S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/27/2016 - 02:54

నెల్లూరు, ఫిబ్రవరి 26: ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటైన దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికమని ఏపీ జెన్‌కో ఎండి విజయానంద్ కొనియాడారు. శుక్రవారం కర్మాగారంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కర్మాగారం ఏర్పాటయిందని గుర్తుచేశారు. కూలింగ్ టవర్ల నిర్మాణానికి జర్మనీ నిపుణులు సహకరించారని తెలిపారు. సుమారు రూ.

02/27/2016 - 02:53

విజయవాడ, ఫిబ్రవరి 26: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జరిగిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా మూడు దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన విశాఖ స్టీల్ ప్లాంటును నేటికీ ఆంధ్రుల సెంటిమెంట్‌కు ఎక్కడా భంగం కలుగని రీతిలో, ప్రధానంగా నాణ్యతతో కూడిన ఉక్కును సరసమైన ధరలతో ప్రజల ముంగిటకు తీసుకెళుతున్నామని విశాఖ స్టీల్ ప్లాంట్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ పి మధుసూదన్ అన్నారు.

02/27/2016 - 02:51

ముంబయి, ఫిబ్రవరి 26: వరుసగా మూడు రోజులపాటు నష్టాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) దేశ జిడిపి వృద్ధిరేటు 7-7.75 శాతం ఉండొచ్చని శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2015-16 అంచనా వేయడం మదుపరులను ఉత్సాహపరిచింది.

02/27/2016 - 02:41

షాంఘై, ఫిబ్రవరి 26: బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన నూతన అభివృద్ధి బ్యాంక్ (ఎన్‌డిబి).. ఏప్రిల్ నుంచి ప్రాజెక్టులకు నిధులు అందిస్తుందని బ్యాంక్ అధ్యక్షుడు కెవి కామత్ తెలిపారు. తొలుత ఒక్కో సభ్యత్వ దేశం నుంచి ఒక్కో ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేస్తామని శుక్రవారం ఇక్కడ చెప్పారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేసినది తెలిసిందే.

02/26/2016 - 06:54

కొనియాడిన పారిశ్రామిక, వ్యాపార రంగం
పోర్టులకు రైల్వే సదుపాయ కల్పనపై హర్షాతిరేకాలు
సరకు రవాణా కారిడార్ల ఏర్పాటును స్వాగతించిన పరిశ్రమ
2016-17 ఆదాయ లక్ష్యం రూ. 1.84 లక్షల కోట్లు

02/26/2016 - 06:52

న్యూఢిల్లీ: ఫ్రీడమ్ 251 పేరిట ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసిన రింగింగ్ బెల్స్.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఫ్రీడమ్ 251 తయారీ, విడుదల, పంపిణీపై పలు అనుమానాలను ఈ సంస్థ ఎదుర్కొంటున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రీడమ్ 251కు సంబంధించి కస్టమర్ సర్వీస్ సేవలను అందిస్తున్న బిపిఒ సంస్థ సైఫ్యూచర్ తమ బకాయిలను రింగింగ్ బెల్స్ చెల్లించడం లేదని ఆరోపించింది.

02/26/2016 - 06:51

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. గత రెండు రోజులుగా అమ్మకాల ఒత్తిడిలో ఉన్న మదుపరులను రైల్వే బడ్జెట్ సైతం పెట్టుబడుల దిశగా నడిపించలేకపోయింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 112.93 పాయింట్లు పడిపోయి 23 వేలకు దిగువన 22,976 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 48.10 పాయింట్లు దిగజారి 7 వేల స్థాయిని కోల్పోతూ 6,970.60 వద్ద నిలిచింది.

02/26/2016 - 09:16

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మరోవైపు మాల్యా బ్రిటన్‌కు మకాం మార్చేయనున్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిలకు సంబంధించి బ్యాంకులు మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్‌ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

02/25/2016 - 07:55

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదకరంగా మారిన మొండి బకాయిల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), బ్యాంకుల తీరు నిరాశాజనకంగా ఉందంటూ పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పెరుగుతున్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ)తో వాటి నియంత్రణకు చేపడుతున్న చర్యల విశ్వసనీయతపై అనుమానాలు కలుగుతున్నాయంది.

02/25/2016 - 07:53

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ప్రకటించిన ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (విల్‌ఫుల్ డిఫాల్టర్లు) బకాయిల విలువ 11,705 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాలు తెలియజేస్తున్నాయి. మొత్తం 1,164 రుణాలను ఎస్‌బిఐ విల్‌ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించగా, ఇందులో లిక్కర్‌కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణం కూడా ఉంది.

Pages