S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/08/2016 - 07:15

కాకినాడ: పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించేందుకు వీలుగా తూర్పు గోదావరి జిల్లాలో ల్యాండ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న భూములను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలకు అనువైన భూములను గుర్తించి, సమగ్ర నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించే పనిలో అధికారులున్నారు.

03/08/2016 - 07:14

న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంటే.. మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరవుతోంది. గడచిన ఏడాది కాలంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థలు కోల్పోయినది దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే ఆయా సంస్థల షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులు నెలకు లక్ష కోట్ల రూపాయలపైనే నష్టపోయారు.

03/07/2016 - 06:20

న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలకుగాను పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాలు శుక్రవారం విడుదలవుతున్నాయి. దీంతో ఈ ప్రభావం మార్కెట్ కదలికలపై ఉంటుందని విశే్లషకులు చెబుతున్నారు.

03/07/2016 - 06:17

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ లాభాలను అందుకున్న నేపథ్యంలో మదుపరుల సంపద గణనీయంగా పెరిగింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్‌లోని టాప్-10 సంస్థల్లో ఏడింటి మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలకుపైగా ఎగిసింది. గడచిన నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా గత వారం సెనె్సక్స్ 1,492.18 పాయింట్లు పుంజుకున్నది తెలిసిందే. దీంతో 7 సంస్థల మార్కెట్ విలువ 1,14,052 కోట్ల రూపాయలు ఎగబాకింది.

03/07/2016 - 06:16

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గత వారం విదేశీ పెట్టుబడులు పోటెత్తాయ. అంతకు ముందు పెట్టుబడుల ఉపసంహ రణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గత వారం మాత్రం షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. కేవలం నాలుగు రోజుల్లో 4,100 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడు లను పట్టుకొచ్చారు.

03/07/2016 - 06:15

హైదరాబాద్: కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) యంగ్ ఇండియన్స్ (వైఐ) హైదరాబాద్ చాప్టర్ చైర్మన్‌గా జెజిఐ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ డిపి, కో చైర్మన్‌గా సందీప్ రాఠీలు ఎన్నికైనట్లు ఆయా వర్గాలు తెలిపాయి.

03/07/2016 - 06:14

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ వెలువడిన తర్వాత డజనుకుపైగా సంస్థలు డివిడెండ్లను ప్రకటించాయి. ఇలా డివిడెండ్ ప్రకటించిన సంస్థల్లో అల్కెమ్ లాబొరేటరీస్, కాడిలా హెల్త్‌కేర్, సువెన్ లైఫ్ సైనె్సస్ తదితర సంస్థలున్నాయి. మరికొన్ని సంస్థలు కూడా త్వరలోనే డివిడెండ్లు ప్రకటించనున్నాయి.

03/06/2016 - 07:29

హైదరాబాద్: ఆలోచనలకు పదును పెట్టాలని, సామర్థ్యం పెంచుకోవాలని, పనికి వెనకాడొద్దంటూ టి-హబ్ ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు బిపిఎల్ మొబైల్ వ్యవస్థాపకుడు రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని టి-హబ్ వద్ద ఆయన ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలనుద్దేశించి మాట్లాడారు.

03/06/2016 - 07:29

కోల్‌కతా: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి మధ్యంతర డివిడెండ్‌గా కేంద్ర ప్రభుత్వం 17,308 కోట్ల రూపాయలను అందుకోనుంది. శనివారం సంస్థలోని ఒక్కో షేర్‌కు 27.40 రూపాయల చొప్పున డివిడెండ్ ట్యాక్స్ కలుపుకుని మొత్తం 20,830 కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను కోల్ ఇండియా ప్రకటించింది.

03/06/2016 - 07:28

గుర్గావ్: దేశానికి అధిక బ్యాంకుల కంటే, బలమైన బ్యాంకుల అవసరమే ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకృత ఆలోచనను పరిశీలించడానికి త్వరలోనే ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

Pages