S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/02/2016 - 06:47

హైదరాబాద్: దేశాభివృద్ధికి చక్కటి ఆర్థిక ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించిందని మంగళవారం సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ శకుంతల అన్నారు. గత బడ్జెట్‌లకు తాజా బడ్జెట్‌కు ఎంతో వ్యత్యాసం ఉందన్న ఆమె ఆర్థిక క్రమశిక్షణకు బాటలు వేసేలా 2016-17 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారన్నారు. అభివృద్ధి, ఉద్యోగావకాశాలకు ఉత్తమ విధి విధానాలు ఖరారు చేశారన్నారు.

03/02/2016 - 06:46

హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగంగా ఫిబ్రవరిలో కూడా 5.37 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్టు సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు కార్మికులంతా కలసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

03/02/2016 - 06:44

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న నేపథ్యంలో సుస్థిరతకు స్థానంగా భారత ఆర్థిక వ్యవస్థ నిలుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సవాళ్లను విసురుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. మార్కెట్లు ఆందోళనకరంగా ఉన్నాయి. కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

03/01/2016 - 07:53

ముంబయి: సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2016-17 మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. మదుపరుల నిరుత్సాహంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ క్రమంలోనే భారీ నష్టాల్లో కూరుకుపోగా, చివర్లో కాస్త నష్టాల తీవ్రతను తగ్గించుకున్నాయి.

03/01/2016 - 07:50

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి, వౌలికాభివృద్ధికి పెద్దపీట వేశారు. వౌలిక రంగానికి 2.21 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. వృద్ధిరేటు బలోపేతంలో భాగంగా ఈ కేటాయింపులని స్పష్టం చేశారు.

03/01/2016 - 07:50

న్యూఢిల్లీ: గ్లోబల్ టాప్ ఎంప్లాయర్‌గా దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)కు గుర్తింపు లభించింది. టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో టిసిఎస్‌కు ఈ గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 1,072 సంస్థల్లో నిర్వహించిన సర్వేలో టిసిఎస్ అగ్రస్థానాన్ని అందుకుంది.

03/01/2016 - 08:07

హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆదాయ పన్ను సంస్కరణలు, ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం, గ్రామీణ ఆర్థిక రంగానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడాన్ని పారిశ్రామికవేత్తలు స్వాగతించారు.

02/29/2016 - 08:35

న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న 2016-17 సార్వత్రిక బడ్జెట్ వైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాయి.

02/29/2016 - 08:33

కోయంబత్తూరు: దేశంలో రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తం రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన ఎగవేతదారుల జాబితాను ప్రచురించాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

02/29/2016 - 08:31

కాకినాడ: విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) ముందుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరిగితే కోస్తాతీరం అనూహ్యంగా అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయన్నారు.

Pages