S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

03/08/2016 - 23:34

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు కలిసి పనిచేయగలరని, తమను తాము ఒక బలమైన వేదికగా నిర్మించుకోగలరని ఇంకా భావిస్తుండి ఉంటే, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల దృశ్యం వారికొక పెద్ద ప్రశార్థకాన్ని మిగిల్చి ఉంటుంది. ఇకనుంచి కలిసి పనిచేయగలమని, ఇతరులకు ప్రత్యామ్నాయ ప్రకటనలు చేసిన ఆ పార్టీలు ఖమ్మంలో దేనికదిగా నిలబడ్డాయి.

03/08/2016 - 05:09

ఒకప్పుడు ఆడవాళ్లు వంటగదికి, పడక గదికి అంకితమై పురుషాహంకారానికి బలవుతు జీవచ్ఛవంలా బతికేవారు. అర్ధంలేని ఆచారాలతో, మూఢ నమ్మకాలతో మగవాడి దౌర్జన్యంతో నిరాశా నిస్పహలతో తమలో తామే మూగవేదనని అనుభవించేవారు. అత్తల ఆరళ్లు, ఆడపడుచుల వేధింపులు, కట్టుకున్నవాడి అరాచకాలు, బాల్య వివాహాలతో నానా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. 12 ఏళ్ల వయసున్న బాలికలను 60 ఏళ్ల ముసలాడికి ఇచ్చి కట్టబెట్టేవారు. సతీసహగమం అమల్లో ఉండేది.

03/07/2016 - 04:39

ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒకడు హతమైనా, హత్యచేసినా వాడు తప్పక ఏ మతానికో, జాతికో, భాషకో చెందినవాడై ఉంటాడు. అతడి మరణానికి గానీ, మారణానికిగానీ కులమతాలే కారణం కానక్కర్లేదు. కానీ రాజకీయ లబ్ధి కోరే స్వార్ధపరులు ఆ వ్యక్తి కులాన్ని, మతాన్ని పేర్కొంటూ ఆ వార్తని వివాదం చేసి కుల మత వైషమ్యాలను రగుల్చుతారు. తద్వారా - తమ పదవులు తిరిగి పొందగలమని వారి ఆశ.

03/05/2016 - 23:21

పేకాటలో గెలవడం ఎంత సహజమో ఓడడం అంతే సహజం. గెలవడానికి గల కారణాల్ని బేరీజు వేసుకున్నట్లే, ఓడడానికి గల కారణాల్ని వెతుక్కుంటాడు ప్రతీ ఆటగాడు. కాని, ప్రతీ పాలకపార్టీ అట్టహాసంగా తన ప్రణాళికను, విధి విధానాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తుంది. అయిదేండ్ల కాలపరిమితికై సిద్ధం చేసిన ఆ ప్రణాళిక, ఆచరణకు నోచుకోదు.

03/04/2016 - 23:30

మోన్‌శాంటో మళ్లీ వార్తల్లోకి వచ్చిం ది. బహుళ జాతి సంస్థల వల్ల కలిగే దుష్ప్రయోజనాలను నిరోధించే ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (సిసిఐ)..మోన్‌శాంటో జాయింట్ వెంచర్ భారత్‌కు జన్యుపరివర్తన విత్తనాల (జిఎం సీడ్స్) సరఫరాలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు కాంపిటిషన్ చట్టంలోని 3(4), 4 సెక్షన్ల ప్రాథమిక దుర్వినియోగంపై విచారణ జరపాలని ఆదేశించింది.

03/04/2016 - 06:22

ఆర్థిక రంగంలో భారత్ ఎక్కడ పొరపాట్లు చేస్తున్నదన్న అంశాన్ని ఆర్థిక సర్వే 2015-16 చక్కగా వివరించింది. అంతే కాదు వీటిని సరిదిద్దుకొనేందుకు వీలైన ఆచరణశీల మార్గాలను కూడా సూచించడం విశేషం. ముఖ్యంగా ఈ సర్వే సూచించిన అతిముఖ్యమైన అంశం వ్యవసాయానికి సంబంధించినది. మనదేశ వ్యవసాయం తృణధాన్యాల కేంద్రంగా మారిపోతున్నదన్నది సర్వే స్పష్టం చేసిన ముఖ్యమైన అంశం.

03/03/2016 - 05:49

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశద్రోహ కలాపాలు జరిగిపోవడం గురించి దేశ ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలోనే పూణె నగరంలో మరో చారిత్రక వైపరీత్యం సంభవించింది. సంఘ విద్రోహ కలాపాలకు పాల్పడినందుకు శిక్షను అనుభవిస్తుండిన సంజయ్‌దత్‌కు అర్థాంతరంగా నిర్బంధ విముక్తి లభించడం ఈ వైపరీత్యం. ఈ సంజయ్‌దత్ హిందీ చలన చిత్రాలలో నటించి పేరుమోసినవాడు.

03/02/2016 - 04:47

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన కొనసాగిస్తున్నప్పుడు...తాము అనుకున్న విధంగానే బడ్జెట్ ఉన్నదనే సర్వే సర్వత్రా వ్యక్తమైన అభిప్రాయం. ఋతుపవనాలు దాగుడు మూతల పుణ్యమాని రెండు వరుస సీజన్లలో పంటలు దెబ్బతిని నానా ఇబ్బందులకు గురవుతున్న రైతుల పట్ల ఈసారి కేంద్ర ప్రభుత్వం అపారమైన ప్రేమను కనబరచింది.

03/01/2016 - 06:22

భారత రాజ్యాంగం దేశ ప్రజలకు భావ స్వాతంత్య్రం, వాక్‌స్వాతం త్య్రం, పత్రికా స్వాతంత్య్రం ప్రకటించింది. రాజ్యాంగ అధికరణ 19-ఎ-2 ద్వారా దేశ పౌరుడు నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. ఇదొక గొప్పవరం. దేశ ద్రోహులు ఈ అధికరణను దుర్వినియోగం చేయడం మన దేశానికి శాపంగా పరిణమించింది.

02/29/2016 - 06:51

జెఎన్‌యు ఘటనలపై ఈనెల 24వ తేదీన లోక్‌సభలో చర్చ జరిగినప్పుడు తథాగత శతపథి అనే బిజూ జనతాదళ్ సభ్యుడు మరెవరూ అనని విషయం ఒకటి చెప్పారు. యూనివర్సిటీలో ఆ వివాదాస్పద నినాదాల వార్తలు వచ్చినప్పుడు పటియాలా హౌజ్ కోర్టు దృశ్యాలను గమనించిన మీదట ఆ వైఖరి మారిందన్నారాయన. వైఖరి మారడమంటే మొదట ఆ నినాదాలను వ్యతిరేకించినవారు ఇప్పుడు సమర్థిస్తున్నారని కాదు.

Pages