S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/12/2016 - 06:22

దేవరపల్లి: అక్రమ పొగాకు కొనుగోళ్లు అరికట్టడానికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారి పి రమేష్ పేర్కొన్నారు. అక్రమ కొనుగోళ్ల వల్ల రైతులు నష్టపోవడమేకాక, బోర్డు ఉనికికే ముప్పు ఏర్పడుతోందన్నారు. ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలోగల పొగాకు వేలం కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు.

02/12/2016 - 06:21

న్యూడిల్లీ : మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉండేందుకు వీలుగా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో సవరిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పారు. అయితే ఆడపిల్లల, సీనియర్ సిటిజన్ల( వృద్ధులు)కు సంబంధించిన పథకాల వడ్డీ రేట్లను మాత్రం మార్చబోమని ఆయన చెప్పారు.

02/12/2016 - 06:20

హైదరాబాద్: దేశంలోని ఎనిమిది ప్రధాన రేవుల్లో 2020 సంవత్సరం నాటికి 135 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు మారిటైం డైరెక్టర్, కేంద్ర నౌకయాన శాఖ కార్యదర్శి దేవంద్ర కె రాయ్ తెలిపారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పరదీప్, విశాఖఫట్నం, కోల్‌కొత్తా, న్యూ మంగళూరు, కాండ్లా, కామరాజర్ తదితర రేవుల్లో ఈ సదుపాయాన్ని కల్పించేందుకు నిధులు విడుదల చేశామన్నారు.

02/12/2016 - 06:19

ముంబయి: దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం కుప్ప కూలాయి. మరోసారి ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న భయాలకు తోడు, కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం కలిపి మదుపరుల సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బ తీశాయి. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 807 పాయింట్లు నష్టపోయి 23 వేల పాయింట్ల దిగువకు చేరుకుంది.

02/11/2016 - 05:47

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు అరబ్ దేశాల నుంచి పెట్టుబడులను ఒడిసి పట్టుకోవాలని చూస్తోంది.

02/11/2016 - 05:43

ముంబయి, ఫిబ్రవరి 10: దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలున్నప్పటికీ బుధవారం కూడా సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి. సోమ, మంగళవారాల్లో కూడా స్టాక్ మార్కెట్లు క్షీణించినది తెలిసిందే.

02/11/2016 - 05:40

కడప: కడప సమీపంలోని చెన్నూరు సహకార చక్కెర కర్మాగారం ప్రైవేట్‌పరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయ. దీని మనుగడ కష్టతరంగా మారడంతో లీజుకు తీసుకునేందుకు చక్కెర ఫ్యాక్టరీల్లో అనుభవం ఉన్న పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫ్యాక్టరీని పలు వురు పారిశ్రామికవేత్తలు సందర్శించి కూడా వెళ్లారు.

02/11/2016 - 05:00

ఓబులవారిపల్లె: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో మంగంపేట బెరైటీస్ గనుల నుంచి ఇప్పటివరకు 22.80 లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికితీశామని, దీనిద్వారా 594 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని ఎపిఎండిసి మేనేజింగ్ డైరక్టర్ వెంకయ్య చౌదరి తెలిపారు. వచ్చే ఏడాది 30 లక్షల టన్నుల బెరైటీస్ వెలికితీసి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన అన్నారు. బుధవారం మంగంపేట బెరైటీస్ గనులను ఆయన పరిశీలించారు.

02/11/2016 - 04:58

ఒంగోలు: నవ్యాంధ్ర నిర్మాణ రంగంలో ప్రగతి కొన్ని ప్రాంతాలకే పరిమితమ వుతోంది. అదికూడా రెండు మూడు జిల్లాల్లో కాస్త అభివృద్ధి చెందినట్లు కనిపిస్తోంది. ముఖ్యం గా ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ కుదేలయ్యింది. జిల్లాలోని ఎక్కువ శాతం మంది రియల్టర్లు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చిన నగదును చెల్లించలేక పలాయనం చిత్తగించిన పరిస్థితులు నెలకొన్నాయి.

02/10/2016 - 06:47

న్యూఢిల్లీ: బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒడిదుడుకుల మధ్య పసిడి ధరలు మళ్లీ 28వేల స్థాయిని అధిగమించాయి. 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 710 రూపాయలు ఎగిసి 28,585 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 28,435 వద్ద నిలిచింది. కాగా, ఈ ఏడాదిలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో పసిడి ధరలు పెరగడం ఇదే తొలిసారి.

Pages