S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

08/05/2017 - 23:35

అవసరార్థం చేసే రాజకీయాలు తాత్కాలికంగా సంతోషం కలిగిస్తాయి. ప్రత్యర్ధుల బిక్కముఖం చూడాలన్న వారి ఆనందమూ తాత్కాలికమే. కానీ దాని వల్ల తలెత్తే భవిష్యత్తు పరిణామాలు ఎవరూ పట్టించుకోరు. ఇప్పటి రాజకీయాల్లో దూరదృష్టి లేదు, తాత్కాలిక ప్రయోజనాలే! తమ నిర్ణయాలే తమకు భస్మాసుర హస్తంగా మారతాయని తెలిస్తే ప్రపంచం తల్లకిందులవుతుందన్న భయం మొదలవుతుంది.

08/05/2017 - 02:17

చైనా యువతకు, విద్యార్థులకు ‘జాక్ మా’ పేరు ఒక ఉత్ప్రేరకం. ఆమాటకొస్తే అతను ఇప్పుడు ప్రపంచమంతటినీ ఆకర్షిస్తున్న వ్యక్తి. ఆయన కమ్యూనిజం బోధించడం లేదు, క్యాపిటలిజం గురించి చెప్పడం లేదు. వర్తమాన జీవితాన్ని ఆస్వాదించాలని బలంగా చెబుతున్నాడు. ఆయన ఎంచుకున్న మార్గం ఆన్‌లైన్ వ్యాపారం. ఆయన సంస్థ పేరు ‘అలీబాబా డాట్ కామ్’.

08/04/2017 - 00:36

ఓ తాగుబోతు తూలుతూ ఆసుపత్రికి వెళ్లాడు. తన ఆరోగ్యం అసలు బాగోలేదని వైద్యునితో మొరపెట్టుకున్నాడు. వైద్యుడు అతణ్ణి అన్నివిధాలా పరీక్షించి, ‘నువ్వు తాగుడు మానేయకపోతే ఆరునెలల్లో చచ్చిపోతావు’అని తేల్చిచెప్పాడు. తాగిన మైకంలో వున్న ఆ రోగి వైద్యుడు చెప్పిన మా టలు పచ్చి అబద్ధమన్నాడు. సరే! నీ ముందు ఓ ప్రయోగం చేస్తానని వైద్యుడు రెండు గాజు గ్లాసులు తెప్పించాడు.

08/03/2017 - 00:13

చైనా దళాలు మన ఉత్తరఖండ్‌లోకి కూడా చొరబడిపోవడం విస్తరిస్తున్న దురాక్రమణ విష వ్యూహానికి సరికొత్త సాక్ష్యం! భూటాన్‌లోను, మన సిక్కింలోను విస్తరించి ఉన్న ‘డోక్‌లా’ పచ్చిక మైదానంలోకి చైనా దళాలు చొరబడి తిష్ఠవేసి ఉండడం ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ ప్రకంపనల ఉద్ధృతి తగ్గకపూర్వమే చైనా దళాలు ఉత్తరఖండ్‌లోని చమోలీ జిల్లాలోని బారాబోటీ ప్రాంతంలోకి జూలై ఇరవై ఐదవ తేదీన చొరబడ్డాయట!

08/02/2017 - 03:09

‘ భూతల స్వర్గం’ అని అందరూ కీర్తిస్తున్న అమెరికాలో నిజంగా మన వాళ్లకు భద్రత లేదా? మన ఐటి ఉద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా, అలవికాని విధంగా ఉందా? మన నేలపై ఉంటూ మన టీవీ చానళ్లలో చూస్తే ఇలానే అనిపిస్తుంది. కానీ, అమెరికాకు వెళ్లి చూస్తే మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ‘అమెరికా దృశ్యాల’ను హైదరాబాద్ నగరం నుంచే ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకుని తెలుగు చానళ్లు కథలు అల్లాయి.

07/31/2017 - 02:00

‘ప్రపంచాన్ని, ప్రజల్ని ప్రేమించకపోతే నేను చదువులోకి ప్రవేశించలేను...’ అన్న బ్రెజిల్ విద్యాతత్వవేత్త పాలోఫ్రేరీ మాటలు మన భారతీయ విద్యారంగానికి అన్వయిస్తే అంతా విలోమంగానే ఉంటుంది. చుట్టూ వున్న సమాజానికి దూరంగా, ప్రజల శ్రమశక్తిని గుర్తించడం కాదు, తృణీకరించే విధంగా మన విద్యావిధానం కొనసాగుతున్న విషయం తెలిసిందే!

07/30/2017 - 01:05

ఈ దేశాన్ని ఒక చాయ్‌వాలా ఏలుతాడని జనం సహా ‘కమలదళాలూ’ ఏనాడూ ఊహించి ఉండరు. మోదీ ఛాతీనుద్దేశించి- ‘దేశానికి కాబోయే ప్రధాని’ రాహుల్‌బాబు ఎన్నిసార్లు వ్యంగ్యాస్త్రాలు సంధించినా, దాని వెడల్పు ఏమిటన్నది ఈపాటికి ప్రపంచమే చూసింది. తెలుగు మీడియా మోతుబరి ఒకరు ప్రధాని మోదీని ఆ మధ్య ‘అనకొండ’తో పోల్చారు.

07/29/2017 - 00:11

చైనా సామ్రాజ్యవాద కాంక్షను భారత్ ధీరోదాత్తంగా అడ్డుకుంటున్నది. చైనా విస్తరణ వాదాన్ని నియంత్రిస్తున్న భారత్ ప్రయత్నాలను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. అవసరమైతే భారత్ పక్షాన నిలబడి పోరాటం చేస్తామని మద్దతు కూడా ప్రకటించాయి. ఆసియా ఖండంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భారత్ గౌరవ ప్రతిష్ఠలకు ఇదొక నిదర్శనం.

07/28/2017 - 00:47

అధికారం కోసం కన్నతండ్రిని బందీని చేసి, ఆయనకు ప్రీతిపాత్రుడైన తన సొంత అన్నను నరికి- ఆ తలకాయను బహుమతిగా తండ్రికి పంపించిన ‘సెక్యులర్ మహానుభావుడు’ ఔరంగజేబు. ఈ మొఘల్ చక్రవర్తి అధికారం కోసం ప్రదర్శించిన అసహనం అంతా ఇంతా కాదు. అధికార వారసత్వం కోసం తన తండ్రి షాజహాన్ వృద్ధుడయ్యేవరకో, మరణించే వరకో వేచి చూడకుండా అతణ్ణి జైల్లో బంధించాడు. తనను బంధించి ఔరంగజేబు సింహాసనం ఎక్కాడు కదా!

07/27/2017 - 00:42

చైనా మనకు శత్రుదేశమన్నది ధ్రువపడిన వాస్తవం. చైనా వస్తువులను మనం కొనకుండా వాటిని బహిష్కరించడం దేశభక్తికి చిహ్నం, జాతీయతా నిష్ఠకు, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ దీక్షకు నిదర్శనం! ప్రజల మనోభావాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం చైనా వస్తువుల దిగుమతిని నిషేధించడం జనాదేశానికి అనుగుణమైన పరిణామం కాగలదు. ఈ పరిణామక్రమాన్ని నిరోధించడానికి యత్నించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను జనం హర్షించరు!

Pages