S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

01/18/2016 - 07:26

తెలుగు తల్లి, తెలంగాణ తల్లి ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు నవ్వ టం ఎట్టకేలకు మొదలైనట్లేనా? ఇరు రాష్ట్రాల ప్రజలకు కూడా వారిద్దరి ఉమ్మడి దీవెనలు లభించనున్నట్లేనా? అది జరగాలే గాని మొత్తం తెలుగు ప్రజలంతా సంతోషిస్తారంటే విభేదించేవారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. ఈ రెండు గడ్డల నుంచి మొదలుకొని దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ అది ఆనందించదగ్గ పరిణామమే అవుతుంది.

01/17/2016 - 07:37

వరుసగా మూడో ఏడాది కూడా విద్యాభివృద్ధికై విరాళాన్ని ఇవ్వడంలో అజీమ్ ప్రేమ్‌జీ మూడో స్థానంలో నిలిచాడు. ఈయన ఇచ్చిన విరాళం రూ.27,514 కోట్లు. ఈయన తర్వాత నందన్ నీలేఖని, నారాయణమూర్తి, కె.దినేష్, శివనాడార్‌లు వరుసగా వున్నారు. ఆసుపత్రులకు విరాళాన్ని ఇచ్చే వర్గాల్లో దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబాని పదో స్థానంలో వున్నాడు.

01/15/2016 - 07:57

అవినీతిపై సమరభేరి మోగించిన అన్నాహజారే వొకప్పటి అనుచరుడు, ఆమ్‌ఆద్మీ పార్టీ పేరున గత ఫిబ్రవరి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఢిల్లీ పీఠం మీద కూర్చున్న అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తమ సహజలక్షణమైన ‘అరాచకవాదం’ బయటపెట్టుకున్నారు. ప్రధాని మోదీని సైతం పిరికిపంద అని మానసిక రోగి అని తులనాడారు. ముఖ్యమంత్రి అయినా ఆయన నోటిదురుసుతగ్గలేదు.

01/14/2016 - 04:04

పాకిస్తాన్ ప్రభుత్వం వారి మాటలను విశ్వసించకుండా పోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని దేశ వ్యవహారాల శాఖామాత్యులు రాజనాథ్‌సింగ్ జనవరి పనె్నండవ తేదీన ప్రకటించడం చారిత్రక పునరావృత్తి! జనవరి రెండవ తేదీన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక దళం స్థావరంపై దాడి చేయించినవారు పాకిస్తాన్‌లో నక్కి ఉన్నారు. ఈ నక్కి ఉన్న జిహాదీ బీభత్సకారులను పసికట్టి పట్టుకొని పాకిస్తాన్ ప్రభుత్వం వారిని శిక్షించగలదట!

01/13/2016 - 07:03

‘త్రిపుర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు?’అని అడిగితే పదికి ఒకరిద్దరు సరియైన సమాధానమిస్తే అది విశేషమే అవుతుంది. అవును మరి శ్రీ మాణిక్‌సర్కార్ అంత నిరాడంబరమైన ముఖ్యమంత్రి. కానీ ‘దిల్లీకి ముఖ్యమంత్రి ఎవరు?’ అని అడిగితే పదికి పదిమందీ సరియైన సమాధానమే చెపుతారు. అవును మరి! చెప్పుకోదగిన స్థిరమైన మంచి పని ఏదీ చేయకపోయినా శ్రీ అరవింద్ కేజ్రీవాల్ తనకుతాను అంత పబ్లిసిటీ తెచ్చుకున్న ముఖ్యమంత్రి.

01/12/2016 - 06:54

న్యూఢిల్లీలో ఔరంగజేబు రోడ్డు ఉంది. దానిని అబ్దుల్‌కలాం రోడ్‌గా మార్చాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కొందరు వ్యతిరేకించారు. ఇందుకు కారణం ఏమిటి? ఔరంగజేబు రోడ్డును ఛత్రపతి శివాజీరోడ్‌గా మారిస్తే అభ్యంతరం చెప్పేవారు ఉండవచ్చు కాని కలాంరోడ్డుగా మారిస్తే తప్పేమిటి? అంటే కలాం దేశభక్తుడైన ముస్లిము. ఔరంగజేబు ఈ దేశాన్ని దోచుకున్నవాడు.

01/11/2016 - 04:40

ఏవైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సున్నితమైన మనోభావాలతో ముడిబడిన అంశాలను ప్రస్తుతానికి పక్కన ఉంచి, ఇతరత్రా సంబంధాల అభివృద్ధికి ప్రయత్నించాలన్నది అంతర్జాతీయ దౌత్యనీతి సూత్రాలలో ఒకటి. ఆర్థికం, సాంస్కృతికం వంటి రంగాలలో సంబంధాలు మొదట మెరుగుపడుతూ పోతే, ఉద్రిక్తతలకు ఆలవాలమైన అంశాలపై క్రమంగా సానుకూల దృక్పథాలు ఏర్పడతాయని, అప్పుడు వాటి పరిష్కారం తేలికవుతుందని ఈ నీతి సూత్రం భావిస్తుంది.

01/10/2016 - 04:22

‘వీలైనంత మేరకు విదేశీ పర్యటనలను తగ్గిస్తాను...’ అంటూ కొత్త సంవత్సరం కానుకగా మోదీ ప్రకటించడం హర్షించతగ్గ విషయమే! ప్రధానమంత్రి పదవి చేపట్టిన మోదీ అతి తక్కువ కాలంలోనే అత్యధికంగా విదేశీ పర్యటనలు చేసిన ప్రధానమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఇంతే మోతాదులో ప్రతిపక్షాలనుంచి, స్వపక్షం నుంచి కూడా విమర్శల్ని ఎదుర్కొన్నారు.

01/09/2016 - 04:09

ఆర్థిక సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ దౌత్యాలు, అధికార లబ్దికై వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఇవన్నీ సరే..అసలు దేశరక్షణ మాటేమిటి? ఉత్తరకొరియా ఈనెల 6న హైడ్రోజన్ బాంబును పరీక్షించి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొరియా రెండుగా చీల్చబడిన తరువాత ఉత్తర కొరియాపై చైనా ఆధిపత్యం పెరిగింది.

01/08/2016 - 06:11

పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడి సందర్భంగా మరోసారి మన భద్రతావ్యవస్థలో లొసుగులు బయటపడ్డాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ, కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంజాబ్ ప్రభు త్వం పంపిన నివేదిక, భారత వైమానిక దళానికి చెందిన కోర్టు చేసిన విచారణ.. ఇవన్నీ భద్రతా లోపాలనే ఎత్తిచూపాయి. అంతేకాదు నాలుగు రోజులపాటు కొనసాగిన ఈ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో రెండు మిస్టరీలకు సమాధానం లభించాల్సి ఉంది.

Pages