S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/19/2015 - 05:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) జిడిపి వృద్ధిరేటు అంచనాను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. 8.1-8.5 శాతం నుంచి 7-7.5 శాతానికి తీసుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఆర్థిక సర్వేలో ఈసారి జిడిపి 8.1-8.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసిన విషయం తెలిసిందే.

12/19/2015 - 05:28

ముంబయి, డిసెంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులపాటు లాభాల్లో నడిచిన సూచీలు ఈ వారం ట్రేడింగ్ చివరి రోజైన శుక్రవారం మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 284.56 పాయింట్లు క్షీణించి 25,519.22 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 82.40 పాయింట్లు కోల్పోయి 7,761.95 వద్ద నిలిచింది.

12/19/2015 - 05:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: వీసా ఫీజుల పెంపు ప్రభావం భారతీయ ఐటి పరిశ్రమ ప్రగతిపై ఉండబోదని శుక్రవారం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అన్నారు. భారతీయ ఐటి సంస్థలు తరచూ ఉపయోగించే హెచ్-1బి, ఎల్-1 వీసాలపై అమెరికా కాంగ్రెస్ ప్రత్యేక ఫీజు పేరిట 4,500 డాలర్లను విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2,000 డాలర్లా లేదా 4,000 డాలర్లా అన్నది ముఖ్యం కాదని, కస్టమర్లకు సేవలందించడమే ముఖ్యమన్నారు.

12/19/2015 - 05:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికాం సంస్థ రిలయన్స్ జియో 4జి సేవలు తొలుత రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులకే అందనున్నాయి. ఈ నెల 27న రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ముఖేశ్ తండ్రి అయిన ధీరుభాయ్ అంబానీ పుట్టినరోజు సందర్భంగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులందరికీ 4జి సేవలను అందుబాటులోకి తేనుంది రిలయన్స్ జియో.

12/19/2015 - 05:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై శుక్రవారం జరిగిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు దేశ ఆర్థిక పురోగతికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు.

12/18/2015 - 16:33

ముంబయి :స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ 284 పాయింట్లు నష్టపోయి 25,519 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 7,761 పాయింట్ల వద్ద ముగిసింది.

12/18/2015 - 06:29

రాజ్యసభలో వెల్లడించిన రవిశంకర్ ప్రసాద్
కాల్‌డ్రాప్స్‌తో వినియోగదారులకు నష్టం: ఏచూరి
మరిన్ని టవర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ

12/18/2015 - 06:28

- రాయలసీమ, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక -
పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల నుంచి 177 దరఖాస్తులు
రాష్టవ్య్రాప్తంగా 1.88 లక్షల మందికి ఉపాధి
ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

12/18/2015 - 06:27

మైనారిటీ భాగస్వాముల ఆమోదం

12/18/2015 - 06:27

అంబ్లిన్ పార్ట్‌నర్స్ పేరిట జాయింట్ వెంచర్
500 మిలియన్ డాలర్లతో ఏర్పాటు

Pages