S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయన్ ఫీచర్
లోక్‌సభకు, అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్రం న్యాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానించాలి. ప్రధానిగా రెండవసారి ఎన్నికైన తర్వాత మోదీ లోక్‌సభతో పాటు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించారు.
ఎన్నికలు వస్తే చాలు.. హామీల సునామీ మనకు కొత్తేమీ కాదు. గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని, తాము అధికారంలోకి రాగానే సరికొత్త సంక్షేమ పథకాలు అమలుచేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయడం పరిపాటి. ఒకప్పుడు జాతీయ అంశాలు ఎన్నికల వేళ ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉండేవి. ఆ తర్వాత జాతీయ సమస్యలు ప్రధానాస్త్రాలుగా మారాయి.
నీళ్లు, నిధులు, నియామకాల్లో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనాదిగా తీరని అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలే ఇపుడు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘ఉత్తరాంధ్ర గోడు’ ఆలకించి, దానిపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.
దశాబ్దం క్రితం వరకు భారత రాజకీయాలలో వామపక్షాలు నిర్ణయాత్మక పాత్ర వహిస్తూ వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర వహించాయి. జాతీయ స్థాయిలో వా మపక్షాలు లేకుండా ఎటువంటి రాజకీయ కూటమి ఏర్పాటైనా ప్రయోజనం ఉండబోదనే అభిప్రాయం ఉండేది. భాజపాతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అవగాహనకు వస్తే వామపక్షాలకు కోపం వస్తుందనే భయంతో చాలా రాజకీయ పక్షాలు భాజపాను దాదాపు అంటరాని రాజకీయ పక్షంగా చూస్తూ వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య బంధాలను పటిష్టం చేసేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐక్యతతో చేస్తున్న కృషి వల్ల సమీప భవిష్యత్తులో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి ఆంధ్ర, తెలంగాణ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే.
లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రుల హడావుడిలో మన దేశం నిమగ్నమైన వేళ సందట్లో సడేమియా అన్నట్టు తీవ్రవాద సంస్థలు పంజా విసిరాయి. దేశంలో నాలుగు చోట్ల ఏకకాలంలో విమానాల హైజాకింగ్‌కు హెచ్చరికలను జారీ చేశాయి. గతంలో హైజాకింగ్‌ను కళ్లారా చూసి, తీవ్రవాదుల డిమాండ్లకు మోకరిల్లిన భారత్ ఆ తర్వాత అప్రమత్తంగానే ఉంటూ, హైజాకర్లపై కఠిన చర్యలకు ‘హైజాకింగ్ వ్యతిరేక బిల్లు’ తీసుకువచ్చింది.
గత ఆదివారం నాడు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పసికందులు చనిపోయారనే వార్త ప్రకంపనలు సృష్టించింది. ఆసు పత్రిలో, అదీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి మరణాలు సహజమే అని సరిపుచ్చుకునే వారికి ఇదొక వార్తలా కనిపించదు. అయితే, గడచిన అయిదు మాసాల వ్యవధిలో అదే ఆసుపత్రిలో సరైన వైద్యం అందక అక్షరాలా 168 మంది పసికూనల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయనే విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపడక మానరు.
లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో అంతర్గతంగా ఒక రకమైన సంక్షోభానికి దారితీసింది. విజయం లభిస్తే అందరూ తమ ఘనకార్యం అనుకొంటారు. కానీ పరాజయాలకు బాధ్యత వహించేవారు చాలా అరుదు. పలువురు నేతలు రాజీనామాకు సిద్ధపడినా అది కేవలం తాత్కాలిక ప్రచారం కోసమే.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నాయకత్వంలో కొ త్త ప్రభుత్వం ఏర్పాటు, అధికార పార్టీకి అసెంబ్లీలో తిరుగులేని ఆధిపత్యం, నూతన ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రమాణ స్వీకారం, లోక్‌సభకు వైకాపా నుంచి 22 మంది ప్రాతినిధ్యం వహించడం.. వంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు.
మానవ జాతి ఆవిర్భావం నుండే నేరాలు ఏదో ఒక రూపంలో జరుగుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న కొద్దీ నేర స్వభావంతో పాటు దర్యాప్తుల తీరుతెన్నులు మారుతున్నాయి. తెలివైన నేరస్థులు తమ నేరచర్యలకు శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. మరో వైపు పోలీసులు, దర్యాప్తు సంస్థలు తాతల నాటి దర్యాప్తు నిఘా విధానాలను పక్కన పెట్టి ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు.