S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

07/18/2016 - 02:46

భారతదేశపు దురదృష్టమేమోగాని మన పార్టీలన్నీ సరిహద్దు రాష్ట్రాలలో రాజకీయ చెలగాటాలాడుతున్నాయి. అధికార కాంక్షతో ఇతర రాష్ట్రాలలో ఇటువంటి క్రీడలాడితే వారికింకా ప్రజాస్వామిక పరిణతి రాలేదని సరిపెట్టుకోవచ్చు. స్వాతంత్య్రానంతరం ఇన్ని దశాబ్దాలు గడిచినా అటువంటి పరిణతి ఇంకా కలగకపోవటం విచారకరమే అయినా, అందువల్ల కనీసం దేశ సమగ్రతకు, సమైక్యతకు ముప్పు ఉండదు గనుక ఆమేరకు ఉపేక్షించవచ్చు.

07/17/2016 - 05:16

బిజెపిని చూసి ప్రత్యర్ధులు కూడా జాలి పడుతున్న పరిస్థితి. అసలు ఇప్పటి రాజకీయ సీజన్‌లో ప్రత్యర్థి పార్టీని ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించాల్సిన బిజెపి, ఒక ఏడాది కాలంలో రెండుసార్లు విజయవంతంగా ఆత్మహత్మ చేసుకుంది.

07/16/2016 - 08:26

ప్రజాప్రయోజనాల పేరున వ్యక్తిగత ప్రయోజనాలను పొందడం, ఏ నేతలకు లేనంతగా పేరుప్రఖ్యాతలు సాధించడం.. అనే ముసుగులో మొదటి అంశం ప్రధానంగా కనపడినా, వ్యక్తిగత ప్రయోజనాలే రాజకీయ చోదకశక్తిగా పనిచేయిస్తున్నాయనడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే చక్కని ఉదాహరణ. తన నీడను తానే చూసుకొని బావిలోకి దూకిన పంచతంత్ర కథలోని సింహంలా బాబు, కెసిఆర్ విధానాలు, పథకాలు కొనసాగుతున్నాయి.

07/15/2016 - 03:02

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు దుందుడుకు నిరంకుశ పాలనలను, ఉగ్రవాద సైన్యాన్ని ఎదుర్కోవలసి ఉంది. అయితే కొంతకాలంగా ఈ అంశంలో ప్రజాస్వామ్య దేశాలు వెనుకడుగు వేస్తున్నాయనే అభిప్రాయం కలుగుతున్నది.

07/14/2016 - 06:08

భద్రతా దళాలపై రాళ్లు రువ్విన ఆరువందల ముప్ఫై నలుగురిని జైళ్లనుండి విడుదల చేయాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జూలై ఐదవ తేదీన నిర్ణయించిందట! ఇలా రాళ్లు రువ్విన వారు జిహాదీ బీభత్సకారులు, జిహాద్ సమర్థకులు.. వీళ్లందరూ క్రీస్తుశకం 2008 నుంచి 2014 వరకు భద్రతాదళాలతో తలపడినవారు, రాళ్ల కుప్పల వద్ద నిలబడి రాళ్ళతోనే సైనికులను, అనుబంధ సైనికులను కొట్టి గాయపరిచి చంపడానికి యత్నించినవారు.

07/13/2016 - 06:53

భారీ ఆనకట్టలు కట్టినప్పుడు నిర్వాసితుల పునరావాసం కీలక సమస్యగా మారుతున్నది. వారికి పరిహారం, పునరావాసం పూర్తి కాకుండా ప్రాజెక్ట్‌ల నిర్మాణం ప్రారంభించరాదని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో స్పష్టం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టుల కోసం వేలాది కోట్ల భారీ వ్యయానికి సిద్ధపడుతున్న ప్రభుత్వాలు పునరావాసం విషయంలో శ్రద్ధ చూపడంలేదు.

07/11/2016 - 23:40

దక్షిణ భారతంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలు బాగా విస్తరించాయి. బెంగళూరు, హైదరాబాద్, ముంబయి నగరాలకు భద్రత లేకుండా పోతున్నది. అనంతపురానికి ఐసిస్ భూతం చేరింది. దేశంలో హై ఎలర్ట్ ప్రకటించారు. కేజ్రీవాల్, కెసిఆర్, సిద్దరామయ్య వంటి ముఖ్యమంత్రులకు ఇది పరీక్షా సమయం.

07/11/2016 - 05:00

ఈ నెల అయిదవ తేదీన జరిగిన కేంద్ర మంత్రి మండలి మార్పులు వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసినటువంటివని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. కాదనేందుకు తగిన కారణం లేదు. అందులో తప్పుపట్టేందుకు కూడా ఏమీలేదు. ప్రభుత్వం వారిది, ఎన్నికలను ఎదుర్కొనేది వారు, గెలవటం అవసరం. అందుకు తగినట్లు ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వటం, కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకోవటం తప్పదు.

,
07/10/2016 - 03:53

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు విదేశీయాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మోదీ-బాబు స్థాయి వేరయినప్పటికీ, ఇద్దరూ పోటాపోటీగా విదేశాలు చుట్టివస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని, బాబు చేస్తున్న విదేశీ పర్యటనలు జయప్రదమయి, రాష్ట్రంలో పెట్టుబడుల జడివాన కురిస్తే సంతోషమే.

07/09/2016 - 07:47

ఆనందానికి విషాదం ఎప్పుడు విలోమంగా వుంటూనే వుంది. ఒకరి అవసరాలు మరొకరికి అనవసరాలుగా వుం టాయి. అనవసరం అనే వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి నిరోధకులుగానే కనబడతారు. ఓ సమస్యను పరిష్కరించడానికై మరో సమస్యను ముందుకు తేవడం పాలక నీతి. ఒక రాజెప్పుడూ పక్క రాజును నిద్రపోనీయనట్లే పాలకులెప్పుడు పాలితుల దృష్టిని మళ్ళించడం ఓ కౌటిల్య నీతే!

Pages