S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/22/2015 - 05:25

ఈ ఏడాది పనితీరుపై రంగరాజన్ అంచనా

11/22/2015 - 05:25

దేశంలో మరిన్ని నూతన శాఖల ఏర్పాటు * బ్యాంక్ సిఇఒ ఆర్ సీతారామన్
హైదరాబాద్, నవంబర్ 21: ఖతార్‌కు చెందిన దోహా బ్యాంక్.. భారత్‌లో మరిన్ని నూతన శాఖలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. అలాగే రాబోయే మూడేళ్లలో బ్యాంక్ వ్యాపారం ప్రస్తుతం ఉన్న 2.3 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు కృషి చేస్తోంది. శనివారం ఇక్కడ దోహా బ్యాంక్ సిఇఒ ఆర్ సీతారామన్ విలేఖరులతో మాట్లాడారు.

11/22/2015 - 05:21

కార్మికుల కోసం సింగరేణి కొనుగోలు * త్వరలో మరో 7 వేలు సరఫరా

11/22/2015 - 05:20

ముంబయి, నవంబర్ 21: ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ గోఎయిర్.. శనివారం మూడు రాయితీ టిక్కెట్ల పథకాలను తీసుకొచ్చింది. క్రిస్మస్ స్పెషల్, గో ఎక్స్‌ప్లోర్, హ్యాప్పి ట్యూజ్‌డేస్ పేరిట పరిచయం చేసిన ఈ పథకాల ప్రయోజనాన్ని తమ కస్టమర్లు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య పొందుతారని గోఎయిర్ స్పష్టం చేసింది. అయితే క్రిస్మస్ స్పెషల్ పథకం ఈ ఏడాది వర్తిస్తుంది.

11/22/2015 - 05:19

వేగవంతంగా సంస్కరణలను అమలుపరుస్తాం * ఆసియాన్-ఇండియా సదస్సులో ప్రధాని మోదీ

11/22/2015 - 05:18

ముంబయి, నవంబర్ 21: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పలు స్థిర, చరాస్తులను బ్యాంకులు వచ్చే నెల 7న ఈ-వేలం వేయనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమి శనివారం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. దాదాపు 8,000 కోట్ల రూపాయల మేర బ్యాంకులకు బకాయిపడ్డ కింగ్‌ఫిషర్..

11/22/2015 - 05:18

న్యూఢిల్లీ, నవంబర్ 21: మార్కెట్‌లో పప్పుధాన్యాల ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నిల్వల సరఫరా బిహార్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఏమాత్రం ఆలస్యం కాలేదని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి సంజీవ్ బాల్యన్ శనివారం స్పష్టం చేశారు. వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన ఆయన ఖరీఫ్ పంట రాకతో పప్పుధాన్యాల ధరలు శాంతిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

11/21/2015 - 04:22

చెన్నై, నవంబర్ 20: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రజలకు నిత్యవసరాలను తక్కువ ధరకే అందించాలని హెరిటేజ్ ఫ్రేష్ సూపర్‌మార్కెట్ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం తెలియజేసింది. చెన్నైలోని తమ 30 సూపర్‌మార్కెట్లలో తక్కువ ధరకే పాలు, నీరు, కూరగాయలు లభస్తాయని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

11/21/2015 - 04:21

విజయవాడ, నవంబర్ 20: కువైట్‌కు చెందిన అల్ అఫ్రాజ్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ సౌద్ అల్ అఫ్రాజ్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్‌లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, ఏపిలో పెట్టుబడులు పెడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు వివరించారు.

11/21/2015 - 04:20

న్యూఢిల్లీ, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను 23.6 శాతం పెంచాలంటూ 7వ వేతన సంఘం చేసిన సిఫార్సు అమలుతో ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి రేటింగ్, బ్రోకరేజ్ ఏజెన్సీలు. అయితే ఆర్థిక లోటు లక్ష్యాలకు భంగం వాటిల్లకుండా, నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తామన్న విశ్వాసాన్ని కేంద్ర ప్రభుత్వం కనబరుస్తోంది.

Pages