S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

09/08/2017 - 00:35

అమెరికాలో ఓ బ్రోకర్ పెద్ద ఘనకార్యం తలపెట్టాడు. భారత్‌లో చాలారోజులు దళారీగా పనిచేసి ప్రమోషన్‌పై అతడు అమెరికా వెళ్లాడు. అక్కడ ఓ అమాయకుడైన, అందగాడైన భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పట్టుకున్నాడు. ‘నిన్ను ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా, డొనాల్డ్‌ట్రంప్ అల్లుడిగా చేస్తే నాకు ఏమి ఇస్తావ’ని అతడ్ని దళారీ అడిగాడు. ‘నాకంత సీన్ లేదులే’ అన్నాడు సాఫ్ట్‌వేర్ కుర్రాడు.

09/07/2017 - 01:40

శిలాభద్రుడు అన్నవాడు మతాచార్యుడుగా చెలామణి అయిన భోజన బీభత్సకారుడు! సంన్యాసులు రోజుకు ‘ఒకేసారి’ భోజనం చేయాలి, ఆరోగ్యవంతులైన గృహస్థులు రోజుకు ‘రెండుసార్లు మాత్రమే’ భోజనం చేయాలి. పిల్లలు, వృద్ధులు, నిరంతర శారీరక శ్రమ చేసేవారు, రోగులు ఎక్కువసార్లు తినవచ్చు. ఇదీ జీవన నియమం కావడం సనాతన భారత జాతీయ తత్త్వం! ఈ నియమాన్ని ఉల్లంఘిస్తున్నవారు భోజన బీభత్సకారులు!

09/05/2017 - 23:49

స్వేచ్ఛ లేని బతుకు ఎంత దుర్భరమైనదో అప్పుడప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న వాళ్ళకు బాగా అనుభవానికి వస్తుంది. ఒకరి దయాదాక్షిణ్యాల వల్ల దొరికిన పంచభక్ష్య పరమాన్నాల కన్నా.. మన ఇంట్లో మన చేతులతో తయారుచేసుకుని తిన్న పచ్చడి మెతుకులైనా ఎంతటి రుచిని, సంతృప్తిని ఇస్తాయో స్వయంసేవ చేతనైన వాళ్ళకు బాగా అర్థమవుతుంది.

09/04/2017 - 23:34

అధ్యాపక వృత్తికి వనె్న తెచ్చిన దివంగత మాజీ రాష్టప్రతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని భారత జాతి యావత్తూ ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా పాటిస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ అయిదవ తేదీన ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ వారిని సముచిత రీతిన సత్కరించుకోవడం ఆనవాయితీగా మారింది.

09/03/2017 - 23:03

నిప్పు పవిత్రమైందని అది చెడును దహించివేస్తుందని అనుకుని అజాగ్రత్తగా వుంటే- అది మనల్ని కూడా దహించివేస్తుంది. మతం కూడా నిప్పులాంటిదే! నియంత్రణ కరువైన మతం వ్యక్తుల్నే కాదు, యావత్ సమాజాన్ని నాశనం చేస్తుంది. మతం నేడు ఏ సామాజిక సమస్యకూ పరిష్కారం చూపకపోగా, మరిన్ని సమస్యల్ని సృష్టిస్తోంది.

09/03/2017 - 00:49

పట్టుదల ఒక్కటే సరిపోదు, దా నికి తెలివి కూడా జోడించిన వాడే పనిమంతుడు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల సంకేతమిదే! ఈ రెండు ఫలితాలు విజేతలకు, పరాజితులకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. ప్రజాభిమానాన్ని ఓటు రూపంలో మలచుకోవడంలో విఫలమైన జగనన్న, కొద్దినెలల తేడాతో మూడు అద్భుత పరాజయాలు మూటకట్టుకోవలసి వచ్చింది.

09/02/2017 - 00:07

దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల వ్యక్తి స్వేచ్ఛ- గోప్యతకు సంబంధించి వెలువరించిన తీర్పు రాజ్యాంగ వ్యాఖ్యానంలో అతి ప్రధానమైనది. ఎందుకంటే తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ తీర్పులో వెలిబుచ్చిన వ్యాఖ్యలు అనేక చట్టాలమీద, అంశాలమీద ప్రభావం చూపుతాయి. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని ఇప్పటివరకు భావిస్తున్నారు.

09/01/2017 - 00:07

‘వోల్ఫ్ మెసింగ్’ రష్యాలో ప్రసిద్ధి పొందిన మహిమాన్వితు డు. 1910లో అతడు యువకుడిగా ఉన్నప్పుడు ఇంటి నుండి పారిపోయాడు. అలా వెళ్తూ రైలెక్కాడు. కానీ అతని దగ్గర టిక్కెట్ లేదు. అందువల్ల రైలు పెట్టెలో సీటు కింద దాగున్నాడు. కొద్దిసేపు అయ్యాక టి.సి. వచ్చి ‘యంగ్‌మాన్.. యువర్ టికెట్?’ అని ప్రశ్నించాడు. మెసింగ్‌కు ఏం చేయాలో పాలుపోక మనస్సునంతా ధ్యానంలోకి తీసుకొని అక్కడ పడివున్న పేపర్ ముక్కపై తన ధారణ పెట్టాడు.

08/31/2017 - 00:09

ఉభయ పక్షాలను ప్రవేశవించవద్దని చెప్పిరా పోవయ్యా..’ అన్నది గ్రామాధికారి జారీ చేసిన ఆజ్ఞ! ఈ గ్రామాధికారి ‘పటేలు’ లేదా ‘రెడ్డి’ లేదా గ్రామ మునసబు! ఆజ్ఞను పొందినవాడు రెడ్డిగారి ఆధికారిక సేవకుడు. అంటే ‘కావలివాడు’ లేదా ‘తలవరి’.. ‘ఉభయ పక్షాలు ప్రవేశించకూడని దానికి, నేను తమరితో మొరపెట్టుకున్నందువల్ల నాకు కలిగిన లాభం ఏమిటి?’ అన్నది భూమి యజమాని అడిగిన ప్రశ్న!

08/29/2017 - 23:22

‘టి-మాస్’.. ఇది యూట్యూబ్ లాంటి ఏ సోషల్ మీడియానో, ఏ టెలివిజన్ చానల్ పేరో కాదు. ‘ప్రజా గాయకుడు’ గద్దర్ నాయకత్వంలో వివిధ ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరు ‘టి-మాస్’. ఈ ఏడాది జూలై నెలలో హైదరాబాద్‌లోని ఎల్.బి.నగర్‌లో ఓ ఫంక్షన్ హాలులో దీని ఆవిర్భావాన్ని ఘనంగా ప్రకటించారు. ఈనెల 20వ తేదీన మహబూబ్‌నగర్‌లో మరో సభను నిర్వహించారు.

Pages