S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

12/13/2015 - 04:18

‘నేను వాష్‌రూంలో వుండి మీ ఫోన్‌కాల్‌ను అందుకోలేదు. చెప్పండి సార్! ఏం కావాలి...?’ అంటూ ఓ చత్తీస్‌గఢ్ మంత్రివర్యునికి ప్రస్తుతం బలరాంపుర కలెక్టర్‌గావున్న పాల్ ఎలెక్స్ మీనన్ సంజాయిషిగా మాట్లాడిన మాటలివి.

12/12/2015 - 04:50

రాజ్‌దీప్ సర్దేశాయి లాగా కాకుండా, రాహుల్ కన్వాల్ అనే ‘ఇండియా టుడే’ ఆంగ్ల ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ కొంత నిజాయితీగా అభిప్రాయాల్ని చెపుతుంటాడు. ఇద్దరూ ‘ఇండియా టుడే’ ఛానల్‌లోనే పనిచేస్తున్నా, రాజ్‌దీప్ సర్దేశాయి హిందూ జాతీయవాదాన్ని విమర్శించేందుకే జర్నలిస్టు రంగంలో పనిచేస్తున్నట్టు మనకు స్పష్టవౌతున్నది. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను అందమైన ఆంగ్ల భాషలో ఎగతాళి చేయడమంటే ఆయనకు ఇష్టం.

12/11/2015 - 06:55

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రెండు రోజులలో డా.బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలలో భాగంగా భారత రాజ్యాంగంపై జరిగిన చర్చను ముగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగం అందరినీ విస్మయపరచింది. ఆయన ‘మారిన మనిషి’ అని అందరూ భావిస్తున్నారు. ప్రధానమంత్రి అందరినీ కలుపుకుపోయే విధంగా సౌమ్యంగా, సమన్వయంతో ప్రసంగించారు.

12/10/2015 - 05:11

మన దేశంలో గతంలో మొఘలాయి ‘పాలన’లో సర్వమత సమభావం వెల్లివిరిసిందని కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయసింగ్ ఇటీవల ఒక ముఖాముఖి సంభాషణలో చెప్పాడు. సభలలో ఇలాంటి అబద్ధాలను చెప్పే అవకాశాలు దిగ్విజయసింగ్ వంటి వారికి మృగ్యమయ్యాయి. అందువల్ల ‘ముఖాముఖి’- ఇంటర్వ్యూల ద్వారా ఆయన తన చారిత్రక ‘విజ్ఞానాన్ని’చాటుకుంటున్నాడు!

12/09/2015 - 05:51

బడుగువర్గాలను ఇతర వర్గాలవారు కో-ఆప్ట్ చేసుకుంటున్నారని, అందువల్లనే బడుగులు ఒకటి కాలేకపోవటం, జనసంఖ్యలో మెజారిటీ అయి కూడా అధికారాన్ని సాధించలేక పోవటం జరుగుతున్నదని ఒక అభిప్రాయం ఉంది. ఇది కొంతవరకు నిజమే. కాని ఈ కోఆప్షన్ చర్చ పాక్షికంగా జరుగుతున్నది తప్ప సమగ్రంగా కాదు. బిహార్ ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్ని మరొకమారు చర్చించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కోఆప్షన్‌కు అనేక రూపాలున్నాయి.

12/07/2015 - 23:44

మధ్యధరా సముద్ర ప్రాంతంలోని అనేక రాజ్యాలల్లో టర్కీ ఒకటి. దీని రాజధాని పేరు అంకారా. ఇంతకుముందు ఇస్తాంబుల్ ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. క్రీ.శ.14వ శతాబ్దానికి ముందు ఇక్కడ భారతీయ సంస్కృతి ఉండేది. ఇస్తాంబుల్ ప్రాచీన నామం వైజయంతిమాల. వారి సంస్కృతి పేరు వైజయంత సంస్కృతి. ఇస్లామిక్ దురాక్రమణల తర్వాత టర్కీ తన ప్రాచీన నాగరికతను కోల్పోయింది.

12/07/2015 - 04:11

జై క్లోన్-బి అనే విషవాయువును కనుగొన్న హబర్ (Haber) కు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతినిచ్చా రు. ఈ విషవాయువుతో మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పది లక్షలకు పైగా యూ దుల్ని యుద్ధం సందర్భంగా నిర్బంధించిన కేంద్రాలలో చంపివేసారు. యుద్ధాలకు మూల ప్రభువులైన అమెరికా మాజీ అధ్యక్షులు అల్‌గోరెకు పర్యావరణ పరిరక్షణలో, ప్రస్తుత అధ్యక్షుడైన బరాక్ ఒబామాకు శాంతి పరిరక్షకుడిగా నోబెల్ పురస్కారాలు లభించాయి.

12/06/2015 - 04:17

నువ్వెవరివి? అని అడుగుతే తాను ఎవరో-ఏంటో, చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు నేటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ ఔన్నత్యాన్ని, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏమాత్రం తెలియని అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. బ్రాహ్మణ విమర్శకులు, ‘‘ఓహో...బ్రాహ్మణులంటే ఇంత గొప్పవారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా?

12/05/2015 - 03:58

ప్రపంచంలో భారత్-నేపాల్ మాదిరి ఉమ్మడి సంస్కృతి కలిగిన దేశాలు ఉండవంటే అతిశయోక్తి లేదు. చరిత్ర, భౌగోళికత, మతం, సంస్కృతి, వివాహాలు, స్వజాతీయత వంటి అంశాల్లో ఈ రెండు దేశాల మమేకత మరే రెండు దేశాల మధ్య కనిపించదు. నేరు గూర్ఖా దళాలతో కలిసి దాదాపు యాభై సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ దేశంలో పర్వతారోహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన మాజీ సైనికులకోసం అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాను.

12/04/2015 - 03:44

మానవాళి ప్రస్తుతం అవరోహణ పథంలో పయనిస్తోంది. దాదాపు రెండు శతాబ్దాలుగా విచ్చలవిడి శిలాజ ఇంధన వినియోగం ప్రకృతిలోని విభిన్న జీవరాశులను, జీవవైవిధ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. నేలలో సారాన్ని దెబ్బతీసింది, నీటిని కాలుష్యమయం చేయడమే కాదు, నీటి పరిమాణం కూడా దారుణంగా పడిపోయేలా చేసింది. మొత్తంగా చెప్పాలంటే మొత్తం పర్యావరణ వ్యవస్థనే పూర్తిగా దెబ్బతీసింది.

Pages