S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/20/2016 - 07:27

వాషింగ్టన్, జనవరి 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16) గాను భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) యథాతథంగానే ఉంచింది. ఇంతకుముందు వేసినట్లుగానే 7.3 శాతంగా ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) జిడిపి వృద్ధిని సైతం 7.5 శాతంగానే ఉంచింది. అయితే చైనా వృద్ధిరేటును మాత్రం ఈ ఏడాది 6.3 శాతంగా, వచ్చే ఏడాది 6 శాతంగా అంచనా వేసింది.

01/19/2016 - 16:36

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారంనాడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 24,479 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 7,435 పాయింట్ల వద్ద ముగిసింది.

01/18/2016 - 16:48

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారంనాడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 267 పాయింట్లునష్టపోయి 24,188 వద్ద ముగిసింది. నిఫ్టీ 87 పాయింట్లునష్టపోయి 7,351 పాయింట్ల వద్ద ముగిసింది.

01/18/2016 - 07:51

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయంగా చోటుచేసుకునే పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

01/17/2016 - 08:33

బీజింగ్, జనవరి 16: ఆసియా వౌలికాభివృద్ధి బ్యాంక్ (ఎఐఐబి)ను శనివారం ఇక్కడ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఘనంగా ప్రారంభించారు. భారత్, మరో 56 దేశాలు వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరిస్తున్న ఈ బ్యాంక్‌ను గత నెల 25న బీజింగ్‌లో చైనా స్థాపించినది తెలిసిందే.

01/15/2016 - 08:37

న్యూఢిల్లీ, జనవరి 14: దేశంలో లగ్జరీ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని, పెద్ద నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ప్రజల కొనుగోలు శక్తితో పాటు బ్రాండెడ్ వస్తువుల పట్ల యువతలో అవగాహన పెరగడంతో ఈ ఏడాది లగ్జరీ మార్కెట్ దాదాపు 20 శాతం వృద్ధిచెంది 18.3 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక విభాగం అసోచామ్ తన అధ్యయనం ద్వారా వెల్లడించింది.

01/14/2016 - 07:11

న్యూఢిల్లీ, జనవరి 13: ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలు టెలికామ్ రంగంలో చేతులు కలిపేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమ్ముడి నెట్‌వర్క్‌పై అన్న 4జి సేవలు అందించడానికి గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్‌జెఐఎల్)..

01/14/2016 - 07:08

రాజమహేంద్రవరం, జనవరి 13: పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో కనీస పురోగతి కూడా కనిపించటం లేదు. పోలవరం హెడ్‌వర్క్స్ నిర్మాణ పనులతో సమానంగానే పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కూడా జరగాలి. లేదంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాదు.

01/14/2016 - 07:07

విశాఖపట్నం, జనవరి 13: ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చైనా, రష్యా వంటి దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. భారత్ మాత్రం సేవా రంగంపై వస్తున్న ఆదాయాన్ని చూపించి, ఆర్థిక ఇబ్బంది లేదని ప్రపంచ దేశాల ముందు చెప్పుకుంటుంటోంది. తయారీ, వ్యవసాయ రంగాలు పూర్తిగా ప్రతికూల పర్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది.

01/14/2016 - 07:06

ముంబయి, జనవరి 13: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం ప్రకటించిన పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), ద్రవ్యోల్బణం గణాంకాలు ప్రతికూలంగా నమోదైనప్పటికీ, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు.

Pages