S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/22/2016 - 05:17

ముంబయి, జనవరి 21: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత దిగువకు పడిపోవడంతో ఆసియా మార్కెట్లన్నిటిలో పెద్ద ఎత్తున అమ్మకాల కారణంగా గురువారం దేశీయ మార్కెట్ బెంచ్‌మార్క్ అయిన బిఎస్‌ఇ సెనె్సక్స్ మరో వంద పాయింట్లు పడిపోయింది. దీంతో 20 నెలల తర్వాత తొలిసారిగా సెనె్సక్స్ 24 వేల పాయింట్ల దిగువకు చేరుకుంది.

01/22/2016 - 05:15

న్యూఢిల్లీ, జనవరి 21: తెలంగాణలో ఎన్‌ఐఎంజడ్ (నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దీని వలన ప్రత్యక్షంగా 75 వేల మందికి, పరోక్షంగా మరో 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ట్విట్టర్’లో వెల్లడించారు.

01/22/2016 - 05:14

హైదరాబాద్, జనవరి 21: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మితమవుతున్న సింగరేణి ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎన్.శ్రీధర్ సింగరేణి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జైపూర్ థర్మల్ విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.

01/22/2016 - 05:12

హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక వేత్తలు, కార్మికులు సంతోషంగా ఉన్నారని వారి మద్దతు టిఆర్‌ఎస్‌కేనని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. నగరంలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో పారిశ్రామిక వేత్తలు, కార్మికులు గురువారం సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభలో కెటిఆర్ మాట్లాడుతూ, గతంలో హైదరాబాద్‌లో విద్యుత్ కోతలు నిత్యకృత్యంగా ఉండేవని తెలిపారు.

01/21/2016 - 06:29

న్యూఢిల్లీ, జనవరి 20: బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసి గ్రూప్‌నకు చెందిన ఇన్‌స్టంట్ నూడుల్స్ బ్రాండ్ ఇప్పీ.. వెయ్యి కోట్ల బ్రాండ్‌కు కూతవేటు దూరంలో ఉంది. దేశీయ మార్కెట్‌లో ప్రధాన ప్రత్యర్థి అయిన నెస్లే మ్యాగీపై నిషేధమే ఇప్పీ బ్రాండ్ విలువ పుంజుకోవడానికి ప్రధాన కారణం. మ్యాగీ వివాదంతో మార్కెట్‌లో ఇప్పీ అమ్మకాలు గణనీయంగా పెరగడంతో దాని మార్కెట్ విలువ కూడా ఎగిసింది.

01/21/2016 - 07:45

ముంబయి, జనవరి 20: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 2,175 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 15 శాతం అధికం. పోయినసారి 1,900 కోట్ల రూపాయల నికర లాభాన్ని బ్యాంక్ నమోదు చేసింది.

01/21/2016 - 06:25

హైదరాబాద్, జనవరి 20: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ ఫోర్డ్.. హైదరాబాద్‌లో బుధవారం తమ కొత్త కారును ఆవిష్కరించింది. సరికొత్త ఎండీవర్ ఎస్‌యువి కారును పరిచయం చేసింది. రెండు రకాల శక్తివంతమైన, ఇంధన పొదుపు సామర్థ్యం కలిగిన ఇంజిన్లతో ఎండీవర్‌ను డిజైన్ చేసినట్లు ఈ సందర్భంగా ఫోర్డ్ తెలియజేసింది. 2.2 లీటర్, 3.2 లీటర్ ఇంజిన్లతో ఇవి అందుబాటులో ఉంటాయని వివరించింది.

01/21/2016 - 08:12

రాజమహేంద్రవరం, జనవరి 20: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి.. రాజమహేంద్రవరం పరిసరాల్లోగల చమురు, సహజవాయువు నిక్షేపాలను కనుగొనడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్త నిక్షేపాలను కనుగొనడానికి ప్రస్తుతం జరుగుతున్న అనే్వషణ కార్యక్రమాల్లో వేగం పెంచేందుకు ఇప్పుడున్న ఏర్పాట్లను రెట్టింపు చేయాలని ఒఎన్‌జిసి భావిస్తోంది.

01/21/2016 - 06:22

హైదరాబాద్, జనవరి 20: సింగరేణి ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు సింగరేణిలోని అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ తెలిపారు. ఒక్కో ప్రాంతంలో రెండు రోజులపాటు మేళా జరుగుతుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

01/21/2016 - 06:21

ముంబయి, జనవరి 20: ప్రపంచ వృద్ధిరేటుపై నెలకొన్న ఆందోళనలు బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్లను భారీ నష్టాలకు గురిచేశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ ఉదయం ప్రారంభం నుంచే నష్టాల్లో కదలాడాయి. చివరిదాకా ఇదే తీరు కొనసాగగా, ఒకానొక దశలో సెనె్సక్స్ దాదాపు 650 పాయింట్లు, నిఫ్టీ సుమారు 200 పాయింట్లు క్షీణించాయి.

Pages