S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

05/08/2019 - 01:37

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే రాఫెల్ ఒప్పందం ప్రకంపనలు సృష్టించనుందా? ఈ విషయమై దాఖలైన రివ్యూ పిటిషన్లతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టు దిక్కారణ పిటిషన్‌ను కూడా ఒకే రోజు విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటిస్తూ తదుపరి విచారణను మే 10వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఈ రెండు అంశాలపై మే 14లోగా విచారణ జరిగే అవకాశం ఉంది.

05/05/2019 - 02:03

ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే సమయానికి తుపాను విరుచుకు పడడం.. వరి, మామిడి, అరటి, బొప్పాయి, కొబ్బరి, ఉద్యాన పంటలు తీవ్రస్థాయిలో ధ్వంసం కావడం.. కర్షకులు కడగండ్లపాలు కావడం ఆనవాయితీగా మారింది. తుపాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసి, పండిన పంట నోటికి అందడం లేదు. ఫలితంగా రైతుకు రుణభారం పెరుగుతోంది. పంట దిగుబడులు తగ్గడంతో నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్నాయి.

05/03/2019 - 23:06

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేప ట్టడానికి మూడు, నాలుగేళ్లు వాయిదా వేస్తూ చివరకు అన్యమనస్కంగానే పార్టీ పగ్గాలు చేపట్టగా, ఆయన సోదరి ప్రియాంగా గాంధీ సహితం రాజకీయ ప్రవేశం గురించి దాటవేస్తూ చివరకు అక స్మాత్తుగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బాధ్య తలు చేపట్టారు. పైగా, పార్టీ చాలా బలహీనంగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లోని ఒక భాగంలో పార్టీకి పునర్జీవనం కలిగించే గురుతరమైన బాధ్యతను ఆమెపై ఉంచారు.

05/03/2019 - 01:40

పండిత మదనమోహన మాలవ్యా స్వాతంత్య్ర సమరంలో గొప్ప దేశభక్తుడు. వందేళ్ల క్రిత మే విద్య ఆవశ్యకతను గుర్తించాడు. అందుకోసం దేశమంతా తిరిగి చందాలు పోగుచేసి కాశీలో బనారస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. మాలవ్యాకు తెలియకుండా ఆయన సమీప బంధువు ఒకరిని ఆ విశ్వవిద్యాలయ అధికారులు ఓ పెద్ద ఉద్యోగంలో నియమించారు. ఈ విషయం తెలిశాక మాలవ్యా డా.రాధాకృష్ణన్‌కు లేఖ రాసి ‘వెంటనే నా బంధువును విధుల్లోంచి తొలగించాలని’ కోరారు.

05/02/2019 - 02:00

శ్రీలంకలో ఇటీవల ‘ఐసిస్’ ఉగ్రవాదులు జరిపిన మారణహోమం తరహా దారుణాలను ఎదుర్కొనే శక్తి భారత్‌కు ఉందా? మతోన్మాద ఉగ్రవాద సంస్థల దుశ్చర్యలను పసిగట్టే యంత్రాంగం మన దేశంలో లేదు. ఉగ్రవాదులు భారీ హింసాకాండకు పాల్పడ్డాక మన పాలకులు ఘనమైన ప్రకటనలు చేస్తుంటారు. ఆ హడావుడి ముగిశాక ఉగ్రవాద నిరోధక యంత్రాంగాల ఏర్పాటు గురించి పట్టించుకోరు.

05/01/2019 - 01:40

ముసలి సింహం నూతిలో నుండి తనను కాపాడాలని అరుస్తుంటే ఓ వ్యక్తి జాలిపడి పైకి లాగాడట! ఇపుడు చైనా చేస్తున్నది అదే.. కాకపోతే మరో రకంగా నరుక్కుంటూ వస్తోంది. ‘మీకు డబ్బు ఇస్తాం, రవాణా మార్గాలు మెరుగుపరచండి లేదా మేమే మీకు నౌకాశ్రయాలను, విమానాశ్రయాలను నిర్మించడంలో సహకరిస్తాం’ అని చెబుతోంది.

04/28/2019 - 02:09

మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాలను, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి ‘ఇండియన్ యూ నియన్’గా వ్యవహరిస్తున్నారు. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైనట్టు భారత్‌ను కూడా కొన్ని దేశాలుగా విడదీయాలని చైనా, పాకిస్తాన్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యూహంలో కాంగ్రెస్‌తోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు చిక్కుకున్నాయి.

04/26/2019 - 22:26

అత్యంత కీలకమైన 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏడుదశలలో ఇప్పటికే మూడు దశల పోలింగ్ ముగిసింది. 300కు పైగా అం టే సుమారు 60 శాతం ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. దేశంలో చాలాప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. భాజపాకు కీలకమైన ఉత్తరాది-హిందీ రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ జరగవలసి ఉంది.

04/26/2019 - 02:03

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై మూడు రోజులు, మాజీ సీఎం మాయావతి ప్రచారంపై రెండు రోజులు నిషేధం విధించింది. ఎన్నికల ర్యాలీలో మాయావతి మా ట్లాడుతూ-‘ముస్లింలు మహాకూటమికే వోటు వేయాలి’ అన్నది. దానికి కౌంటర్‌గా యోగి- ‘కాంగ్రెస్,ఎస్పీ, బీఎస్పీలకు అలీపై నమ్మకముంటే మాకు భజరంగబలీపై విశ్వాసముంది’ అన్నాడు. మాయావతి చర్య జరిపితే,యోగి ప్రతిచర్యగా వ్యాఖ్యానించాడు.

04/25/2019 - 01:40

రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తకుండా మన రా జ్యాంగ నిర్మాతలు ముందుచూపుతో శాసన, న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు అధికారాలు కట్టబెడుతూనే ‘లక్ష్మణరేఖ’లను నిర్దేశించారు. ప్రతి వ్యవస్థ తన పరిధిలో ఉండాలి. అధికారాలున్నాయి కదా అని హద్దు మీరరాదు.

Pages