S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

02/28/2016 - 07:24

ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చామని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కొచ్చిలో ఫెడరల్ బ్యాంక్ కార్యక్రమంలో అన్నప్పుడు, దోశ ధర ఎందుకు తగ్గలేదని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశ్నిస్తే, ‘ఇంకా పెనం మీదనే దోశను వేస్తే ఎలా తగ్గుతుందని’ గవర్నర్ సమాధానం. ఇదే దోశలో ఉపయోగించే ముడిపదార్ధాలైన గోధుమ, పప్పు దినుసులు నిలకడగా వుండకపోగా, రైతు చేనుగట్టు దాటగానే వినియోగదారునికి అందుబాటులో లేకుండా పోతాయి.

02/26/2016 - 23:38

ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ఆర్థికవ్యవస్థ మూలాలు, దాని ప్రగతిపై పెద్ద ఎత్తున చర్చలు, వ్యాఖ్యానాలు కొనసాగుతుంటాయి. బడ్జెట్ కాలంలో పెద్ద సంఖ్యలో సలహాలు, సూచనలు మనకు వినిపిస్తుంటాయి. స్థూలజాతీయోత్పత్తి (జిడిపి)పై ఎడతెగని చర్చలు సాగుతాయి. జిడిపిపై ఇంతటి స్థాయిలో దృష్టి కేంద్రీకరించేవారు, అదే జిడిపి వృద్ధికి దోహదపడే మహిళల శ్రామిక భాగస్వామ్యం గణనీయంగా తగ్గిపోతుండటాన్ని ఎందుకు పట్టించుకోరు?

02/26/2016 - 06:11

స్వతంత్ర ఆలోచనలు కలిగిన, ఒకనాటి నిజమైన ఉదారవాది గురిం చి బహుశా నేటి తరంవారికి తెలియకపోవచ్చు. స్వేచ్ఛా విపణి అమలులో లేని నాటి రోజుల్లోనే ఆయన సరళీకృత విధానాల కోసం గట్టిగా మాట్లాడేవాడు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరు ఆయన ఇంటిపేరు ఒకటే. ఇంతకూ ఆయన పేరు పిలూ మోదీ- అద్భుతమైన హాస్యం పండించే రాజకీయవేత్త. ఆయన 1967లో గుజరాత్ లోని గోద్రా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

02/25/2016 - 00:16

అక్షరాలు అజామర
భావానికి రూపాలు..
అక్షరాలు విశ్వవిహిత
నాద జనిత రాగాలు...
అక్షరాలు ఎద విరిసిన
సుమనముల పరిమళాలు
‘అమ్మా’ అను పసిపాపల
పరిశోధన స్వరాలు

02/24/2016 - 06:47

ఈమధ్య తరచుగా వినిపిస్తున్న పదం ‘‘జాతీయవాదం’’. దీన్ని గురించి ఎవరైనా రాయాలనుకుంటే, ఇప్పటికే ఈ పదంపై వ్యక్తమైన సాధారణ అభిప్రాయాలను ప్రస్తావించకుండా ఉండటం సాధ్యమవుతుందా? బహుశా ఒక ప్రశ్నను మనం అడగవచ్చు, భారతీయ జాతీయవాదం (దేశభక్తి లేదా గుర్తింపు..ఈ రెంటింటిలో మీ ఇష్టం వచ్చిన పదాన్ని ఎంచుకోండి) మూలాలు 18వ శతాబ్దం తర్వాతి కాలానికి చెందినవా?

02/23/2016 - 05:31

‘‘కన్హయ కుమార్‌ను ఏ చట్టం కింద అరెస్ట్ చేయాలి? అసలు అరెస్టు చేయాలా? వద్దా? అతడు నిర్దోషి - ఎవరో కావాలని దొంగ వీడియో సృష్టించారు’’..ఇండియా టుడేలో ప్రచురితమైన కథనమిది. జెఎన్‌యులో అల్లర్లు జరిగినప్పుడు కన్హయ అక్కడ లేడు. ఎవరో దుర్మార్గులు క్యాంపస్‌ను అల్లరిపాలు చేయాలని-విద్యార్థులలో దూరి ఇలా చేశారు. ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

02/22/2016 - 02:22

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతీ నగర ప్రాంతంలో తొలి ప్రభుత్వ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 17న భూమిపూజ చేస్తూ, ఆ ప్రాంత గత వైభవ పునఃప్రతిష్ఠకు ఆ విధంగా శ్రీకారం జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఛానళ్లలో చూసినవారికి, ఆ మాటలంటున్న సమయంలో తన స్వరంలో, మొహంలో కూడా ఒకింత ఉద్వేగం కనిపించి ఉండాలి.

02/19/2016 - 23:39

యుద్ధరంగంలో వైమానిక శక్తి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రాధాన్యతకు తగినట్టుగానే యుద్ధ విమానాల కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయకా తప్పదు. నేడు ఒక ఆధునిక యుద్ధ విమానం ఖరీదు కొన్ని వందల కోట్ల మేర ఉంటోంది. వీటి ధరలు ఇంకా విపరీతంగా పెరుగుతున్నాయి. 2007లో మొత్తం 126 బహుళ పోరాట విమానాల (ఎంఆర్‌సిఎ) కోసం రూ. 42,000 కోట్ల మేర బడ్జెట్‌ను మన ప్రభుత్వం ప్రతిపాదించింది.

02/19/2016 - 04:42

స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. దేశభక్తులెవరో, దేశ వ్యతిరేకులెవరో ఇప్పుడు ప్రస్ఫుటమైంది.

02/18/2016 - 06:52

జాతి వ్యతిరేక ప్రవృత్తి పెరిగిపోతుండడానికి ప్రధాన కారణం బ్రిటిష్ వారు వదలిపెట్టి వెళ్లిన బౌద్ధిక వారసత్వం. అద్వితీయ జాతీయత మన దేశపు అనాది స్వభావం. అనేకానేక వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేకపోవడం ఈ వౌలిక స్వభావం. పరస్పర పరిపోషకాలైన వైవిధ్యాలు సనాతన భూమిగా, అజనాభంగా, భరత ఖండంగా హిందుస్థానంగా వినుతికెక్కిన మనదేశపు అద్వితీయ జాతీయతలో భాగం కావడం చరిత్ర. బ్రిటిష్ వారు ఈ చరిత్రను చెరచిపోయారు.

Pages