S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

05/31/2016 - 00:04

‘‘గుడారం రోజు కిరాయి ఐదువేలు. మూడు నెలలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టెంట్ వేసి విద్యార్థుల చేత ధర్నాలు చేయిస్తున్నారు. ఇంత డబ్బు విద్యార్థులకు ఎక్కడినుండి వచ్చింది? అంటే విద్యార్థి సంఘం పైన రాజకీయ జోక్యం ప్రత్యక్షంగా పెరిగింది’’, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రాజకుమార్ సాహు మే 10న ఒక పత్రికా విలేకర్ల సమావేశంలో అన్న మాట ఇది.

05/30/2016 - 05:08

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 19వ తేదీన వెలువడినప్పటినుంచి కాంగ్రెస్, వామపక్షాల స్పందనను గమనించగా తాము ఎందుకు ఓడామన్న విషమైగాని, మునుముందు ఏమి చేయాలన్న ప్రశ్నపైకాని వారికి ఏమీ అర్థమవుతున్నట్టు లేదు. ఇందులో కొత్త కూడా ఏమీ కనిపించదు. గతంలోనూ ఇదేవిధంగా ఓడారు. ఇదే పద్ధతిలో అయోమయపు స్పందనలు చేశారు. గంతలు కట్టుకొని తొట్రుపడుతూనే పోయారు.

05/29/2016 - 03:26

బ్రాహ్మణులను, మనుస్మృతిని, మనుధర్మ శాస్త్రాన్ని, బ్రాహ్మణిజాన్ని, హిందూమతాన్ని అహర్నిశలూ కించపరుస్తూ మాట్లాడడం పరిపాటై పోయింది ఇటీవల కొందరికి.

05/28/2016 - 00:55

సమయానుకూలమైన రీతిలో సాంస్కృతిక దౌత్యాన్ని ప్రయోగించటంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట. గత రెండేళ్ల కాలంలో హిందూమతం, బౌద్ధమతం, ఇస్లాముల మధ్య ఉన్న అంతర్లీన బంధాన్ని ఉపయోగించుకుని, విదేశీ సంబంధాలను బలోపేతం చేయగలిగారు. ఇందుకు తాజా ఉదాహరణ, ఉజ్జయినిలో జరిగిన సింహస్థ కుంభమేళాలో అనుసరించిన వ్యూహమే.

05/27/2016 - 05:13

దాదాపు 50 లక్షల మంది ఇన్సూరెన్సు తీసుకున్న కార్యకర్తలు, పార్టీ ఫిరాయించిన 17 మంది ఎమ్మెల్యేలు, అధికారం వచ్చి రెండేళ్లయినా ఇంతవరకూ రాని పదవుల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్న తమ్ముళ్ల సాక్షిగా..నేటి నుంచి మొదలుకానున్న టిడిపి మహానాడు కార్యకర్తల బ్రహ్మోత్సవం మూడురోజులు జరగనుంది.

05/26/2016 - 05:44

స్వజాతీయ సుప్రభాత
కరములు శ్రుతి చేస్తున్నవి,
స్వాభిమాన సంస్కృతి శుభ
స్వరములు వినిపిస్తున్నవి,
తిరిగి తిరిగి ‘జగతి’ కనులు
‘తూర్పు’వైపు చూస్తున్నవి,
భరతమాతృ కిరణమ్ములు
ధరణి చరిత వ్రాస్తున్నవి..

05/25/2016 - 04:50

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశా లు దుందుడుకు నిరంకుశ పాలనలను, ఉగ్రవాద సైన్యాన్ని ఎదుర్కోవలసి ఉంది. అయితే కొంతకాలంగా ఈ అంశంలో ప్రజాస్వామ్య దేశాలు వెనుకడుగు వేస్తున్నాయనే అభిప్రాయం కలుగుతున్నది. ప్రపంచంలో ప్రజాస్వామ్య వికాసానికి విశేషంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రీడంహౌస్ ప్రతి సంవత్సరం ప్రకటించే ‘ప్రపంచంలో స్వాతంత్య్ర వార్షిక నివేదిక’ ప్రజాస్వామ్య దేశాల అంకితభావానికి ప్రతీక.

05/24/2016 - 00:25

లక్ష్యసాధనకు రాజ్యాంగేతర, అప్రజాస్వామిక- హింసా మార్గాల్ని అనుసరించటం పేరు ఉగ్రవాదం. ఉగ్రవాద పికాలాపనల్లో కొమ్మకొమ్మకొక సన్నాయి అన్నట్లు, ఎన్నో విశ్వశాంతి మధుర గీతాలు. జీహాదీలు క్రూసేడర్లు మావోయిస్టులూ అందరూ విశ్వశాంతికోసమే ఉగ్రవాదాన్ని ఆశ్రయించారు అని చెపుతున్నారు. కలకత్తాలో కాళీమాత దేవాలయం ఉంది. ఆ సమీపంలో కొన్ని అంగళ్లున్నాయి.

05/23/2016 - 04:39

ఈ నెల 19వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలను మూడు ముక్కలలో ఈవిధంగా చెప్పుకోవచ్చు: ఒకటి, అవి బిజెపికి నికర లాభం. రెండు, కాంగ్రెస్‌కు, వామపక్షాలకు నికర నష్టం. మూడు, ఈ రెండు ధోరణులను తట్టుకుని నిలిచినవి ప్రాంతీయ పార్టీలు. ఈ పరిస్థితి రాగల కాలంలో దేశ రాజకీయాలకు సంకేత ప్రాయమవుతున్నది. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? స్వల్పకాలమా లేక సుదీర్ఘ కాలమా? అన్న ప్రశ్నలకు జవాబుగా అంచనాలు వేయబూనితే పొరపాటు అవుతుంది.

05/22/2016 - 03:45

శ్రీకంచీ క్షేత్రం మనదేశంలో గల సప్తమోక్ష పురాలలో ఒకటి. భారత భూమికి ఇది నాభిస్థానం. కాంచీక్షేత్రం శ్రీచక్రాకృతిలో నిర్మితమైంది. అందులో బిందుస్థానీయంగా శ్రీకామాక్షీ అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఇక్కడి స్వామి-ఏకామ్రేశ్వరస్వామి. మూగవాడు.. కామాక్షి ఏకామ్రనాథుల దయచే మాటలు వచ్చి ఐదువందల శ్లోకాలతో కామాక్షీ మాతను, స్వామిని కీర్తించిచడం వల్ల వారికి ‘‘మూక వాక్ప్రదాయక, మూక వాక్ప్రదాయని’’ అని బిరుదు కలిగింది.

Pages