S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/11/2016 - 07:06

హోస్టన్, జనవరి 10: అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టిస్తూ వంద కోట్ల డాలర్ల స్థాయిని దాటిపోయింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్న 90 కోట్ల డాలర్ల జాక్‌పాట్ కోసం శనివారం రాత్రి జరిగిన లాటరీలోనూ ఎవరినీ అదృష్టం వరించలేదు.

01/11/2016 - 07:06

న్యూఢిల్లీ, జనవరి 10: భారతీయ ఐటి సంస్థల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నై వరదలు, అమెరికా, ఐరోపా మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

01/11/2016 - 07:05

న్యూఢిల్లీ, జనవరి 10: అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్లో భారత్ దూసుకెళ్తోందని, ఈ ఏడాది 7.7 శాతం వృద్ధిరేటును అందుకోవచ్చని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పిడబ్ల్యుసి పేర్కొంది. ఈ ఏడాది కూడా చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం నడుస్తుందన్న పిడబ్ల్యుసి..

01/10/2016 - 06:00

ముంబయి, జనవరి 9: తపాలా శాఖ ప్రారంభించనున్న పేమెంట్స్ బ్యాంక్‌లో భాగస్వాములు కావడానికి దేశ, విదేశాలకు చెందిన దాదాపు 40 ఆర్థిక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని కేంద్ర సమాచార, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వీటిలో సిటిగ్రూప్, బార్క్‌లేస్, ఐసిఐసిఐ బ్యాంక్ తదితర సంస్థలున్నాయన్నారు. శనివారం సెంట్రల్ ముంబయిలోని పరెల్ వద్ద ఈ-కామర్స్ పార్సిల్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ప్రసాద్ ప్రారంభించారు.

01/10/2016 - 04:40

ముంబయి, జనవరి 9: వరుస లాభాల్లో కదలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం ఒక్కసారిగా భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. 19 నెలల కనిష్ట స్థాయికి సూచీలు క్షీణించాయి. అంతకుముందు మూడు వారాల్లో లాభాల్లోనే ఉండగా, గడచిన వారం మాత్రం చైనా స్టాక్ మార్కెట్ల పతనం, ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబ్ ప్రయోగం వంటివి మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి.

01/10/2016 - 04:39

విశాఖపట్నం, జనవరి 9: కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) గడచిన 21 సంవత్సరాల్లో 22 భాగస్వామ్య సదస్సులు నిర్వహించిందని దక్షిణ భారత సిఐఐ డైరెక్టర్ మహేశ్ నటరాజన్ తెలియచేశారు. శనివారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ప్రస్తుతం విశాఖలో జరగనున్న సదస్సులో 41 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు.

01/10/2016 - 04:38

న్యూఢిల్లీ, జనవరి 9: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. దేశీయంగా గత ఏడాది రికార్డుస్థాయి అమ్మకాలను నమోదు చేసింది. శనివారం ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2015లో భారతీయ మార్కెట్‌లో 13,502 బెంజ్ కార్లు అమ్ముడయ్యాయి. 2014లో ఇవి 10,201 కార్లుగా ఉన్నాయి.

01/10/2016 - 04:37

హైదరాబాద్, జనవరి 9: ఈ నెలాఖరుకల్లా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్‌టిపిపి) మొదటి యూనిట్ సింక్రనైజేషన్‌కు సంబంధించి పనులన్నీ పూర్తిచేయాలని సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ ఆదేశించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పురోగతిపై ఆయన అధికారులతో సమీక్షించారు.

01/09/2016 - 05:17

విశాఖపట్నం, జనవరి 8: విశాఖలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు సుమారు 30 దేశాల నుంచి ప్రారిశ్రామిక దిగ్గజాలు వస్తున్నారు. దాదాపు 2,000 మంది పారిశ్రామిక ప్రతినిధులు హాజరవుతున్నారు.

01/09/2016 - 05:09

న్యూఢిల్లీ, జనవరి 8: భారతీయ ఎగుమతులకు క్షీణిస్తున్న యువాన్ విలువ ప్రధాన అవరోధంగా తయారైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. చైనా కరెన్సీ అయిన యువాన్ విలువ పడిపోవడంతో చైనాకు భారత ఎగుమతులు ఖరీదైపోయాయన్నారు. ఇదే సమయంలో భారత్‌కు చైనా దిగుమతులు చౌకగా మారిపోయాయన్న సీతారామన్.. చైనాతో భారత వాణిజ్య లోటు పెరిగిపోతోందని పేర్కొన్నారు.

Pages