S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2019 - 01:10

చిత్రం... గవర్నర్ దంపతులను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి దంపతులు

07/23/2019 - 01:08

బెంగళూరు, జూలై 22: కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష వ్యవహారం సోమవారం అయోమయ చందంగానే సాగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం ఈ వ్యవహారాన్ని తేల్చేస్తానని స్పీకర్ రవికుమార్ చెప్పినప్పటికీ ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కూడా కర్నాటక అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులే రాజ్యం చేశాయి.

07/23/2019 - 01:05

అమరావతి, జూలై 22: దేశంలోనే ఎక్కడా లేని విధంగా అణగారిన, దళిత వర్గాలు, మహిళలకు నామినేటెడ్ పదవులు.. కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే స్వాగతించాల్సింది పోయి ఈర్ష్యతో అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

07/23/2019 - 01:03

అమరావతి : బీసీల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు, నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు వంటి సాహసోపేత నిర్ణయాలను అమలు చేసేందుకు సమాయత్తమైంది. వీటికి చట్టబద్ధత కల్పించే దిశలో భాగంగా సోమవారం శాసనసభలో మొత్తం 6 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టారు.

07/23/2019 - 01:01

అమరావతి, జూలై 22: రాజధాని నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం రాయపూడి ఎమ్మెల్యే గృహ సముదాయాల వద్ద లిఫ్ట్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. రాయపూడి గ్రామంలో ఎమ్మెల్యేలు, ఎంపీల గృహ సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఓ భవనంలో లిఫ్ట్ మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అది అదుపు తప్పి కూలీలపై పడింది.

07/23/2019 - 00:58

కుప్పం, జూలై 22: చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను సోమవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుప్పం మండల పరిధిలోని సామగుట్టపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హనుమప్ప కుమారుడితో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

07/23/2019 - 00:57

ఒక రాకెట్ ద్వారా మూడు ఉపగ్రహాలు*
చంద్రయాన్-2 ప్రయోగం విజయం*
ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడి

07/23/2019 - 00:56

సూళ్లూరుపేట, జూలై 22: యావత్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. చంద్రుడి పైకి ‘షార్’ మరోసారి ఉపగ్రహాన్ని ప్రయోగించి భారత్ కీర్తిపతాకాన్ని అంతర్జాతీయంగా శిఖరాగ్రాహాన్ని అధిరోహింప చేసింది. రోదసీ పరిశోధనలో భారత్ మరోసారి సత్తా చాటింది.

07/22/2019 - 23:50

న్యూఢిల్లీ, జూలై 22: చందమామను అందుకునే రెండో ప్రయత్నం విజయవంతమైన మధుర క్షణాల్లో యావత్ భారతం ఉప్పొంగిపోయింది. చంద్రుడిని అనేక కోణాల్లో శోధించడానికి ఎన్నో కొత్త విషయాలను కరతలామలకం చేయడానికి జరిగిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల కోటానుకోట్ల మంది భారతీయులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు.

07/22/2019 - 23:46

జమ్మూ, జూలై 22: కాశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాద స్థావరం దాడిచేసి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. దోడా ఎస్పీ (ఆపరేషన్స్) ఆర్‌పీ సింగ్ కథనం మేరకు.. మధాన్-చంచలు అటవీ ప్రాంతంలోని గొండా ప్రాంతంలోని స్థావరాన్ని కనుగొన్నారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూపు (ఎస్‌వోజీ), స్థానిక పోలీసులు, నాలుగు రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా స్థావరంపై దాడి చేశారు.

Pages