S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/24/2015 - 05:30

విజయవాడ, డిసెంబర్ 23: దేశంలో ఖనిజ ఆధారిత పరిశ్రమల స్థాపనకు రెండవ అనుకూల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంకు గుర్తింపు లభించిందని భూగర్భ, ఖనిజ వనరుల శాఖ కార్యదర్శి యం.గిరిజా శంకర్ పేర్కొన్నారు. 2016 జనవరి, 10 నుండి 12 వరకు విశాఖపట్నంలో పారిశ్రామిక శిఖరాగ్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

12/24/2015 - 05:30

విశాఖపట్నం, డిసెంబర్ 23: విశాఖ ఆర్‌కె బీచ్ కోత నివారణకు ఇసుక నింపటం (డంపింగ్) ఒక్కటే పరిష్కారం కాగలదని స్పష్టమైంది. బీచ్ కోతను నివారించేందుకు తాత్కాలిక, శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న యంత్రాంగం తాజాగా విదేశీ సంస్థ అధ్యయనం మేరకు తీరంలో భారీస్థాయిలో ఇసుక నింపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

12/24/2015 - 05:29

ముంబయి, డిసెంబర్ 23: విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు అద్భుతంగా ఉన్న అమెరికా గణాంకాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిసాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 260 పాయింట్లు వృద్ది చెందగా జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 80 పాయింట్లు లాభపడింది. డిసెంబర్ 3 తర్వాత అంటే దాదాపు 3 వారాల తర్వాత ప్రధాన సూచీలు ఇంత గరిష్ఠస్థాయిని తాకడం ఇదే మొదటిసారి.

12/23/2015 - 05:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వంటి కొన్ని కీలక బిల్లులకు పార్లమెంట్‌లో మోక్షం లభించకపోవడంతో దేశంలో గత కొద్ది నెలల నుంచి విధాన సంస్కరణల అమలు వేగం తగ్గిందని, ఆర్థిక వ్యవస్థపై ఇది దీర్ఘ కాలం పాటు ప్రతికూల ప్రభావం చూపుతుందని పారిశ్రామిక విభాగం పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పిహెచ్‌డిసిసిఐ) మంగళవారం స్పష్టం చేసింది.

12/23/2015 - 05:29

రాజమండ్రి, డిసెంబర్ 22: రైళ్ల వేగాన్ని పెంచడానికి వీలుగా దువ్వాడ-విజయవాడ రైలు మార్గాన్ని మరింత పటిష్టపరిచామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త చెప్పారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం దువ్వాడ నుండి రాజమండ్రి వరకు రైల్వే స్టేషన్లు, వివిధ విభాగాల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం రాజమండ్రిలో విలేఖర్లతో ఆయన మాట్లాడారు.

12/23/2015 - 05:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో వినియోగదారుల సంక్షేమం కోసం ఆహార ఉత్పత్తులకు సంబంధించిన లేబులింగ్ నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని జాతీయ ఆహార భద్రతా, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ఉద్ఘాటించింది.

12/23/2015 - 05:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: రెండు లక్షల రూపాయలకు పైబడిన నగదు లావాదేవీలకు పాన్ తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆభరణాల తయారీ దారుల సంఘం అయిన అఖిల భారత రత్నాలు, బంగారు ఆభరణాల వ్యాపార సమాఖ్య (జిజెఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాలని కోరింది.

12/23/2015 - 05:26

పరకాల, డిసెంబర్ 22: సాంకేతిక సొగసులతో వరంగల్ జిల్లాకే భూపాలపల్లి కోల్‌బెల్ట్ ఏరియా తలమానికంగా మారింది. ఏరియాలో బొగ్గు గనుల విస్తరణతో పాటు వ్యాపార రంగంగా దినదినం వృద్ధి చెందుతుంది. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి కాంతిపుంజమై అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న సింగరేణి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి భూపాలపల్లిలో ముస్తాబు అవుతోంది. సింగరేణి వేడుకలను యాజమాన్యం ప్రత్యేక ఏర్పాటు చేసింది.

12/23/2015 - 05:26

ముంబయి, డిసెంబర్ 22: సోమవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి నష్టాలు చవి చూసాయి. విదేశీ మార్కెట్లలో మిశ్రమ ధోరణుల నేపథ్యంలో మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో బిఎస్‌ఇ ప్రధాన సూచీ సెనె్సక్స్ 145 పాయింట్లు నష్టపోయి 26 వేల పాయింట్ల దిగువకు చేరుకోగా, జాతీయ స్టాక్‌ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది.

12/23/2015 - 05:25

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆర్ధిక సంస్కరణల అమలుపై పార్లమెంటులో రాజకీయంగా ఏకాభిప్రాయం లోపించినా, జాప్యమైనా దాని ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై ఉంటుందని అసోచామ్ అధ్యక్షులు సునీల్ కనోరియా అన్నారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, ఆర్ధిక సంస్కరణలు మందకొడిగా అమలవుతున్నాయనే సందేశం ఇస్తే ఇనె్వస్టర్లలో ఆత్మవిశ్వాసం సడలుతుందన్నారు. ఇది ముమ్మాటికి ఆందోళనకరమైన విషయమన్నారు.

Pages