S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

07/27/2016 - 06:12

వరుసగా రెండోసారి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాక మూడింట రెండువంతుల ఆధిక్యత సాధించడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ రాజకీయాలలో ఒక కీలక నాయకురాలిగా మారారు. అదే సమయంలో ఎఐడిఎంకె జయలలిత కూడా తమిళనాడులో ఘనవిజయం సాధించినా ఆమె పాత్ర జాతీయ రాజకీయాల్లో పరిమితంగా వుండే అవకాశం ఉంది.

07/26/2016 - 00:03

ముస్లిం జనాభా అధికంగా ఉండే దేశాల్లో మలేసియా ఒకటి. ఇక్కడికి జకీర్ నాయక్ రావడంపై నిషేధం విధించారు. ఇంకా 16 ముస్లిం దేశాలలో ఈ యనపై నిషేధం అమల్లో ఉంది. ఢాకాలో, కిషన్‌గంజ్‌లో వరుస బాంబుపేలుళ్లు జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమై జకీర్ ప్రసంగాల వీడియోలపై నిషేధం విధించింది. ఆ దేశపు హోంశాఖామాత్యులు ప్రసంగిస్తూ, ‘జకీర్ ప్రసంగాలు, వీడియోలు పర్యటనలపై నిఘావిభాగం దృష్టి పెట్టింద’ని ప్రకటించారు.

07/25/2016 - 05:08

రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవనే మాటతో పోల్చి చెప్పుకోవాలంటే, సెక్యులరిజానికి సెక్యులరిస్టులమనే వారు తప్ప మరెవరూ హాని చేయలేరు. సెక్యులరిజం ఏ సమాజంలోనైనా అంతర్నిహితంగా ఉం టుంది. ప్రజల జీవితంలో భాగమై ఉం టుంది. అది సహజమైన జీవన సిద్ధాంతమే గనుక ఏ సైద్ధాంతికులు ప్రత్యేకంగా బోధించనవసరం లేదు. ఇది వాస్తవాలతో నిమిత్తం లేని కేవలం ఆదర్శవాదమని ఎవరైనా అనవచ్చు. అవును నిజమే.

07/24/2016 - 01:13

కొన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతే పెద్ద ఆశ్చర్యం ఉండదు. కానీ మీడియా మిడిమేళం, నేతల హడావిడి వల్ల అలాంటి అంశాలు కూడా ఉత్కంఠగా మారుతుంటాయి. ప్రత్యేక హోదా వ్యవహారం కూడా అలాంటిదే. హోదా వస్తే తప్ప ఏపీకి తెరవు లేదని తెలుసు. కానీ కేంద్రం ఇప్పట్లో ఇవ్వదనీ తెలుసు. తెలుగుదేశం పార్టీ దానిపై ఢిల్లీని గద్దించలేని నిస్సహాయురాలనీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విగతజీవురాలయింది.

07/23/2016 - 00:23

వాణి, వీణ అవిభక్త కవలలు. నీలోఫర్ ఆసుపత్రిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. కవలల్ని విడదీసి వార్తల్లోకి ఎక్కిన గుంటూర్ డా.నాయుడమ్మ నుంచి ఆస్ట్రేలియా వైద్యుల దాకా స్పందించినా వారికింకా విముక్తి దొరకలేదు. వీరి దీన గాధను తెరకెక్కించాలని ఏ నిర్మాతకూ తట్టలేదు.

07/21/2016 - 23:51

అమ్మ ఒడిలో శిశువు ఆ, ఊ,లతో ప్రారంభించి నేర్చుకునే భాష మన మాతృభాష తెలుగు. అది పాల భాష, బాల భాష. పిల్లలు ఎదిగిన కొద్దీ భాషలో కొంత మార్పు వస్తుంది. ముద్దు మాటలు, ముద్దు మాటలుగా మిగిలిపోకుండా మనం పిల్లల భాషను తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాట్లాడే భాషను శిశువు అనుకరిస్తుం టాడు. శిశువు తనకు పలకడానికి సౌలభ్యంగా ఉన్న మాటల్ని మొదటగా నేర్చుకుంటాడు.

07/21/2016 - 04:31

‘చైనాకు ఇక్కడ చేతులేర్పడినాయి
రష్యాకు ఇక్కడ
రంగమేర్పడినాది..’’

07/20/2016 - 04:49

ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా సచివాలయ ఉద్యోగులు తొలి రోజు స్వాగతం పలకడం, వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడడం ఆనవాయితీ. అదే విధంగా 2014 జూలై 2న ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసి పరెడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన తరువాత కెసిఆర్ నేరుగా సచివాలయానికి వచ్చి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.

07/20/2016 - 04:40

టర్కీ ప్రభుత్వంపై జరిగిన ఇటీవలి తిరుగుబాటు, గతంలో జరిగిన వాటి మాదిరిది కాదు. కాకపోతే ప్రస్తుత దేశాధ్యక్షుడు రీసిప్ తయ్యిప్ ఎర్డొగాన్‌కు ఒక హెచ్చరిక! తానొక 21వ శతాబ్దపు ఆధునిక అటుటుర్క్‌గా భావించుకుంటూ, అనుసరిస్తున్న అహంకార పూరిత వ్యవహారశైలి కారణంగా ఆయన వ్యతిరేకుల సంఖ్య తానూహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో భద్రతా దళాల్లో ఒక వర్గం ఆయన పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది.

07/19/2016 - 00:17

ప్రపంచంలో గురువులు కొన్ని విధాలుగా ఉన్నారు. తల్లిదండ్రులు తొలి గురువులు. పాఠశాలలో చదువు చెప్పినవారు తర్వాతి గురువులు. మనకు కులగురువులు ప్రత్యేకంగా ఉంటారు ఆషాఢ పూర్ణిమనాడు శైవ వైష్ణవాది వివిధ మతస్థులు తమతమ గురువులను పూజించుకునే సంప్రదాయం అనాదిగా భారతదేశంలో వస్తున్నది. సెప్టెంబరు 5న టీచర్స్‌డే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ప్రభుత్వం ఉత్సవాన్ని జరుపుతున్నది.

Pages