24/2016 - 08:20

అనంతపురం: రైతులు, చేనేత కార్మికులు రుణమాఫీ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రైతులకు 2014 డిసెంబర్‌లో మొదటి విడత రుణమాఫీ నిధులు విడుదలవగా, చేనేతలకు సంబంధించి మాత్రం ఇప్పటికీ ఆ శాఖ జాబితా తయారీలోనే తలమునకలై ఉంది. దీంతో రుణమాఫీకి అర్హత సాధించిన రైతులు, చేనేత రుణమాఫీలో అర్హత కోసం చేనేత కార్మికులు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

03/24/2016 - 08:19

చిత్తూరు: నల్లబెల్లం కొనుగోలుకు మార్క్‌ఫెడ్ సన్నద్దమైంది. దీంతో చెరకు రైతులకు ఊరట లభించినట్లయింది. చిత్తూరు జిల్లాలో నల్లబెల్లంపై ఆంక్షలు, మరో పక్క సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడడంతో చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారినది తెలిసిందే. జిల్లాలో వేరుశనగ తరువాత మామిడి, చెరకు ప్రధాన వాణిజ్య పంటలు. సుమారు 20వేల హెక్టార్లలో చెరకు సాగవుతోంది.

03/24/2016 - 08:19

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల మధ్య ఆర్థిక సంస్కరణలతో భారత జిడిపి వృద్ధిరేటు అదనంగా 1-2 శాతం పెరగగలదన్న విశ్వాసాన్ని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. మైనారిటీల ఆర్థిక సాధికారతపై 8వ వార్షిక ఎన్‌సిఎమ్ ప్రధానోపన్యాసం చేస్తూ అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు కలిసొచ్చేవేనని అన్నారు.

03/23/2016 - 07:36

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో దాదాపు రూ. 120 కోట్లతో చేపట్టిన సరికొత్త టెర్మినల్ కృష్ణా పుష్కరాల నాటికి వినియోగంలోకి వస్తుందని ఎయిర్‌పోర్టు డైరక్టర్ జి మధుసూదనరావు తెలిపారు. విమానాలను నిలిపేందుకు మరో పది పార్కింగ్ బేలు సిద్ధమవుతున్నాయని, ఇప్పటివరకు విఐపిల విమానాలు వచ్చినప్పుడు పార్కింగ్ కోసం ఇతర ప్రాంతాలకు పంపించాల్సి వస్తోందన్నారు.

03/23/2016 - 07:36

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వచ్చే నెల 5న జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) మొత్తంగా అర శాతం మాత్రం వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గించవచ్చని అభిప్రాయపడింది. మంగళవారం ఓ నివేదికలో ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షపై తన అంచనాలను వెల్లడించింది.

03/23/2016 - 07:35

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో చెరకు విస్తీర్ణం బాగా దిగజారుతోంది. ప్రస్తుత సీజన్‌లో కనీస గిట్టుబాటు ధర కూడా లభించని పరిస్థితుల్లో చెరకు రైతులు ఇతర పంటలకు మళ్లేందుకు సిద్ధపడుతుండటంతో వచ్చే సీజన్‌లో విస్తీర్ణం 10 నుండి 20 శాతం తగ్గే పరిస్థితి కనిపిస్తోందని చెరకు రైతుల సంఘం నాయకుడు ఎన్‌ఎస్‌వి శర్మ ఆందోళన వ్యక్తంచేశారు.

03/23/2016 - 07:34

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల పొడవునగల సముద్రతీరాన్ని పారిశ్రామిక కారిడార్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలో తొలి అడుగు పడింది. సముద్రతీరాన్ని ఆదాయ వనరులుగా మార్చుకుని మరింత అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

03/23/2016 - 07:34

ముంబయి: జెపి మోర్గాన్స్ మ్యూచువల్ ఫండ్ (ఎమ్‌ఎఫ్) భారతీయ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంగళవారం ఎడెల్‌వీస్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. వ్యాపారపరంగా ఎడెల్‌వీస్‌కు జెపి మోర్గాన్ ఎమ్‌ఎఫ్ ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో జెపి మోర్గాన్ భారత మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ఎడెల్‌వీస్ హస్తగతం చేసుకుంటుండగా, ఈ లావాదేవీల విలువను ఇరు సంస్థలు వెల్లడించలేదు.

03/22/2016 - 04:24

న్యూఢిల్లీ/ముంబయి: బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న నగల వర్తకుల మధ్య సమ్మె విరమణ విషయంలో బేధాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. సగానికిపైగా ఆభరణాల వ్యాపారులు సమ్మెను కొనసాగిస్తుండగా, మిగతావారు తమ ఆందోళనను విరమించారు.

Pages