S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/14/2018 - 03:39

కళ్యాణదుర్గం, డిసెంబర్ 13 : 2019 ఎన్నికల్లో పొత్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధిష్ఠానం నిర్ణయం మేరకే పని చేస్తామని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం రఘువీరా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయడానికే పని చేస్తుందని, ఆపై పార్టీ పెద్దల నిర్ణయం మేరకు ముందుకెళ్తామని వివరించారు.

12/14/2018 - 03:38

గుంటూరు, డిసెంబర్ 13: తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.

12/14/2018 - 03:35

మడకశిర, డిసెంబర్ 13 : అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఈరన్న తన పదవికి మరో రెండు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈరన్న విజయం సాధించారు.

12/14/2018 - 03:33

విజయవాడ, డిసెంబర్ 13: ఆదరణ-2కు సంబంధించిన పరికరాలు సకాలంలో సరఫరా చేయకపోతే ఆ డీలర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం ఆదరణ-2 పథకం అమలు తీరు, పరికరాల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

12/14/2018 - 03:33

విజయవాడ (క్రైం), డిసెంబర్ 13: రాష్ట్రంలో 21మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఆర్‌పి ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఎక్కువ మందిని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించడం గమనార్హం.

12/14/2018 - 03:40

విశాఖపట్నం (స్పోర్ట్స్) : ప్రొ కబడ్డీ చివరి లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 44-36 పాయింట్ల తేడాతో పాట్నా పైరేట్స్ జట్టును చిత్తు చేసింది. దీంతో ఇక్కడ జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్ జట్టు మూడు ఓటములు, మూడు విజయాలతో మిశ్రమ ఫలితాలు సాధించింది.

12/14/2018 - 05:01

న్యూఢిల్లీ: ఓ అజెండా ప్రకారమే రాజకీయ పార్టీలు పార్లమెంట్ కార్యకలాపాలకు అవరోధం కలిగిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. అయితే పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజా విశ్వాసం వమ్ము కాకుండా ఆయా పార్టీలు ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవాలని సూచించారు.

12/14/2018 - 03:23

హైదరాబాద్, డిసెంబర్ 13: కేంద్రంతో ఇక తాడోపెడో తేల్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్లమెంట్ సభ్యులకు దిశ నిర్దేశం చేశారు. విభజన హామీలు, కాళేశ్వరానికి జాతీయ హోదా, సచివాలయానికి బైసన్ పోలో మైదానం కేటాయింపు, కేంద్ర వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి చెందిన డిమాండ్లపై పార్లమెంట్ సమావేశాల్లో నిలదీయాలని సూచించారు.

12/14/2018 - 03:18

హైదరాబాద్, డిసెంబర్ 13: ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయేది లేదని, భవిష్యత్‌లో తామే తెలంగాణలో అధికారంలోకి వస్తామని టీపీసీసీ ప్రచార కమిటి చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, ఓడిపోవడం కాస్త బాధగా ఉన్నప్పటికీ తిరిగి తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వసుందన్నారు.

12/14/2018 - 03:15

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సభ్యుల్లో 73 మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెముక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ పేర్కొంది. అభ్యర్ధులు తాము సమర్పించిన అఫిడవిట్లలో ఈ విషయాన్ని వారే అంగీకరించడం గమనార్హమని ఏడీఆర్ గురువారం నాడు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

Pages