S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/26/2016 - 02:05

ముంబయి, జనవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉద్దీపనలపై విశ్వాసంతో మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 50.29 పాయింట్లు లాభపడి 24,485.95 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 13.70 పాయింట్లు కోలుకుని 7,436.15 వద్ద నిలిచింది.

01/26/2016 - 02:04

హైదరాబాద్, జనవరి 25: భారతీయ ప్రీమియర్ బిజినెస్ స్కూల్‌గా ఘనత సాధించిన ఘజియాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) 535 మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్ కల్పించడం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించింది.

01/26/2016 - 02:03

హైదరాబాద్, జనవరి 25: ఆదిలాబాద్ పట్టణంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు ముందడుగు సాధించాయి. చర్చలు ఫలిస్తే త్వరలోనే సిమెంట్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభ మయ్యే అవకాశం ఉంది.

01/25/2016 - 02:57

చండీగఢ్, జనవరి 24: భారత్-ఫ్రాన్స్‌లు వ్యాపార, వాణిజ్య రంగాల్లో సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ పర్యటన తొలిరోజైన ఆదివారం జరిగిన వ్యాపార శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశాలు పదహారు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

01/25/2016 - 02:56

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను వెల్లడయ్యే ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

01/25/2016 - 02:55

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి (కేజి) బేసిన్‌లోగల ఇన్‌ఫ్రా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతిని అందుకుంది. 53,000 కోట్ల రూపాయలకుపైగా నిధులతో 45 చమురు బావుల అభివృద్ధి, వాటికి సంబంధించిన ఇతర వౌలిక సదుపాయాలను ఒఎన్‌జిసి ఇక్కడ కల్పిస్తోంది.

01/25/2016 - 02:54

పాల్వంచ, జనవరి 24: రానున్న మూడేళ్ళలో 6 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధించి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ నిలిచేందుకు, తద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం, బంగారు తెలంగాణ సాధనకు టిఎస్‌జెన్‌కో కృషి చేస్తోందని టిఎన్‌జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు.

01/25/2016 - 02:53

హైదరాబాద్, జనవరి 24: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) హైదరాబాద్ ఆధ్వర్యంలో రెండురోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఈకోల్ డి మేనేజ్‌మెంట్ డి నార్మండి, హంగేరికి చెందిన కోర్వినస్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.

01/25/2016 - 02:52

దావోస్, జనవరి 24: మదుపరులలో విశ్వసనీయతను పెంచేందుకు కృషి చేస్తామని, భారత ఆర్థిక వ్యవస్థను ప్రగతిపథంలో నడిపిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో జైట్లీ మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక రంగాన్ని కోరారు. ‘నేడు భారత్‌ను ఓ వెలుగు రేఖగా ప్రపంచం అభివర్ణిస్తోంది.

01/25/2016 - 02:52

పరకాల, జనవరి 24: వరంగల్ జిల్లాలోని 500 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కెటిపిపి)లో ఆదివారం తెల్లవారుజాము నుండి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. మొదటి దశ వార్షిక మరమ్మతుల నిమిత్తం గత ఏడాది డిసెంబర్ 28న ప్లాంట్‌ను నిలిపివేసి ఓవరాయలింగ్ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయతే మొదటి 15 రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ, వివిధ కారణాలతో మరో 10 రోజలపాటు మరమ్మతులు కొనసాగాయ.

Pages